For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రంప్ షాకింగ్: ఆరోగ్య బీమా లేదా, డబ్బు చెల్లించలేరా.. ఐతే అమెరికాలోకి ఎంట్రీ లేదు

|

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇతర దేశాల నుంచి వలస వచ్చేవారిపై ప్రభావం చూపుతుంది. అమెరికన్లకే ఉద్యోగాలు అంటూ అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఆ దిశగా ఇప్పటికే హెచ్‌1బీ వీసా సహా పలు నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా ఆరోగ్య బీమాలేని లేదా వైద్య ఖర్చులను భరించే స్తోమతలేని వారిని దేశంలోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. అమెరికా ఆరోగ్య పరిరక్షణ విభాగానికి భంగం కలిగించని వారికి మాత్రమే వీసాలు జారీ చేస్తామని జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిబంధన వచ్చే నెల (నవంబర్) 3వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది.

చదవండి: మీ పీఎఫ్ ఖాతాలో వడ్డీని చూసుకోవడం ఎలా?

30 రోజుల్లో...

30 రోజుల్లో...

వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు ఇక నుంచి తాము 30 రోజుల్లోగా ఆరోగ్య బీమా తీసుకుంటామని లేదా ఆరోగ్య ఖర్చులు తామే భరించగలమని హామీ ఇవ్వాలి. అలా ఇవ్వని పరిస్థితుల్లో వీసాను తిరస్కరిస్తారని ఉత్తర్వుల్లో ఉంది. అక్రమ వలసదారులను అడ్డుకొని, అమెరికా పౌరులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

మరింత క్లిష్టతరం

మరింత క్లిష్టతరం

అమెరికా రావాలనుకునే వారికి ఈ నిర్ణయం మరింత క్లిష్టమైనదే. అంటే ఆరోగ్య బీమా లేకపోతే ఇబ్బందులు తప్పవు. బీమా లేకపోయినా లేదా వైద్య ఖర్చులను సొంతగా భరించగలమని నిరూపించలేని వారు ఇమ్మిగ్రెంట్ వీసా ద్వారా రావడాన్ని ఇకపై అనుమతించరు. దీనికి బీమా లేదా ఆర్థికపరమైన ఆధారం.. ఈ రెండింటిలో ఏదో ఒకటి చూపించాలి.

నెల రోజుల్లో పూర్తి చేయాలి..

నెల రోజుల్లో పూర్తి చేయాలి..

వీసా దరఖాస్తు చేసుకునే వారు నెల రోజుల్లో పైవాటిని చూపించాలి. అమెరికాలో అడుగుపెట్టాక ఇస్తామంటే కుదరదు. ఆరోగ్య రక్షణ వ్యవస్థను, పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాలను కాపాడేందుకు, అమెరికా పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, పరిహారం రాని ఆరోగ్య ఖర్చుల వల్ల గత పదేళ్లలో ప్రతి ఏటా 35 బిలియన్ డాలర్లకు పైగా వ్యయం అయినందు వల్ల కూడా కొత్త ఆంక్షలు అంటున్నారు.

భారతీయులపై ప్రభావం

భారతీయులపై ప్రభావం

తెలిసినవారి ద్వారా అంటే దగ్గరి బంధువులు లేదా మిత్రుల ద్వారా అమెరికాకు 35వేల మంది వరకు భారతీయులు వెళ్తుంటారని అంచనా. తాజా నిర్ణయంతో వీరిపై ప్రభావం పడుతుందని అంటున్నారు. అమెరికాలో వలసదారులు స్థిరపడటానన్ని క్లిష్టతరం చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. తాత్కాలిక టూర్, వర్క్ రిలేటెడ్ వీసాలకు ఇమ్మిగ్రెంట్ వీసా భిన్నం. అమెరికా పౌరులు స్పాన్సర్ చేసినవారికి లేదా గ్రీన్ కార్డుదారులు స్పాన్సర్ చేసినవారికి వీటిని మంజూరు చేస్తారు.

English summary

Trump’s order will deny visas to immigrants who lack health care coverage

President Donald Trump on Friday signed a proclamation suspending entry of immigrants who will not be covered by health insurance within 30 days of entering the United States or do not have the means to pay for their healthcare costs themselves.
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more