For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సైబర్ మోసాలపై టెక్నాలజీ సంస్థల ఉమ్మడి యుద్ధం!

|

శివరామ్ (పేరు మార్చాం) వ్యాపారి. అతడు ప్రారంభించిన వ్యాపారంలో మరింత పెట్టుబడికి డబ్బు అవసరమైంది. ఏదైనా బ్యాంకును సంప్రదించి రుణం తీసుకుందామా? అని ఆలోచిస్తుండగానే అతడి మొబైల్ ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ఉద్యోగులైనా, వ్యాపారులైనా పర్వాలేదు.. అతి తక్కువ వడ్డీ రేటుకే రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పర్సనల్ లోన్ ఇస్తామని, డాక్యుమెంట్ల తతంగం కూడా పెద్దగా ఉండదని, అక్కడ ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి కొన్ని వివరాలు సమర్పిస్తే చాలునని, 48 గంటల్లో రుణం తాలూకు నగదు బ్యాంకు ఖాతాలో జమ అవుతుందనేది ఆ మెసేజ్ సారాంశం. ఇంకేముంది, దేవుడే తనను ఆదుకోవడానికి మెసేజ్ రూపంలో దర్శనమిచ్చాడని భావించి.. ఆ లింక్ క్లిక్ చేసి వాళ్లు అడిగిన వివరాలన్నీ ఇచ్చేశాడు. ఆ మర్నాడే అతడి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.1.5 లక్షలు మాయం అయ్యాయి.

రాకేష్ (పేరు మార్చాం) ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. ఇటీవల అతడి మొబైల్‌కి ఓ మెసేజ్ వచ్చింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో అతడు చెల్లించిన ఆదాయపు పన్నుకు సంబంధించి రూ.15,490 రిఫండ్ మంజూరు అయిందని, త్వరలోనే ఆ మొత్తం అతడి బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని, కాబట్టి ఒకసారి అతడి ఖాతా సంఖ్యను సరిచూసుకోవాలని, ఒకవేళ ఆ మెసేజ్‌లో ఇచ్చిన అతడి ఖాతా సంఖ్య తప్పుగా ఉన్నట్లయితే, అక్కడ ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా సరైన వివరాలను అప్‌డేట్ చేయాలనేది ఆ మెసేజ్ సారాంశం. ఇంకేముంది.. పదిహేను వేలు వెనక్కి వస్తున్నాయి కదాని రాకేష్ ఆ లింక్‌పై క్లిక్ చేసిన తన ఖాతాకు సంబంధించిన వివరాలు అప్‌డేట్ చేశాడు. అంతే - ఆ డబ్బు రాలేదుగానీ.. అతడి ఖాతాలో ఉన్న రూ.75 వేలు పోయాయి.

అయ్యో.. అనుకుంటున్నారేమోగానీ.. ఇలాంటి మోసాల బారిన మీరూ పడే ప్రమాదం లేకపోలేదు. వీటినే ప్రస్తుతం సైబర్ మోసాలుగా పేర్కొంటున్నారు. వీటిలో ఎన్నో రకాలు ఉన్నాయి. సైబర్ నేరగాళ్ల బారిన పడి రోజూ ఎంతోమంది మోసపోతూనే ఉన్నారు. తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటూనే ఉన్నారు. అందుకే ఇప్పుడు ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు టెక్నాలజీ కంపెనీలు నడుం బిగించాయి. తమ వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఉమ్మడి యుద్ధం మొదలుపెట్టాయి.

పంజా విసురుతున్న సైబర్ మోసగాళ్లు...

పంజా విసురుతున్న సైబర్ మోసగాళ్లు...

మొబైల్ ఫోన్లకు ఎస్సెమ్మెస్‌లు, ఈ-మెయిల్ ఐడీలకు మెయిల్స్ పంపుతూ సైబర్ మోసగాళ్లు అమాయక ప్రజలను దోచుకుంటున్నారు. ఈ తరహా మోసాలకు ఎక్కువగా గ్రామీణప్రాంత ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఎంతో తెలివైన వాళ్లు కూడా వీరి మాయలో పడి సర్వం పోగొట్టుకుంటున్నారు. అసలు సిసలు కంపెనీగా భ్రమింపజేస్తూ.. ఎస్సెమ్మెస్‌లు, ఈ-మెయిల్స్ పంపుతూ విద్యావంతులను కూడా సైబర్ మోసగాళ్లు బురిడీకొట్టిస్తున్నారు. ఆకర్షణీయమైన ఆఫర్లతో తప్పుదోవ పట్టించే మెసేజ్‌లతో వల విసురుతుండడంతో ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఎప్పుడో ఒకసారి ఆ ఆఫర్లకు ఆశపడి ఆయా లింకులపై క్లిక్ చేసి పలువురు సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు.

7 కంపెనీల ఉమ్మడిపోరు...

7 కంపెనీల ఉమ్మడిపోరు...

సైబర్ మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకోకుండా తమ వినియోగదారులను కాపాడుకోవాలన్న లక్ష్యంతో 7 ఇంటర్నెట్ టెక్నాలజీ సంస్థలు రంగంలోకి దిగాయి. పర్యాటక సేవల సంస్థ మేక్‌ మై ట్రిప్, ఓయో హోటల్స్ అండ్ హోమ్స్, మొబైల్ చెల్లింపు సేవల సంస్థ పేటీఎం, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటోలతోపాటు క్యాబ్ సేవల సంస్థ ఉబర్.. మరికొన్ని సంస్థలు కలిసి ఉమ్మడి పోరు ప్రారంభించాయి. సైబర్ మోసాల తీరుతెన్నులు, నివారణ చర్యలపై చర్చించేందుకు ఈ సంస్థలు ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)తో కూడా సమావేశమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేకాదు, ఈ కంపెనీలు ఈ విషయమై ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)తోపాటు టెలికాం నెట్‌వర్క్ ప్రొవైడర్ ఎయిర్‌టెల్ తదితర సంస్థలతోనూ సమావేశమవుతున్నాయి.

ఎలా మోసగిస్తున్నారంటే...

ఎలా మోసగిస్తున్నారంటే...

సైబర్ నేరగాళ్లు నకిలీ బ్యాంకు ఖాతాలు, నకిలీ టోల్‌ ఫ్రీ నంబర్ల ద్వారా.. వినియోగదారులకు వల విసురుతున్నారు. అసలైన వెబ్‌సైట్ల పేజీల మాదిరిగా భ్రమింపజేసేలా నకిలీ వెబ్‌సైట్ పేజీలు సృష్టించి, వాటిలో నకిలీ టోల్ ఫ్రీ నంబర్లు ప్రముఖంగా కనిపించేలా చేస్తూ.. వివిధ కారణాలతో ఆ నంబర్లకు ఫోన్ చేసే వినియోగదారుల నుంచి గుట్టుమట్లు లాగుతున్నట్లు తెలుస్తోంది. వినియోగదారుల వ్యక్తిగత వివరాలను తెలుసుకునేందుకు వారు ఎక్కువగా ఎస్బీఐ ఖాతాలపై ఆధారపడుతున్నారు. దీనికోసం దాదాపు 4000 సిమ్ కార్డు నంబర్లను వారు ఉపయోగిస్తున్నారని, అలాగే 350-400 వరకు ఎస్బీఐ ఖాతాల వివరాలు కూడా సైబర్ మోసగాళ్ల వద్ద ఉన్నట్లు టెక్ కంపెనీలు గుర్తించాయి. దీంతో ఈ విషయాన్ని అటు ఆర్బీఐ, ఎస్బీఐ, టెలికాం కంపెనీలతోపాటు సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ దృష్టికి కూడా తీసుకెళ్లాయి.

ఎస్బీఐకి టెక్ కంపెనీల లేఖ...

ఎస్బీఐకి టెక్ కంపెనీల లేఖ...

సైబర్ మోసగాళ్లు అనుసరిస్తున్న విధానాలను గుర్తించిన టెక్ కంపెనీలు ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఓ లేఖ కూడా రాశాయి. ఎస్బీఐ ఖాతాలను ఉపయోగించి భారీ స్థాయిలో జరుగుతున్న సైబర్ మోసాల గురించి ఆ లేఖలో టెక్ కంపెనీలు వివరించాయి. ఖాతాదారులను మోసగించేందుకు, కీలకమైన వివరాలు తెలుసుకునేందుకు సైబర్ మోసగాళ్లు ఎక్కువగా ఎస్బీఐ ఖాతాలనే వాడుతున్నాయని, ప్రస్తుతం ఎస్బీఐలో ఎన్నో బ్యాంకులు కలిసిపోయి దేశంలోనే అతిపెద్ద బ్యాంకుగా అవతరించడం కూడా నేరగాళ్లకు బాగా కలిసివస్తోందని, అంత పెద్ద వ్యవస్థలో ఇలాంటి మోసాలను ఎస్బీఐ కూడా గుర్తించలేకపోతోందని ఈ కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. అందుకే ఈ సైబర్ మోసాలపై తమ వినియోగదారుల్లో మరింత అవగాహన కల్పించే దిశగా అవసరమైన చర్యలు కూడా తీసుకుంటున్నాయి.

English summary

7 internet companies join hands to fight against online fraud

Seven leading internet companies are banding together to save their consumers from the rising menace of cyber frauds being carried out by duping innocent users, where the money is being siphoned
Story first published: Sunday, October 6, 2019, 19:36 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more