For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు బంగారం లాంటి అవకాశం, భారత్ రండి: అమెరికాలో మోడీ పిలుపు

|

భారత ప్రభుత్వం కార్పోరేట్ ట్యాక్స్‌ను తగ్గించిందని, తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రపంచ వ్యాపార వర్గాలకు విజ్ఞప్తి చేశారు. కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు అనేది అద్భుత అవకాశమని, ఈ గోల్డెన్ ఆపర్చ్యునిటీని ఉపయోగించుకోవాలన్నారు. న్యూయార్క్‌లోని బ్లూమ్‌బర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరమ్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వ్యాపార అవకాశాలను మెరుగుపరిచేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలిపారు. ఆయన అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 40కి పైగా గ్లోబల్ సంస్థల సీఈవోలతో మోడీ సమావేశమయ్యారు.

కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు కేవలం ప్రారంభం మాత్రమే అన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని, భవిష్యత్తులో మరిన్ని ప్రోత్సాహకర సంస్కరణలు ఉంటాయన్నారు. కార్పొరేట్లు, సంపద సృష్టికర్తలకు తమ ప్రభుత్వం చాలా గౌరవం ఇస్తోందన్నారు. వ్యాపారాన్ని మరింత సులభతరం చేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యం, జనాభా, ఆదరణ, నిర్ణయాత్మక శక్తి వంటి 4 అంశాలే భారత వృద్ధిరేటుకు కీలకమన్నారు. రాజకీయ సుస్థిరత, ఆమోదయోగ్యమైన విధానాలు, స్వతంత్ర న్యాయ వ్యవస్థలు పెట్టుబడులకు భద్రతను ఇస్తాయని చెప్పారు.

వావ్! ట్రాన్సాక్షన్ ఫెయిలైతే బ్యాంకులే రూ.100 చెల్లిస్తాయి!!

మీకు బంగారం లాంటి అవకాశం, భారత్ రండి: అమెరికాలో మోడీ పిలుపు

పెట్టుబడులకు అనుకూలమైన మార్కెట్ కోసం ఎదురు చూస్తున్నారా... అయితే భారత్ రావాలని, అతిపెద్ద మార్కెట్ కలిగిన స్టార్టప్స్ పెట్టుబడులు పెట్టాలనుకున్నా.. తమ దేశం రావాలని కోరారు. ఎక్కువ మౌలిక సదుపాయాలుకలిగిన దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే తమ దేశం మంచి ఆప్షన్ అని చెప్పారు. సులభతర వాణిజ్యం కోసం 50 చట్టాలను రద్దుచేశామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం మూడు నాలుగు నెలలు మాత్రమే అయిందని, ఇది కేవలం ఆరంభమే అన్నారు.

భారత్ 2024-25 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రస్తుతం 1 ట్రిలియన్ డాలర్లను ఆర్థిక వ్యవస్థను జోడించామని చెప్పారు. గత ఐదేళ్లలో 286 బిలియన్ డాలర్ల ఫారన్ ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చాయన్నారు. అంతకుముందు రెండు దశాబ్దాలతో పోలిస్తే ఇది దాదాపు సగం అన్నారు. భారత్ రావాలని, ఎక్కడైనా గ్యాప్ ఉంటే తాను ఓ బ్రిడ్జిలా వ్యవహరిస్తానని వ్యాపారవేత్తలకు హామీ ఇచ్చారు.

దాదాపు మూడు దశాబ్దాల్లోనే కనిష్ఠ స్థాయికి దేశంలో కార్పొరేట్ పన్ను రేటును గత వారం నరేంద్ర మోడీ ప్రభుత్వం తగ్గించింది. 30 శాతానికి పైగా ఉన్న కార్పోరేట్ ట్యాక్స్‌ను 22 శాతానికి పరిమితం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ కంపెనీలు భారత్‌కు క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే భారత మార్కెట్లలో కార్పోరేట్ తగ్గింపు జోష్ కనిపించింది.

English summary

Golden opportunity for investment in India after corporate tax cut: Modi

PM Narendra Modi on Wednesday invited the global business community to invest in India, saying that his government's recent move on corporate tax cut has created a golden opportunity for investment.
Story first published: Thursday, September 26, 2019, 7:37 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more