For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

FM Nirmala Sitharaman: గుడ్‍‌న్యూస్.. కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు, కండిషన్స్ అప్లై

|

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. ఉద్దీపన చర్యల్లో భాగంగా తయారీ రంగ సంస్థలకు కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపును 22 శాతానికి ప్రతిపాదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దేశీయ కంపెనీలు, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు ఊతమిచ్చేందుకు కార్పోరేట్ పన్ను తగ్గించాలని నిర్ణయించారు. ఇది మార్కెట్లకు కొత్త జోష్ తీసుకు వచ్చింది. సెన్సెక్స్ నిమిష నిమిషానికి దూసుకెళ్లింది.

శుక్రవారం నిర్మలా సీతారామన్ మీడియా సమావేశంలో కీలక ప్రకటనలు చేశారు. ఆదాయపన్ను చట్టంలో కొత్త నిబంధన తీసుకు వస్తున్నట్లు తెలిపారు. ఈ నిబంధన 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుందన్నారు. దేశీయ కంపెనీలు 22 శాతం రేటుతో పాటు ఆదాయ పన్ను చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు.

కార్పోరేట్ పన్ను రేటును 25.17 శాతానికి తగ్గింపు

కార్పోరేట్ పన్ను రేటును 25.17 శాతానికి తగ్గింపు

ఏదైనా సంస్థ ప్రోత్సాహకాలు లేదా మినహాయింపులు పొందని పక్షంలో మాత్రమే FY20లో 22 శాతం ఆదాయ పన్ను చెల్లించే అవకాశం ఉంది. సర్‌ఛార్జ్, సెస్ కలిపి కార్పోరేట్ పన్ను రేటును 25.17 శాతానికి తగ్గిస్తున్నారు. ఈ ఉద్దీపనల కోసం రూ.1.45 కోట్లను ప్రకటించారు. అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటయ్యే కొత్త దేశీయ తయారీ రంగ సంస్థల ఆదాయ పన్ను 15 శాతానికి తగ్గించారు. దీంతో కొత్త సంస్థలకు కార్పోరేట్ పన్ను 17.01 శాతంగా ఉంటుంది.

15 శాతం చెల్లించవచ్చు కానీ కండిషన్..

15 శాతం చెల్లించవచ్చు కానీ కండిషన్..

ఈ ప్రకటనతో కార్పోరేట్ ట్యాక్స్ ప్రస్తుతం ఉన్న 30 శాతం నుంచి 15 నుంచి 20 శాతానికి తగ్గుతుంది. పెట్టుబడులు ఆకర్షించేందుకు, మేకిన్ ఇండియాను ప్రోత్సహించేందుకు అక్టోబర్ 1వ తేదీ నుంచి ఏర్పాటయ్యే ఏ దేశీయ తయారీ సంస్థ అయినా ఆదాయ పన్నును 15 శాతం చెల్లించవచ్చునని నిర్మల చెప్పారు. అయితే ఇక్కడ ఓ కండిషన్ ఉంది. ఎలాంటి మినహాయింపులు, ప్రోత్సాహకాలు పొందని సంస్థలకు ఇది వర్తిస్తుంది.

లిస్టెడ్ కంపెనీలకు బెనిఫిట్స్

లిస్టెడ్ కంపెనీలకు బెనిఫిట్స్

లిస్టైన కంపెనీలకు కూడా నిర్మలా సీతారామన్ బెనిఫిట్స్ ప్రకటించారు. జూలై 5, 2019 లోపు బైబ్యాక్ ప్రకటన చేసిన కంపెనీలకు వాటాల కొనుగోలుపై ఎలాంటి అధిక సర్‌ఛార్జ్ ఉండదని తెలిపారు. అంతేకాకుండా మూలధన లాభాలపై అధిక సర్‌ఛార్జ్ ఉండదని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం, పీఎస్‌యూ, ప్రభుత్వ నిధులతో పని చేసే యూనివర్సిటీలు, ప్రయోగశాలలు వంటి వాటికి అందించే ఇంక్యుబేటర్లపై CSR (కార్పోరేట్ సోషల్ రెస్బాన్సిబులిటీ)ని 2 శాతం ఖర్చును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.

English summary

FM Nirmala Sitharaman announces Rs.1.45 Lakh Crore Package, Cuts Corporate Tax

FM Nirmala Sitharaman today proposed to slash the corporate tax rates for domestic companies and new manufacturing companies, apart from other ebenfits, which could cost the government Rs 1.45 lakh crores.
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more