For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మాంద్యం ఎఫెక్ట్: 20% తగ్గిన ఈ కామర్స్ సేల్స్, ఆశలన్నీ పండుగల అమ్మకాలపైనే

|

దేశంలో మాంద్యం అన్ని రంగాలను చుట్టేస్తోంది. తాజాగా ఇది ఈ కామర్స్ రంగంలోనూ స్పష్టం ఐంది. ఈ ఏడాది తోలి ఆరు నెలల కాలానికి (జనవరి నుంచి జూన్ వరకు ) అమ్మకాలు ఏకంగా ఐదో వంతు తగ్గిపోయాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కాంటర్ ను ఉటంకిస్తూ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో ఈ విషయాన్నీ వెల్లడించింది. ఈ మధ్య కాలం లో ఈ కామర్స్ కంపెనీలు డిస్కౌంట్లను తగ్గించటం తో పాటు, కొనుగోళ్లు మందగించటం తో ఈ పరిస్థితి తలెత్తినట్లు ఈటీ పేర్కొంది. అయితే, ఇకపై అమెజాన్, ఫ్లిప్కార్ట్ సహా అన్ని బడా ఈ కామర్స్ కంపెనీలు పండుగల సీజన్లో సేల్స్ పైనే గంపెడు ఆశలు పెట్టుకున్నాయి. ఒక్కో వ్యక్తి సగటు కొనుగోలు శాతం గతేడాది ఇదే కాలంతో పోల్చితే 27% తగ్గిపోగా, వినియోగం 21% తగ్గినట్లు కాంటర్ పరిశోధనలో వెల్లడైందని ఈటీ తెలిపింది. ఆర్థిక మందగమనం అన్ని రకాల వినియోగ సరళి లో ప్రతిబింబిస్తోంది. ఇది ఆన్లైన్ షాప్పింగ్లోనూ కనిపిస్తోంది. ఏదైనా కొనుగోలు చేసే ముందు వినియోగదారులు జాగ్రత్తగా ఉంటున్నారు అని కాంటర్ ఇన్ సైట్స్ డివిజన్ ఎండీ హేమంత్ మెహతా తెలిపారు.

డెబిట్ కార్డు కంటే క్రెడిట్ కార్డు చాలా భద్రం, ఎందుకో తెలుసా

భారీగా తగ్గిన మొబైల్స్, ఫాషన్...

భారీగా తగ్గిన మొబైల్స్, ఫాషన్...

ఈ కామర్స్ అమ్మకాల్లో అధికంగా ప్రభావితం ఐంది మొబైల్ ఫోన్లు, ఫాషన్ ఉత్పత్తులే. మొబైల్ ఫోన్ల అమ్మకాలు 17% పడిపోగా, ఫాషన్ అమ్మకాల్లో 16% క్షీణత నమోదైంది. అయితే, అమ్మకాల సరళి పండుగల సీజన్లో కూడా పెద్దగా పెరిగే సూచనలు లేవని తెలుస్తోంది. ఈ సారి పండుగల సందర్భంలో అమ్మకాలు 25% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇది అంత క్రితం ఏడాదిలో నమోదైన 35% వృద్ధి తో పోల్చితే తక్కువే కావడం గమనార్హం. అమ్మకాల సరళిని అర్థం చేసుకొనేందుకు సుమారు 50,000 మంది ఆన్లైన్ కొనుగోలుదారులతో చర్చించి కాంటర్ ఈ నివేదికను వెల్లడించింది. ఇందులో ఒకప్పుడు మందగమనం ఎఫెక్ట్ సోకని రంగం ఆన్లైన్ షాపింగ్ అనే అభిప్రాయం ఉండేది. కానీ, ప్రస్తుతం ఆ అభిప్రాయం నిజం కాదని స్పష్టమైంది. ఎందుకంటే, దాదాపు అన్ని రంగాల్లోనూ అమ్మకాలు నెమ్మదించాయి.

డిస్కౌంట్లు తగ్గటం ...

డిస్కౌంట్లు తగ్గటం ...

ఈ కామర్స్ రంగం చాలా పోటీ తో కూడుకొన్నది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి దిగ్గజాలు కొనుగోలుదారులను ఆకర్షించేందుకు భారీగా డిస్కౌంట్లను ఆఫర్ చేస్తాయి. ఈ పోటీ ని తట్టుకోవడం చిన్న తరహా ఈ కామర్స్ కంపెనీలను చాలా కష్టం. అయితే, మార్కెట్ లీడర్ గా ఎదిగేందుకు ఎంత డిస్కౌంట్ ఐన ఇవ్వగల వ్యూహాలను గత 5-6 ఏళ్లుగా ఇవి అనుసరించాయి. కానీ అటు ఆఫ్ లైన్ విక్రేతల నుంచి, ఇటు ప్రభుత్వం నుంచి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో ఈ కామర్స్ కంపెనీలు డిస్కౌంట్లను తగ్గించివేశాయి. డికౌంట్ల కోత సుమారు 50% వరకు ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో, కొనుగోలుదారులు ఆచితూచి వ్యవహించారు. ప్రస్తుత మార్కెట్లో వినియోగదారులు ఒక ప్రోడక్ట్ కొనే ముందు కనీస పరిశోధన చేస్తున్నారు. ఒకే బ్రాండ్ ఉత్పత్తి ఎక్కడ తక్కువకు లభిస్తే అక్కడి నుంచే కొనుగోలు చేస్తున్నారు. దీంతో, డిస్కౌంట్లు ఆపడం వల్ల వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేసుకొంటున్నారు. బిగ్ బిలియన్ డేస్, ఫెస్టివ్ ఆఫర్స్ అంటూ భారీ డిస్కౌంట్లు ఇచ్చినప్పుడే నచ్చిన వస్తువును కొనుగోలు చేస్తున్నారు.

పండుగలే కాపాడాలి...

పండుగలే కాపాడాలి...

ఇప్పటికే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ప్రకటించే ముందు సన్నాహాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఫ్లిప్కార్ట్ దాదాపు అన్ని రకాల ఉత్పత్తులపై 50% నుంచి 70% వరకు ఆఫర్స్ ప్రకటిస్తుంది. అదే సమయంలో అమెజాన్ కూడా పండుగ ఆఫర్ల ను భారీగానే అందిస్తుంది. మిగితా ఈ కామర్స్ కంపెనీలు ఈ స్థాయిలో కాకున్నా వాటి రేంజ్ కు అవి మెరుగైన ఆఫర్లను ప్రకటిస్తాయి. అందుకే, కొనుగోలుదారులు ఈ సీజన్ కోసం వెయిట్ చేస్తారు. భారీ డిస్కౌంట్ ఉన్నప్పుడే ప్రోడక్ట్ లు ఆర్డర్ చేస్తారు. అందుకే, ఈ కామర్స్ కంపెనీలు అన్ని కూడా పండుగల సేల్స్ పైనే భారీ ఆశలు పెట్టుకొన్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంయుక్తంగా ఒక్క అక్టోబర్ నెల లోనే సుమారు 5 బిలియన్ డాలర్ల (రూ 35,000 కోట్లు) మేరకు అమ్మకాలను నమోదు చేయాలని టార్గెట్ పెట్టుకున్నాయి.

రూ 2.70 లక్షల కోట్ల మార్కెట్...

రూ 2.70 లక్షల కోట్ల మార్కెట్...

భారత్ లో ఈ కామర్స్ రంగం అంతకంతకూ పెరుగుతోంది. నాస్ కామ్ అంచనా ప్రకారం 2018-19 లో ఈ కామర్స్ రంగం 38.5 బిలియన్ డాలర్లు (రూ 2.70 లక్షల కోట్లు ) గా ఉంది. 2017-18 లో మన దేశం లో ఈ మార్కెట్ పరిమాణం 33 బిలియన్ డాలర్లు (రూ 2.31 లక్షల కోట్లు )గా నమోదైంది. ఈ మార్కెట్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంపెనీలదే సింహ భాగం కావడం విశేషం. అయితే, ఈ సారి వృద్ధి రేటులో ఆర్థిక మందగమనం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి, ఈ ఏడాది ఈ కామర్స్ రంగ పరిమాణం ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది.

English summary

Recession effect: Lower discounts, economic slump take toll

Consumer spending on online shopping sites is estimated to be down by about a fifth in the first half of the year to June as etailers have cut discounts and the growth slump has hit buying sentiment across sectors.
Story first published: Monday, September 16, 2019, 12:31 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more