For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPO బేజారు, పబ్లిక్ ఇష్యూలోకి వచ్చినా... భయాలెన్నో

|

న్యూఢిల్లీ: 2019 సంవత్సరం ముగియడానికి ఇంకా మూడున్నర నెలలు మాత్రమే గడువు ఉంది. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు వచ్చిన ఐపీవోలు కేవలం 11 మాత్రమే. ఈ సంస్థల నుంచి సమీకరించింది రూ.10,300 కోట్లు. తద్వారా ఈ ఏడాది ఐపీవో (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) జోరు బాగా తగ్గినట్లుగా అర్థమవుతోంది. 2018 ఏడాదిలో మొత్తం 24 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు రాగా రూ.30,959 కోట్లు సమీకరించగా, ఇప్పుడు పడిపోయాయి.

మూడ్ ఆఫ్ ది నేషన్: పదేళ్ల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందంటే?

పబ్లిక్ ఇష్యూలోకి వచ్చినా...

పబ్లిక్ ఇష్యూలోకి వచ్చినా...

మార్కెట్లో అనిశ్చితి కారణంగా పబ్లిక్ ఇష్యూలోకి వచ్చినా సరైన స్పందన ఉండకపోవచ్చునని కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయని రిలయన్స్ సెక్యూరిటీస్ హెడ్ (రీసెర్చ్) నవీన్ తెలిపారు. స్మాల్, మిడ్ క్యాప్ కేటగిరీ షేర్లు భారీగా దిద్దుబాటుకు లోనయ్యాయని, ఇది ప్రాథమిక మార్కెట్ పైన ప్రభావం చూపిందన్నారు. 2017లో 36 ఐపీవోల ద్వారా రూ.68,000 కోట్లు సమీకరించగా, ఇది రికార్డ్.

మాంద్యం భయం

మాంద్యం భయం

మార్కెట్ ఆటుపోట్ల మధ్య నడుస్తోందని, దీంతో రాబోయే మరికొన్ని నెలల్లో పరిస్థితి ఇలాగే ఉండవచ్చునని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం భయాల కారణంగా మార్కెట్లు ఊగిసలాటలో ఉన్నాయని, ఈ ఏడాది ప్రారంభం నుంచి సుమారు పది శాతం వరకు సూచీలు నష్టపోయాయని, ఈ దెబ్బకు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి కార్పోరేట్ సంస్థలు కూడా వెనుకడుగు వేస్తున్నాయని చెబుతున్నారు.

ఐపీవో పక్కన పెడితే.. పెట్టుబడులు వెనక్కి..

ఐపీవో పక్కన పెడితే.. పెట్టుబడులు వెనక్కి..

ఆర్థికమాంద్యం భయం నేపథ్యంలో ఐపీవో అంశాన్ని పక్కన పెడితే వ్యాపార విస్తరణ కోసం పెట్టుబడులను కూడా వెనక్కి తీసుకుంటున్నాయని చెబుతున్నారు. రానున్న కొద్ది నెలలు ఐపీవో మార్కెట్ గడ్డు పరిస్థితులను ఎదుర్కోక తప్పదని చెబుతున్నారు.

పలు కారణాలు...

పలు కారణాలు...

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో తిరోగమనంతో పాటు దేశీయంగా కూడా పరిస్థితులు సంక్లిష్టంగా మారటం స్టాక్ మార్కెట్‌ను ఆటుపోట్లలోకి నెట్టాయి. అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం రావణకాష్టంలా రగులుతోంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసింది. చైనా ఆర్థిక వ్యవస్థ కూడా తిరోగమనంలో ఉంది. రూపాయి విలువ తగ్గింది. వీటికి తోడు దేశీయంగా మార్కెట్ పరిస్థితులు నిరాశగా కనిపిస్తున్నాయి. మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడింది.

ప్రత్యామ్నాయ మార్గాల్లో సమీకరణ

ప్రత్యామ్నాయ మార్గాల్లో సమీకరణ

ఏ కంపెనీ అయినా విస్తరణ ప్రణాళికలు, వర్కింగ్ కేపిటల్ అవసరాలు, రుణభారం తగ్గించుకోవడానికి మార్కెట్ నుంచి నిధులను సమీకరిస్తుంది. కానీ ప్రస్తుతం పరిస్థితులు ఆశాజనకంగా లేవనిచెబుతున్నారు. అందుకే పబ్లిక్ ఇష్యూల మార్కెట్ మందగమనంతో కొనసాగుతోందని చెబుతున్నారు. గత ఏడాది కాలంలో పబ్లిక్ ఇష్యూకు అనుమతి కోరుతూ 90 కంపెనీల వరకు సెబికి దరఖాస్తు చేశాయి. కానీ ఇష్యూకు వచ్చిన కంపెనీలు 10 శాతం కూడా లేవు. మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇష్యూకు వచ్చి ఇబ్బందులు పడటం కంటే ప్రత్యామ్నాయ మార్గాల్లో సమీకరించడం మంచిదని భావిస్తున్నాయి.

షేర్ల నమోదు ధర కంటే ఎక్కువ...

షేర్ల నమోదు ధర కంటే ఎక్కువ...

స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్, స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్, అఫిల్ ఇండియా, చాలెట్ హోటల్స్, రెయిల్ వికాస్ నిగమ్, మెట్రోపోలిస్ హెల్త్ కేర్, పాలిక్యాబ్ ఇండియా వంటి సంస్థలు ఈ ఏడాది ఐపీవోకు వచ్చాయి. ఆసక్తికర విషయం ఏమంటే ఇందులో పలు కంపెనీలు షేర్ల నమోదు ధర కంటే ఎక్కువే ట్రేడ్ అవుతున్నాయి. ఎస్బీఐ జనరల్ ఇన్సురెన్స్‌కు ప్రస్తుతానికి అదనపు మూలధనం అవసరం లేకపోవడంతో పబ్లిక్ ఇష్యూ ప్లాన్ నుంచి విరమించుకుంది.

English summary

IPO market sees a dry spell this year, only 11 companies hit bourses

With just over three months to go for the year-end, only 11 companies have hit the capital markets so far in 2019 garnering over ₹10,000 crore through initial share sales, much lower than 24 firms raising ₹30,959 crore in entire 2018.
Story first published: Monday, September 16, 2019, 10:23 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more