For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బడ్జెట్‌లో కేటాయింపు ఇలా, కేంద్రం నుంచి అందిన నిధులెంత అంటే?

|

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుమతితో ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన సభలో 2019-20కి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. గత ఫిబ్రవరిలో ఉభయ సభలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు సెప్టెంబర్ 30వ తేదీకి ముగియనుంది. ఈ నేపథ్యంలో మిగతా ఆరు నెలలకు గాను బడ్జెట్ ప్రవేశపెట్టారు. కొత్త రాష్ట్రంలో తెలంగాణ గత ఐదేళ్లలో అద్భుత ప్రగతి సాధించిందని సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా పేర్కొన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్డీసీ వృద్ధి రేటు 10.5 శాతంగా ఉందని తెలిపారు.

కొత్త జరిమానాలు షాకిస్తున్నాయి.. ఈ డ్రైవర్‌కు రూ.86,500 ఫైన్

మొత్తం బడ్జెట్

మొత్తం బడ్జెట్

- బడ్జెట్ మొత్తం రూ.1,46,492.3 కోట్లు

- రెవెన్యూ వ్యయం - రూ.1,11,055 కోట్లు

- మూలధన వ్యయం - రూ.17,274.67 కోట్లు

- బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ.2,044.08 కోట్లు

- ఆర్థిక లోటు రూ.24,081.74 కోట్లు

రైతు బంధు పథకానికి....

రైతు బంధు పథకానికి....

- రైతు బంధు పథకానికి రూ.12,000 కోట్లు

- ఆసరా పెన్షన్లకు రూ.9,402 కోట్లు

- రైతు బీమా ప్రీమియం కోసం రూ.1137 కోట్లు

- విద్యుత్ సబ్సిడీల కోసం రూ.8,000 కోట్లు

- మున్సిపాలిటీలకు రూ.1,764 కోట్లు

- గ్రామపంచాయతీలకు రూ.2,714 కోట్లు

పంటరుణ మాఫీ కోసం...

పంటరుణ మాఫీ కోసం...

- పంట రుణమాఫీ కోసం రూ.6,000 కోట్లు

- విద్యుత్ సబ్సిడీ కోసం రూ.8,000 కోట్లు

- ఆరోగ్యశ్రీకి ఏడాదికి రూ.1,336 కోట్లు.

- అభివృద్ధి, సంక్షేమం కోసం అయిదేళ్లలో రూ.5,37,373 కోట్లు ఖర్చు చేశాం

- కేంద్రం నుంచి అందినవి రూ.31,802 కోట్లు

పరిపాలనా సౌలభ్యం కోసం...

పరిపాలనా సౌలభ్యం కోసం...

- 43 రెవెన్యూ డివిజన్లు ఉండగా 69కి పెంచాం.

- 459 మండలాలు ఉండగా 584 మండలాలుగా పెంచాం

- గతంలో 68 మున్సిపాలిటీలు ఉండగా 142కు పెంచుకున్నాం.

- కొత్తగా 7 మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, 13కి పెంచాం.

- గతంలో 8,690 గ్రామ పంచాయతీలు ఉంటే ప్రస్తుతం 12,751 ఉన్నాయి.

- రెవెన్యూ డివిజన్లలో 28 డీఎల్పీవోల సంఖ్యను 68కి పెంచాం

- పోలీస్ కమిషనరేట్ల సంఖ్యను 9కి పెంచాం.

- పోలీస్ సబ్ డివిజన్ల సంఖ్యను 163కి పెంచాం.

- పోలీస్ సర్కిళ్ల సంఖ్యను 717కి పెంచాం.

- పోలీస్ స్టేషన్ల సంఖ్యను 814కి పెంచాం.

కేంద్రం నుంచి అందిన నిధులు ఎంతంటే?

కేంద్రం నుంచి అందిన నిధులు ఎంతంటే?

18 నెలలుగా ఆర్థిక మాంద్యం కొనసాగుతోందని, మాంద్యం ఉన్నా తాము వ్యవసాయం, సంక్షేమ రంగాలకు అత్యధిక నిధులు కేటాయించామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పారు. రైతు బంధు నిరంతరం కొనసాగుతుందన్నారు. కేంద్రం నుంచి తాము ఒక్క రూపాయి అదనంగా అడగలేదన్నారు. కేంద్రం నుంచి పథకాల కోసం అందిన నిధులు కేవలం రూ.31,802 కోట్లు మాత్రమే అన్నారు.

నిధుల కొరత లేకుండా చర్యలు

నిధుల కొరత లేకుండా చర్యలు

కొత్త పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల ద్వారా మరింత ఉత్తమ సేవలు అందిస్తామని కేసీఆర్ చెప్పారు. స్థానిక సంస్థలకు నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చే నిధులతో సమానంగా రాష్ట్రం ఇస్తోందన్నారు. గ్రామ పంచాయతీలకు ప్రతి నెల రూ.339 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. 1,03,551 కోట్ల రూపాయల మూలధన వ్యయం పెరిగిందని, పెట్టుబడి వ్యయం ఆరు రెట్లు పెరిగిందన్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ సుసంపన్నమైందని, తెలంగాణ సుస్థిర ఆర్థిక అభివృద్ధి సాధిస్తోందన్నారు.

రూపాయి పడిపోయింది, తగ్గిన వాహనాల అమ్మకాలు

రూపాయి పడిపోయింది, తగ్గిన వాహనాల అమ్మకాలు

రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయిందని కేసీఆర్ దేశ, జాతీయ ఆర్థిక మాంద్య ప్రభావాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి తగ్గిందన్నారు. వాహనాల అమ్మకాలు 10.65 శాతం మేర తగ్గాయన్నారు. మాంద్యం కారణంగా ఆదాయం తగ్గినా పరిస్థితి మెరుగు పడుతుందన్నారు. ఆదాయ వనరులను బట్టి ప్రాధాన్యతలను మారుస్తుంటామని చెప్పారు.

పెరిగిన ఐటీ ఎగుమతులు...

పెరిగిన ఐటీ ఎగుమతులు...

వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. మిషన్ భగీరథతో నీటి సమస్యను పరిష్కరించామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ 5.8 శాతం వృద్ధి సాధించిందన్నారు. ఐటీ ఎగుమతుల విలువ రూ.1,10,000 కోట్లకు చేరుకున్నాయని చెప్పారు. విద్యుత్ సంస్థలకు సింగరేణి చెల్లించాల్సిన బకాయిలు రూ.5772 కోట్లు ప్రభుత్వం చెల్లించినట్లు తెలిపారు. రైతుల ఉచిత విద్యుత్ కోసం ఇప్పటి వరకు రూ.20,950 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినట్లు తెలిపారు. ఉదయం పథకం ద్వారా రుణభారం రూ.9,696 కోట్లు ప్రభుత్వమే భరించిందన్నారు. అన్ని శాఖల్లో ఉన్న బకాయిలు తక్షణమే చెల్లింపు జరుపుతామని, దీని కోసం బడ్జెట్‌లో తగిన కేటాయింపులు చేశామన్నారు. బకాయిలు చెల్లించిన తర్వాతే కొత్త పనులు చేపట్టాలని విధాన నిర్ణయం అన్నారు. పరిమితులకు లోబడి ప్రభుత్వ మార్గదర్దేశాల ప్రకారం నిధులను ఖర్చు చేస్తామన్నారు. దీనిపై కార్యదర్శులు, ఆర్థిక శాఖ నుంచి స్పష్టమైన సూచనలు ఉంటాయన్నారు.

English summary

Telangana full budget full details, KCR talks about Rupee and recession

Telangana CM K Chandrashekar Rao presented the full fledged Budget for the financial year 2019-20 in the Assembly on Monday.
Story first published: Monday, September 9, 2019, 12:59 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more