For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్కెట్ దెబ్బ, వినాయక చవితిపై ఆసక్తిచూపని కంపెనీలు, బిజినెస్‌మెన్

|

ముంబై: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం భయాలు కమ్ముకున్నాయి. వివిధ కారణాల వల్ల నిన్నటి వరకు దేశంలోను వివిధ రంగాలు కుదేలయ్యాయి. అమెరికా - చైనా ట్రేడ్ టాక్స్ తిరిగి ప్రారంభమవుతాయనే ఆశలు, గత శుక్రవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనలు వ్యాపార వర్గాలకు ఉత్సాహమిచ్చాయి. దేశవ్యాప్తంగా ఆటో, రియల్ తదితర రంగాలు దెబ్బతిన్నాయి. ఎఫ్ఎంసీజీ తగ్గిపోయింది. గ్రామాల్లో, పట్టణాల్లో రూ.5 బిస్కట్ ప్యాకెట్ కొనుగోళ్లు కూడా తగ్గాయి. ఈ మొత్తం ప్రభావం వినాయక చవితి పైన కూడా పడింది.

ఈ కార్లు మరింత ఖరీదు.. ఐనా డీజిల్ కార్లు అమ్ముతాం: టోయోటా

పావు శాతం తగ్గిన స్పాన్సర్‌షిప్

పావు శాతం తగ్గిన స్పాన్సర్‌షిప్

ప్రధానంగా ముంబై నగరంలో ఈ ప్రభావం కనిపిస్తోంది. ఆర్థిక మందగమన ప్రభావం పెద్ద పెద్ద మండపాలపై కనిపించనప్పటికీ చిన్నమండపాలపై స్పష్టంగా కనిపిస్తోంది. స్పాన్సర్‌షిప్‌లలో 25 శాతం తగ్గుదల ఉంది. ముంబై నగరంలో 13,000 సార్వజనిక్ మండల్స్ ఉన్నాయి. ఇందులో 3,070 పెద్దవి. నగరంలోని సార్వజనిక్ మండల్స్‌ను లొకేషన్, పరిధి ఆధారంగా నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఇవి ప్రకటనల కోసం ఛార్జీలను కూడా వసూలు చేస్తాయి.

ప్రకటనకు రూ.1 లక్ష చార్జ్

ప్రకటనకు రూ.1 లక్ష చార్జ్

అతిపెద్ద గణపతి మండల్స్, ప్రసిద్ద మండల్స్ తమ గేట్ల పైన ప్రకటనల కోసం రూ.1 లక్ష వరకు ఛార్జ్ చేస్తాయి. గణేష్ చతుర్థికి ప్రసిద్ధి గాంచిన లాల్‌బౌగ్ ప్రతి ఏడాది ప్రకటనల నిమిత్తం రూ.10 లక్షలను అందుకుంటుందని చించ్‌పోక్లిచా చింతామణి అధికార ప్రతినిధి సందీప్ పరబ్ అన్నారు. ఇక్కడి గణేష్ మండల్ వందేళ్లను పూర్తి చేసుకుంది.

సంస్థలపై మందగమన ప్రభావం

సంస్థలపై మందగమన ప్రభావం

పెద్ద పెద్ద గణేష్ మండల్స్ కోసం నిధిని సమకూర్చుకునేందుకు స్పాన్సర్‌షిప్ నిమిత్తం వివిధ కంపెనీలను కలవాల్సి ఉంటుందని

అంధేరిచా రాజా ట్రెజరర్ సుబోద్ చిట్నీస్ అన్నారు. ఇదివరకు ఒక్క కంపెనీయే ఐదింటికి స్పాన్సర్ చేసేదని, ఇప్పుడు అవి కేవలం రెండింటికి మాత్రమే చేయగలుగుతున్నాయని, మిగతా వాటి కోసం తాము మరిన్ని కంపెనీలను సంప్రదించాల్సి ఉంటుందన్నారు. ప్రధానంగా టెలికం, ఎఫ్ఎంసీజీ కంపెనీలతో పాటు రియల్ ఎస్టేట్ సంస్థలు గణేష్ మండల్స్ వద్ద ప్రకటనలకు ఆసక్తి చూపిస్తుంటాయి.

పెద్దవి సరే.. చిన్న మండల్స్‌పై ప్రభావం

పెద్దవి సరే.. చిన్న మండల్స్‌పై ప్రభావం

ముంబై నగరంలోని అన్ని గణేష్ మండలాలను సమన్వయం చేసేది

బృహన్‌ముంబై సార్వజనిక్ గణేషోత్సవ్ సమన్వయ సమితి (BSGSS). ఈ ఏడాది స్పాన్సర్‌షిప్స్ 25 శాతం మేర తగ్గాయని BSGSS ప్రెసిడెంట్ నరేష్ అన్నారు. తమది పెద్ద గణేష్ మండల్ కాబట్టి ఎలాగోలా స్పాన్సర్స్ దొరుకుతారని, కానీ ఈ ఏడాది బిల్డర్స్ ఖర్చు పెట్టేందుకు ఆసక్తి కనబరచడం లేదని, కాబట్టి చిన్న మండల్స్ బాగా దెబ్బతింటాయని చెబుతున్నారు.

ఈ మండల్‌కు 80 శాతం ఆదాయం ఇలా...

ఈ మండల్‌కు 80 శాతం ఆదాయం ఇలా...

నగరంలోని అత్యంత సంపన్న మండల్స్‌లో కింగ్స్ సర్కిల్‌లోని గౌడ్ సారస్వత్ బ్రాహ్మిన్ (GSB) సేవా మండల్ ఒకటి. ఇక్కడి వినాయక మండపానికి 80 శాతం ఆదాయం ఇక్కడ జరిపే పూజా రిసిప్ట్, సాధారణ డొనేషన్స్, హుండీ ద్వారా వస్తోంది. 2016లో ఈ గణపతి మండల్ రూ.15 కోట్లు సమీకరించింది.

స్పాన్సర్స్ ద్వారా 20 శాతమే

స్పాన్సర్స్ ద్వారా 20 శాతమే

గత ఏడాది ఈ గణపతి మండపంలో తాము 66,000 పూజలు నిర్వహించామని, ఈ ఏడాది మరో ఆరువేలు మాత్రమే పెరిగే అవకాశముందని, ఇప్పటి వరకు తాము ప్రకటనల ద్వారా కేవలం 20 శాతం ఆదాయం మాత్రమే సమకూర్చుకోగలిగామని GSB ట్రస్టీ సతీష్ నాయక్ అన్నారు.

వరద బాధితులకు కొంత సాయం...

వరద బాధితులకు కొంత సాయం...

ప్రకటనలు లేని సమయంలో తమ మండలిలోని ప్రతి సభ్యుడు కనీసం రూ.2,000 చందా వేసుకొని నిర్వహిస్తామని, అలాగే, స్థానికులు వివిధ మండపం కోసం వివిధ రకాలుగా ఖర్చులు పెట్టేందుకు ముందుకు వస్తారని కుర్లాలోని సర్వోదయ మిత్ర మండలి సభ్యులు వసంత్ మూలిక్ అన్నారు. తమ మండపంలో ఖర్చు రూ.2 లక్షలకు పైగా అవుతుందని, ఈసారి కొంత మొత్తాన్ని వరద ప్రభావ బాధితులకు ఇవ్వాలనుకుంటున్నామని, ఇందుకోసం తాము కాస్ట్ కట్టింగ్ పైన దృష్టి పెట్టామని చెప్పారు. లైటింగ్ తగ్గించడం, డెకరేషన్ ఖర్చు తగ్గించుకోవడంతో పాటు మండపం ఖర్చును రూ.1.5 లక్షలకు కుదించుకోవాలని భావిస్తున్నామని చెప్పారు.

ఎమ్మెల్యే, ఎంపీలను అడుగుదామంటే...

ఎమ్మెల్యే, ఎంపీలను అడుగుదామంటే...

ఆయా మండపాలకు ఇదివరకు రూ.2వేలు ఇచ్చిన వారు ఇప్పుడు రూ.1,000 మాత్రమే ఇవ్వగలుగుతున్నారని మరో మండపం ప్రతినిధి చెప్పారు. స్థానికులతో పాటు ప్రస్తుత ఆర్థిక మందగమనం నేపథ్యంలో కమర్షియల్ అడ్వర్టయిజ్‌మెంట్స్ కూడా తగ్గిపోయాయని చెబుతున్నారు. స్థానికంగా ఉన్న కార్పోరేటర్, ఎమ్మెల్యే, ఎంపీలను ఎక్కువ చందా అడుగుదామంటే.. వారికి కూడా సొంతగా గణేష్ మండల్స్ ఉన్నాయని చెబుతున్నారు. దీంతో వారిని ఎక్కువగా అడిగే పరిస్థితులు లేవని చెబుతున్నారు. మూడేళ్ల క్రితం జరిగిన నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల ట్రేడర్స్ కాస్త ఇబ్బందులు పడుతున్నారు.

స్థానికులు ఇస్తారు.. ప్రకటనలు తగ్గాయి...

స్థానికులు ఇస్తారు.. ప్రకటనలు తగ్గాయి...

ముంబై నగరంలో ముఖ్యంగా మూడు ప్రాంతాల్లో గణేష్ ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయని, తన ఇంట్లో 16 మంది ఉంటారని, ఒక్కొక్కరి పేరు పైన రూ.100 చొప్పున తాము రూ.1,600 మాత్రమే ఇస్తామని, అన్ని మండల్స్‌కు మాత్రం ఇవ్వలేం కదా అని అమర్ అనే ఓ షాప్ ఓనర్ అన్నారు. అయితే ఇక్కడి గణేష్ మండల్స్ ద్వారా స్థానికులు ఏడాది మొత్తం వివిధ ప్రయోజనాలు పొందుతారని, కాబట్టి ఇవ్వడానికి వెనుకాడరని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే ఆర్థిక మందగమనం కారణంగా చిన్న వ్యాపారులు, పెద్ద కంపెనీల నుంచి మాత్రం ప్రకటనలు తగ్గాయన్నారు.

English summary

Economic slowdown has hit donations, says Ganpati Mandals

While bigger mandals are unaffected, the economic slowdown has hit smaller Ganpati mandals, leading to at least 25% drop in sponsorships.
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more