For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

30 రోజుల్లో అన్ని జీఎస్టీ రీఫండ్స్, ఆందోళనవద్దు: నిర్మలా సీతారామన్

|

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు శుభవార్త చెప్పింది. ఈ రంగంలో జీఎస్టీ సంబంధిత ఆందోళనలను లేకుండా చేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం చెప్పారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈతో పాటు వివిధ అంశాలపై స్పందించారు.

ఆర్థిక అవతకవకలకు పాల్పడితే అధిక జరిమానా విధింపు ఉంటుందని తెలిపారు. వ్యాపారులు, పారిశ్రామికవేత్తల్ని ప్రాసిక్యూట్ చేయాలనేది ప్రభుత్వం లక్ష్యం కాదని స్పష్టం చేశారు. ఎంఎస్‌ఎంఈల్ని బలోపేతం చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎస్‌ఆర్ ఉల్లంఘనలను క్రిమినల్ నేరాల కింద పరిగణించబోమన్నారు.

ఎంఎస్‌ఎంఈలకు వెసులుబాటు కల్పించేలా ఓటీఎస్‌ ఉంటుందన్నారు. ఎంఎస్‌ఎంఈ రుణాలపై బ్యాంకు అధికారి ఒకే సమావేశంలో పరిష్కరిస్తారని చెప్పారు. ఎంఎస్‌ఎంఈల కోసం చెక్ బాక్స్ విధానం ఉంటుందని, బ్యాంక్ అధికారులు వేగవంత నిర్ణయాలు తీసుకునేలా చర్యలు ఉంటాయన్నారు. సాధ్యమైనంత వరకు ప్రాసిక్యూషన్ కంటే జరిమానాకే ప్రాధాన్యమిస్తామని తేల్చి చెప్పారు. కంపెనీల చట్టం కింద 14వేల ప్రాసిక్యూషన్లు ఉపసైంహరించుకున్నామన్నారు.

నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ హైలైట్స్నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ హైలైట్స్

 All pending GST refunds for MSMEs to be paid within 30 days: FM

ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయాలనేదే ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఎంఎల్ఎంఈలకు జీఎస్టీ రీఫండ్ విషయంలో టైమ్ బాండ్ ఉంటుందని తెలిపారు. అలాగే అన్ని రకాల పెండింగ్ రీఫండ్స్ కూడా 30 రోజుల్లో చెల్లిస్తామన్నారు. భవిష్యత్తులో జీఎస్టీ రీఫండ్స్ 60 రోజుల్లో పరిష్కారమవుతాయని తెలిపారు. మనీ స్టక్ అయిందని ఎంఎస్ఎంఈలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జీఎస్టీని సులభతరం చేస్తామన్నారు.

సీఎస్ఆర్ వయోలేషన్ సివిల్ మ్యాటర్ అని, సీఎస్ఆర్ ఉల్లంఘనలను క్రిమినల్ నేరాల కింద పరిగణించమని చెప్పారు. అసెసీలకు అనుగుణంగా పన్నుల విభాగం పని చేస్తుందన్నారు.

కాగా, ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి అలాగే ఉంది. దాదాపు అన్ని రంగాలు ఆర్థికమాంద్యం భయంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గురువారం నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు, శుక్రవారం ఉదయం నుంచి కూడా ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయ్యాయి. సాయంత్రం నిర్మలా సీతారామన్ మీడియా ముందుకు వస్తున్నారని తెలియడంతో మార్కెట్లు లాభాల్లో క్లోజ్ అయ్యాయి.

English summary

30 రోజుల్లో అన్ని జీఎస్టీ రీఫండ్స్, ఆందోళనవద్దు: నిర్మలా సీతారామన్ | All pending GST refunds for MSMEs to be paid within 30 days: FM

To ease GST related woes for the MSME sector the Finance Minister Nirmala Sitharaman has announced that all pending GST refunds will be paid within 30 days. Further, all future GST refunds will be sorted out in 60 days, she said.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X