For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తినలేక... తాగలేక... ఈ లో-దుస్తుల సేల్స్ ఆరోగ్య ఆర్థిక వ్యవస్థ సూచిక!!

|

న్యూఢిల్లీ: భారతదేశంలో వినియోగం భారీగా తగ్గిపోయింది. ఆటోమొబైల్ సేల్స్ నుంచి ఎఫ్ఎంసీజీ మందగమనంలో కొనసాగుతున్నాయి. వీటి కారణంగా వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. బయటకు చూపించేందుకు నెంబర్స్ ఎలా ఉన్నప్పటికీ, ప్రభావం ఎలా ఉందనేది మాత్రం ఎప్పటికైనా కనిపిస్తుంది. ఆర్థిక మాంద్యం కారణంగా బిస్కట్ కంపెనీలు, ఇన్నర్‌వియర్ కంపెనీలు, కార్లు, బైక్స్, లిక్కర్.. ఇలా అన్ని సేల్స్ పడిపోయాయి.

గుడ్‌న్యూస్: కార్డ్స్‌పై ఈ-మాండేట్‌కు అనుమతి, కానీ రూ.2000 మాత్రమే

సేల్స్ పెరగకుంటే...

సేల్స్ పెరగకుంటే...

పార్లే బిస్కట్ కంపెనీకి 1 లక్ష మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ దిగ్గజ కంపెనీ సేల్స్ లేక సంక్షోభాన్ని ఫేస్ చేస్తోంది. దాదాపు పదివేల మంది ఉద్యోగులను తొలగించే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. పార్లే-జీ, మొనాకో, మారీలు పార్లే ఉత్పత్తులు. ఈ సేల్స్ పెరగకుంటే ఈ కంపెనీలోని వేలాదిమంది ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుంది.

నికర లాభం తగ్గింది

నికర లాభం తగ్గింది

కేవలం పార్లే కంపెనీ ఒక్కటే ఈ సమస్యలో కొట్టుమిట్టాడం లేదు. ఎఫ్ఎంసీజీలో ఎక్కువ సేల్స్ దెబ్బతిన్న వాటిల్లో బిస్కట్స్, సాల్టీ స్నేక్స్. పార్లేతో పాటు బ్రిటానియా సేల్స్ కూడా భారీగా తగ్గిపోయాయి. వినియోగదారుల నుంచి బలహీనమైన డిమాండ్ ఉండటంతో జూన్ క్వార్టర్‌లో నికర లాభం 3.5 శాతానికి పడిపోయింది.

తగ్గిన పర్ కాపిటా డిస్పోసల్ ఇన్‌కం

తగ్గిన పర్ కాపిటా డిస్పోసల్ ఇన్‌కం

పార్లే, బ్రిటానియా సేల్స్ పట్టణాల కంటే గ్రామాల్లో మరింత ఎక్కువగా ఉన్నాయి. 2010-2011 మధ్య నామినల్ పర్ కాపిటా డిస్పోసల్ ఇన్‌కం 13.3 శాతం ఉండగా, 2015-18 మధ్య 9.5 శాతానికి దిగజారింది. డిస్పోజబుల్ ఇన్‌కం తగ్గడమూ ఎఫ్ఎంసీజీ తగ్గుదలకు కారణంగా భావిస్తున్నారు.

ఇన్నర్‌వేర్ స్టోరీ...

ఇన్నర్‌వేర్ స్టోరీ...

బ్రీఫ్స్ లేదా ఇన్నర్‍‌వేర్స్ సేల్స్ కూడా తగ్గిపోయాయి. కొనుగోలు పరిమాణం వేగంగా తగ్గిపోతోంది. గత జూన్ క్వార్టర్ ముగిసేనాటికి ఇన్నర్‌వేర్ సేల్స్ భారీగా తగ్గిపోయాయి. టాప్ ఫోర్ ఇన్నర్‌వేర్ సేల్స్ తీసుకుంటే గత పదేళ్లలో ఎన్నడూ లేని సంక్షోభాన్ని చూస్తున్నాయి. జాకీ ఇన్నర్‌వేర్ సేల్స్ 2008 తర్వాత దారుణంగా పడిపోవడం ఇదే మొదటిసారి. VIP ఇన్నర్‌వేర్ సేల్స్ 20 శాతం తగ్గిపోయాయి. లక్స్ సేల్స్ ఫ్లాట్‌గా ఉండగా, డాలర్ ఇండస్ట్రీ సేల్స్ 4 శాతం తగ్గాయి.

ఇన్నర్‌వేర్ సేల్స్ పెరిగితే సానుకూలం

ఇన్నర్‌వేర్ సేల్స్ పెరిగితే సానుకూలం

ప్రఖ్యాత అలన్ గ్రీన్‌స్పాన్ మెన్స్ అండర్‌వేర్ ఇండెక్స్ ప్రకారం... పురుషుల ఇన్నర్‌వేర్ (లోదుస్తులు) సేల్స్ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి సమర్థవంతమైన సూచిక. ఈ సేల్స్ పడిపోవడాన్ని బట్టి చూస్తుంటే ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉందని అర్థమవుతోంది. సేల్స్ పెరిగితే కనుక సానుకూలంగా భావించవచ్చు.

తగ్గిన లిక్కర్ అమ్మకాలు

తగ్గిన లిక్కర్ అమ్మకాలు

ఎఫ్ఎంసీజీ అమ్మకాలు అంటే కేవలం బిస్కట్స్, దుస్తులు, సబ్బులు మాత్రమే కాదు.. లిక్కర్ సేల్స్ కూడా పడిపోయాయి. ఏప్రిల్ - జూన్ క్వార్టర్‌లో ఈ సేల్స్ దాదాపు మూడొంతులు తగ్గాయి. జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత గత మూడు క్వార్టర్‌లలో ఈ సేల్స్ క్రమంగా పెరిగాయి. అయితే ప్రస్తుత మందగమనం నుంచి మాత్రం ఇది తప్పించుకోలేకపోయింది. జూన్ క్వార్టర్‌లో సేల్స్ భారీగా తగ్గాయి. సిగరేట్ల పరిస్థితి కూడా అలాగే ఉంది.

ఆటో సేల్

ఆటో సేల్

ప్రస్తుతం అతిపెద్ద ఆర్థిక మాంద్యం ఎదుర్కొంటోంది ఆటోమొబైల్ ఇండస్ట్రీ. జూలై నెలలో టూవీలర్ సేల్స్ 16.82 శాతం తగ్గాయి. కమర్షియల్ సెగ్మెంట్ వెహికిల్స్ మరింత దిగజారాయి. ఈ సేల్స్ 25.71 శాతం తగ్గాయి. పాసింజర్ కార్ల సేల్స్ 30.98 శాతం పడిపోయాయి. 20 ఏళ్ల కనిష్టానికి సేల్స్ పడిపోయాయి. ఈ రంగంపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా 37 మిలియన్ల మంది ఆధారపడ్డారు. వీరు ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. డిమాండ్ తగ్గటంతో ఇప్పటికే కారు, బైక్ కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయి. గత మూడు నెలల్లో ఈ మాంద్యం ప్రభావం కారణంగా మూడున్నర లక్షలమంది ఉద్యోగులపై ప్రభావం పడింది. డీలర్స్ షోరూంలో క్లోజ్ చేస్తున్నారు. కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయి.

English summary

Downturn: Biscuits, briefs, bikes, booze and the breakdown

As India's consumption breakdown begins to bite, the focus is firmly shifting to the four big buttresses that once kept the consumer economy rolling but are now floundering.
Story first published: Thursday, August 22, 2019, 16:42 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more