For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కకావికళం: రూ.5 బిస్కట్ పాకెట్ కూడా కొనలేకపోతున్నారు

|

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ఆటో మొబైల్ రంగంలో తీవ్ర సంక్షోభం, ఎఫ్ఎంసీజీ మందగమనం, ముందుకు సాగని రియల్ ఎస్టేట్ వంటి పలు అంశాల నేపథ్యంలో ఆర్థిక నిపుణులు ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితికి ప్రభుత్వాలు, ఆర్బీఐ వంటివి కారణాలుగా చాలామంది అభిప్రాయపడుతున్నారు. మార్చి త్రైమాసికంలో జీడీపీ 5.8 శాతంగా ఉండగా, జూన్ క్వార్టర్లో 5.4 శాతం నుంచి 5.6 శాతం మధ్య ఉండవచ్చునని చెబుతున్నారు. ఇది ఐదేళ్ల కనిష్టం.

ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ ఛార్జీలు పెరుగుతాయా?

మందగమనం కారణాలు తెలుసుకోవాలి..

మందగమనం కారణాలు తెలుసుకోవాలి..

ప్రస్తుత పరిస్థితికి సొంత ప్రభుత్వాలు, ఆర్బీఐ వంటి సంస్థలతో పాటు అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, గ్లోబల్ ఎకనమిక్ స్లోడౌన్, బ్రెగ్జిట్ అనిశ్చితి, చమురు ధరలు, కరెన్సీ వంటి పలు కారణాలు కూడా ఉన్నాయి. మందగమనం తాత్కాలికమని ఆశావాదులు చెబుతుండగా, సమస్య లోతుల్లోకి వెళ్లిందని మరికొందరు చెబుతున్నారు. అయితే మందగమనానికి గల కారణాలను తెలుసుకుంటే సరైన ద్రవ్య లేదా ఆర్థిక విధానాల అమలుకు ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు.

ఆటోరంగం తొలి ప్రమాదకర సంకేతం

ఆటోరంగం తొలి ప్రమాదకర సంకేతం

ఆటో అమ్మకాలు తగ్గడం, ఎగుమతులు, పెట్టుబడులు, వేతనాలు, పొదుపు వంటి అంశాలు సంక్షోభం యొక్క వాస్తవ రూపాన్ని వెల్లడిస్తున్నాయి. అయితే ఈ సమస్యలు ఎలా పరిష్కరిస్తారనే దానికి క్లూ లేదు. తొలుత ప్రమాదకర సంకేతాలు ఇచ్చిన రంగం ఆటో సెక్టార్. ఏడాది కాలంగా ఆటో సేల్స్ భారీగా పడిపోయాయి. దాదాపు రెండు దశాబ్దాల స్థాయికి సేల్స్ క్షీణించాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీలు తొలుత ఉత్పత్తిని తగ్గించాయి. ఆ తర్వాత కంపెనీలను మూసివేయడం ప్రారంభించారు. షోరూంలు మూసివేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇలాగే ఉంటే 10 లక్షల జాబ్స్ ఊడిపోయే ప్రమాదం

ఇలాగే ఉంటే 10 లక్షల జాబ్స్ ఊడిపోయే ప్రమాదం

ఆటో డీలర్లు తీవ్ర ఇక్కట్లలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తొలుత ఆటో డీలర్లు ఉద్యోగులను తొలగించారు. ఆటో కంపెనీలు ఉత్పత్తి తగ్గించడంతో అక్కడ కూడా ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తంగా ఈ రంగంలో 2.15 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. పరిస్థితులు ఇలాగే ఉంటే ఈ సంఖ్య 10 లక్షలకు చేరుకుంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మూసివేయడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు

మూసివేయడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు

చాలా వరకు టైర్ II, టైర్ III సంస్థలని, ఈ నేపథ్యంలో మరీ ఇంత సంక్షోభం తరుచూ కనిపించదని, కానీ దీర్ఘకాలంలో మరీ ఇంతగా సేల్స్ పడిపోవడంతో పాటు వర్కింగ్ కేపిటల్ డ్రై అయిన నేపథ్యంలో మూసివేత మినహా మరో ప్రత్యామ్నాయం లేదని అక్మా డైరెక్టర్ జనరల్ విన్నీ మెహతా అన్నారు. మరోవైపు, ఆటో సేల్స్ ఎక్కువగా ఆధారపడిన NBFC రంగం కూడా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.

సేల్స్ తగ్గడానికి మరిన్ని కారణాలు

సేల్స్ తగ్గడానికి మరిన్ని కారణాలు

ఇప్పటికే అధిక నిరుద్యోగత, తక్కువ వేతనం అనే రెండు కారణాలు పట్టి పీడిస్తున్నాయి. మరోవైపు, పునర్వినియోగంలేని ఆదాయ వృద్ధి, ద్రవ్యోల్భణం మధ్య అంతరం తగ్గిపోతోంది. గత కొన్ని నెలలుగా గృహ పొదుపులో కూడా క్షీణత కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద కొనుగోళ్లకు ఎక్కువగా ఆసక్తి చూపడం లేదని డెలాయిట్ పార్ట్‌నర్ కుమార్ కందస్వామి అన్నారు.

పడిపోయిన హిందూస్తాన్, డాబూర్ సేల్స్

పడిపోయిన హిందూస్తాన్, డాబూర్ సేల్స్

ముఖ్యంగా గ్రామీణ వృద్ధి రేటు 2014లో 28 శాతం ఉండగా, ఈ ఏడాదికి 5 శాతానికి పడిపోయింది. గ్రామాల్లో బలహీన డిమాండ్, ద్రవ్యోల్భణ ఒత్తిళ్లు FMCG వ్యాల్యూమ్‌ను తగ్గించాయి. జూన్ క్వార్టర్‌లో ఇది 10 శాతం తగ్గింది. హిందూస్తాన్ యూనీవర్ వృద్ధి గత ఏడాది జూన్ క్వార్టర్‌లో 12 శాతం ఉండగా, ఈ ఏడాది జూన్‌లో 5.5 శాతానికి తగ్గింది. మారికో, దాబూర్ సేల్స్ కూడా వరుసగా 10 శాతం నుంచి 7 శాతానికి, 21 శాతం నుంచి 6 శాతానికి పడిపోయాయి. ఈ రంగంపై గ్రామీణ ప్రాంతాల్లో 37 శాతం డిమాండ్ ఉండగా, అర్బన్ మార్కెట్ల కంటే రెండు రెట్లు మందగమనం కొనసాగుతోందని నీల్సన్ సౌత్ ఏసియా (హెడ్ రిటైల్ మెజర్మెంట్ సర్వీసెస్) సునీల్ ఖియానీ అన్నారు.

తగ్గిన ఖర్చు.. రూ.5 బిస్కెట్ ప్యాకెట్ కూడా కొనడం లేదు

తగ్గిన ఖర్చు.. రూ.5 బిస్కెట్ ప్యాకెట్ కూడా కొనడం లేదు

పట్టణ వినియోగం కూడా తగ్గుతోంది. హౌజ్ హోల్డింగ్ ఖర్చులు కూడా రోజు రోజుకు తగ్గుతున్నాయి. రూ.5 విలువ కలిగిన బిస్కెట్ ప్యాకెట్ కొనుగోళ్లు కూడా తగ్గిపోతున్నాయని బ్రిటానియా వెల్లడించిందట. వినియోగదారులు ఖర్చులు తగ్గించుకోవడం FMCGనే కాకుండా వస్త్ర పరిశ్రమను కూడా ప్రభావితం చేసింది. ఫ్యాషన్ మరియు లైఫ్ స్టైల్ రిటైలర్స్ ముందు ముందు పండుగల సీజన్ ఉన్నప్పటికీ ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి.

అమ్ముడుపోని ఇళ్లు

అమ్ముడుపోని ఇళ్లు

నోట్ల రద్దు అనంతరం దాదాపు 30 నగరాల్లో 1.28 మిలియన్ యూనిట్ల ఇళ్లు అమ్ముడు పోలేదు. రియల్ ఎస్టేట్ రంగంలోను ఎలాంటి వృద్ధి లేదని ఇది వెల్లడిస్తోంది. హోమ్ బయ్యర్స్‌కు జీఎస్టీ తగ్గింపు ద్వారా ప్రభుత్వం భారీ ఊరటను కల్పించింది. కానీ NBFC లిక్విడిటీ సంక్షోభంలో కూరుకుపోవడంతో సమస్య పరిష్కారం కాలేదు. ప్రస్తుతం ఈ రంగం కఠిన పరిస్థితులు ఎదుర్కొంటుందని నైట్ ఫ్రాంక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ షిషిర్ బైజాల్ అన్నారు.

స్టీల్ పరిశ్రమ పైనా ప్రభావం

స్టీల్ పరిశ్రమ పైనా ప్రభావం

ఆటో, రియల్, ఎఫ్ఎంసీజీతో పాటు స్టీల్ రంగం కూడా సంక్షోభం ఎదుర్కొంటుంది. రియల్ ఎస్టేట్ పడిపోయిన నేపథ్యంలో స్టీల్ పైన ప్రభావం పడింది. సాధారణంగా ఈ రంగంలో స్టీల్ డిమాండ్ 7 నుంచి 7.5 శాతం మధ్య పెరుగుతుండాలని చెబుతున్నారు.

టెలికం రంగంపై బాంబు

టెలికం రంగంపై బాంబు

టెలికం రంగంలో తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. ఈ పరిశ్రమ లోన్ల కోసం వేచి చూస్తోంది. రిలయన్స్ జియో ఎంట్రీ ఇతర టెలికం సంస్థలను తీవ్ర నష్టాలలోకి నెట్టింది. టెలికం వినియోగం రోజు రోజుకు పెరుగుతున్నప్పటికీ లాభాలు మాత్రం సమీప దూరంలో కనిపించడం లేదు. ప్రభుత్వరంగ సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌లు అప్పుల్లో కూరుకుపోయాయి. అధిక వడ్డీ రేటు, ప్రభుత్వ సుంకాలు ఎక్కువ కావడంతో పాటు అధిక పోటీ వంటి కారణాల వల్ల టెలికం కంపెనీలు నష్టాలను చవిచూస్తున్నాయి.

English summary

Inside India's worrying economic slowdown

In less than a fortnight, officials will dump crucial, but disappointing data on us. On August 30, when the Central Statistics Office reports its quarterly health check on the economy, chances are GDP growth for the June quarter will see a fresh low of 5.4-5.6 per cent from March’s 5.8 per cent, which itself was a five year low.
Story first published: Tuesday, August 20, 2019, 13:00 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more