For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.100 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తాం: ప్రధాని మోడీ

|

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత రాజ్‌ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం ఎర్రకోట వద్ద త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించారు. పతాక ఆవిష్కరణ అనంతరం ప్రధాని మోడీ మాట్లాడారు. ఎంతోమంది త్యాగాల ఫలితమే ఈ స్వతంత్ర్యం అన్నారు. శాంతి, సమృద్ధి, భద్రత కోసం స్వాతంత్రం తర్వాత అందరూ కృషి చేశారన్నారు.

ఏపీకి గుడ్‌న్యూస్, ప్యామిలీకి హెల్త్ కార్డు: రూ.1000 దాటితే

ఇన్‌ఫ్రాలో 100 లక్షల కోట్లు ఇన్వెస్ట్

ఇన్‌ఫ్రాలో 100 లక్షల కోట్లు ఇన్వెస్ట్

మోడర్న్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం రూ.100 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేస్తామని వెల్లడించారు. రానున్న అయిదేళ్లలో 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను నిర్మించేందుకు ఇలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ టాప్ 50 దేశాల్లో ఉండేలా సంస్కరణలు చేపడతామన్నారు.

5 ట్రిలియన్ డాలర్లకు ఆర్థిక వ్యవస్థ

5 ట్రిలియన్ డాలర్లకు ఆర్థిక వ్యవస్థ

అయిదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేయాలనే లక్ష్యం కొంతమందికి కష్టంగా కనిపించవచ్చునని, కానీ స్వాతంత్రం వచ్చిన ఏడు దశాబ్దాలలో సాధించిన 2 ట్రిలియన్ డాలర్ల పరిమాణంతో పోలిస్తే 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక అయిదేళ్ల కాలంలో 1 ట్రిలియన్ డాలర్లను ఆర్థిక వ్యవస్థకు జోడించిందని మోడీ చెప్పారు. వచ్చే అయిదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిర్మించడం అసాధ్యమేమీ కాదన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చునని చెప్పారు.

వైద్య రంగంలో కొత్త సంస్కరణలు

వైద్య రంగంలో కొత్త సంస్కరణలు

వైద్య రంగంలోను కొత్త సంస్కరణలు తీసుకు వచ్చామని మోడీ చెప్పారు. ఆయుష్మాన్ భారత్ దేశ ప్రజలకు ఓ వరం అన్నారు. వైద్యాన్ని ప్రతి సామాన్యుడికి అందుబాటులోకి తేవాలన్నదే తమ లక్ష్యం అన్నారు. రైతులకు పింఛన్లు అందిస్తున్నామన్నారు. అయిదేళ్లలో మెరుగైన భారత్‌ను నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామన్నారు.

ప్రధాని కీలక ప్రకటనలు

ప్రధాని మోడీ ఈ ప్రసంగంలో కీలక ప్రకటనలు చేశారు. జనాభా నియంత్రణకు సరికొత్త పాలసీ తీసుకు వస్తామని ఆయన వెల్లడించారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఆర్టికల్ 370ని రద్దు చేశామన్నారు. దీంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ కలను సాకారం చేశామన్నారు. 70 ఏళ్లుగా చేయని వాటిని తాము 70 రోజుల్లో చేసి చూపించామన్నారు. ఈ 70 రోజుల్లో చిన్నారుల భద్రత నుంచి చంద్రయాన్ దాకా, అవినీతిపై పోరు నుంచి ట్రిపుల్ తలాక్ వరకు, కాశ్మీర్ నుంచి రైతుల దాకా ఎన్నో చేశామన్నారు. ప్రజల సమస్యలకు పరిష్కారాలు అన్వేషిస్తున్నామన్నారు.

English summary

Modi says will invest Rs 100 lakh crore in infra, $5 trillion economy target achievable

Prime Minister Narendra Modi on Thursday said his government will invest a massive Rs 100 lakh crore on developing modern infrastructure that will aid in nearly doubling the size of the Indian economy to $5 trillion in the next five years. Addressing the nation from the ramparts of the Red Fort here on the 73rd Independence Day, he said reforms will continue to be ushered in to help India break into top 50 countries on the 'ease of doing business' ranking.
Story first published: Thursday, August 15, 2019, 10:53 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more