For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంకా ఎన్నాళ్లు: మరోసారి భారత్‌కు డొనాల్డ్ ట్రంప్ అక్కసు

|

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారత్ పైన మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. ప్రపంచ బ్యాంకు ఇచ్చిన వర్ధమాన దేశాల హోదా ఇంకా ఎంతోకాలం కొనసాగవద్దన్నారు. ఈ మేరకు భారత్‌తో పాటు చైనాను కూడా ఆయన టార్గెట్ చేసారు. అభివృద్ధి చెందుతున్న దేశాలుగానే ఇంకా ఎంతకాలం ఉంటాయని, ఈ పేరుతో అవి లాభపడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. బుధవారం పెన్సిల్వేనియాలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు.

<strong>అమెరికా కంపెనీతో కాఫీడే డీల్!: రూ.3,000కు టెక్ పార్క్ సేల్</strong>అమెరికా కంపెనీతో కాఫీడే డీల్!: రూ.3,000కు టెక్ పార్క్ సేల్

ఇంకా ఎదుగుతున్న దేశాలు కాదు..

ఇంకా ఎదుగుతున్న దేశాలు కాదు..

డెవలపింగ్ దేశాల ముసుగులో భారత్, చైనాలు ఇంకా అక్రమంగా ప్రయోజనాలు పొందుతున్నాయని ట్రంప్ ఆరోపించారు. ఇకపై ఇలాంటివి సాగనిచ్చేది లేదని స్పష్టం చేసారు. ఆసియాలో భారత్, చైనాలు ఆర్థిక దిగ్గజాలుగా ఎదిగాయన్నారు. అవి ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉండటం సరికాదన్నారు. దీనిని అడ్డు పెట్టుకొని అమెరికా నుంచి ఏళ్ల తరబడి ప్రయోజనాలు పొందుతున్నాయన్నారు.

ట్రంప్ ఏం చెప్పారంటే..

ట్రంప్ ఏం చెప్పారంటే..

'WtO ఇప్పటికీ కొన్ని దేశాల్ని ఎదుగుతున్న దేశాలుగానే చూస్తోంది. కానీ వాస్తవానికి అవి ఎప్పుడో అభివృద్ధి చెందాయి. అన్ని దేశాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి... ఒక్క అమెరికా తప్ప. ఇకపై మాత్రం అలాంటి దేశాలు అక్రమంగా వర్ధమాన దేశాల హోదా పేరుతో అక్రమంగా ప్రయోజనాలు పొందనిచ్చేది లేదు' అని ట్రంప్ అన్నారు. 'వారు (భారత్, చైనా) ఏళ్లుగా ప్రయోజనాలు పొందుతున్నారు' అని ట్రంప్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ట్రంప్ ట్రేడ్ వార్

ట్రంప్ ట్రేడ్ వార్

గ్లోబల్ ట్రేడ్ విధానం ప్రకారం.. అభివృద్ధి చెందుతున్న దేశాలు భద్రతా విధానాలు, సులభ సుంకం ఇలా వివిధ ప్రయోజనాలు ఉంటాయి. కొన్ని ఎగుమతి రాయితీలు పొందుతారు. అయితే గత కొన్నాళ్లుగా ట్రంప్ చైనా, భారత్ వాణిజ్యంపై ఆగ్రహంతో ఉన్నారు. చైనాతో ట్రేడ్ వార్ కొనసాగుతోంది. భారత్ వాణిజ్యంపై కూడా ఆగ్రహంతో ఉన్నారు. టారిఫ్ కింగ్ అని గతంలో పలుమార్లు విమర్శించారు.

English summary

ఇంకా ఎన్నాళ్లు: మరోసారి భారత్‌కు డొనాల్డ్ ట్రంప్ అక్కసు | India, China no longer developing nations, Will not let them take sdvantage: Trump

US President Donald Trump on Wednesday took aim at India and China, saying the two were no longer developing nations and were taking advantage of the tag given by the WTO.
Story first published: Thursday, August 15, 2019, 11:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X