For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరపడండి!: రిలయన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే రెండేళ్లలో డబుల్!!

|

ముంబై: సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్‌కో సంస్థతో జతకడతామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సోమవారం తెలిపారు. భారత్‌లో ఇప్పటి వరకు ఏ కంపెనీకి రానంత విదేశీ పెట్టుబడులు రిలయన్స్‌లోకి రానున్నాయి. రిలయన్స్ పెట్రో కెమికల్ వ్యాపారాన్ని 75 బిలియన్ డాలర్లుగా అంచనా కట్టారు. సౌదీకి చెందిన పెట్రో దిగ్గజం ఆరామ్‌కో 20% వాటాను కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ రూ.1.1 లక్షల కోట్లుగా ఉంటుందని పేర్కొంది. మరోవైపు, బ్రిటిష్ పెట్రోలియం (BP)తో కలిసి రిటైల్ వ్యాపారాన్ని విస్తరించనుంది. ఈ రెండు కంపెనీలు భారీగా పెట్రోల్ పంపులు ప్రారంభిస్తాయి. నిన్న అంబానీ ప్రకటన నేపథ్యంలో రిలయన్స్ షేర్లు మంగళవారం దూసుకెళ్లాయి. షేర్లు 114 పాయింట్లు లేదా 9.74 శాతం ఎగబాకి, రూ.1,274 వద్ద ఉంది.

<strong>జియో ఆఫర్: థియేటర్లో సినిమా విడుదలైన రోజే ఇంట్లో చూడొచ్చు, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్‌కు దెబ్బ</strong>జియో ఆఫర్: థియేటర్లో సినిమా విడుదలైన రోజే ఇంట్లో చూడొచ్చు, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్‌కు దెబ్బ

రిలయన్స్ రుణంపై ఆందోళన అవసరం లేదు

రిలయన్స్ రుణంపై ఆందోళన అవసరం లేదు

అంబానీ ప్రకటన నేపథ్యంలో సోమవారం రిలయన్స్ షేర్లు 5 శాతం పెరుగుతాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేయగా, దాదాపు పది శాతం వరకు పెరిగాయి. ఆర్ఐఎల్ 65 బిలియన్ డాలర్ల రుణంపై ఆందోళన సరికాదని, రూ.4 లక్షల కోట్ల నికర విలువ కలిగి ఉండటంతో పాటు రిఫైనరీ, ఆయిల్ కెమికల్స్, రిటైల్, జియో వ్యాపారాలు ఉన్న ఈ సంస్థ చేసిన ప్రకటనలు మార్కెట్‌కు కచ్చితంగా ఉత్సాహాన్ని ఇస్తాయని, ఆస్తుల నగదీకరణ ద్వారా కంపెనీ లాభం రెండు మూడేళ్లలో భారీగా పెరుగుతుందని, సౌదీ ఆరామ్ కో ఒప్పందం ఈపీఎస్‌ను పెంచేదేనని విశ్లేషకులు చెబుతున్నారు.

రెండేళ్లలో డబుల్

రెండేళ్లలో డబుల్

రెండేళ్లు ఓపిక పడితే రిలయన్స్ స్టాక్స్ రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు. గత ఏడాది కాలంలో దేశంలోనే అతిపెద్ద లాభదాయక సంస్థగా ఆర్ఐఎల్ ఆవిర్భవించింది. ఆయిల్, కెమికల్స్, జియో, రిటైల్ కలిగిన డైవర్సిఫైడ్ అతిపెద్ద కంపెనీ ఇది. ఆరామ్‌కోతో ఒప్పందానికి ముందు ఇంధన రిటైల్ అవుట్‌లెట్ల కోసం BPతో కూడా వాటాల విక్రయం ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీకి రానున్న రోజుల్లో గణనీయ లాభాలు, వ్యాల్యుయేషన్ తెచ్చి పెడుతుందంటున్నారు.

త్వరపడండి.. ఇప్పుడే ఇన్వెస్ట్ చేయండి

త్వరపడండి.. ఇప్పుడే ఇన్వెస్ట్ చేయండి

రిలయన్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ప్రస్తుత ధరల్లోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చునని, 2019లో ఈ స్టాక్స్ సరికొత్త గరిష్టాలకు చేరుకుంటుందని, రానున్న రెండేళ్లలో ఈ స్టాక్స్ రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. రియన్స్ షేర్లు రోజు రోజుకు దూసుకెళ్ళే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

రెండేళ్లలో....

రెండేళ్లలో....

రిలయన్స్‌లో రెండేళ్ల కాలపరిమితిని టార్గెట్‌గా పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు చూసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. 2021 చివరి నాటికి రిలయన్స్‌ను రుణరహిత కంపెనీగా చూడాలని ముఖేష్ అంబాని కోరుకుంటున్నారని, ఇప్పటికే రిలయన్స్ లాభాల్లో ఉండటం, అతిపెద్ద మల్టీ డైవర్సిఫైడ్ కంపెనీ, విదేశీ పెట్టుబడులు... ఈ నేపథ్యంలో సానుకూలంగా ఉంటాయని చెబుతున్నారు.

English summary

త్వరపడండి!: రిలయన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే రెండేళ్లలో డబుల్!! | Reliance Industries shares stage biggest jump in over 2 years on Aramco deal

Reliance Industries shares jumped on Tuesday marking their biggest intraday jump since February 22, 2017, a day after the company's chairman, Mukesh Ambani, said the group has a clear roadmap to become zero net-debt company in 18 months.
Story first published: Tuesday, August 13, 2019, 15:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X