For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిలియనీర్ గా ఎదిగిన బడి పంతులు, బైజూస్ ఫౌండర్ రవీంద్రన్ విజయ ప్రస్థానం

|

బతకలేక బడి పంతులు అనే వారు ఒకప్పుడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బడి పంతుళ్లు లక్షల్లో వేతనాలు అందుకొంటున్నారు. సొంతంగా బిజినెస్ లూ పెడుతున్నారు. కలం కలిసొస్తే మిల్లియనీర్లు, బిలియనీర్లు ఐపోతున్నారు. ఇందుకు చక్కటి నిదర్శనమే బైజూస్ యాప్ ఫౌండర్. 37 ఏళ్ళ వయసులోనే అయన బిలియనీర్ అయిపోయారు. ఆయనే బైజు రవీంద్రన్. 2011 లో థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ స్థాపించి దాని అద్వర్యం లో బైజూస్ లెర్నింగ్ యాప్ ను మార్కెట్లోకి ప్రవేశ పెట్టారు.

ఆన్లైన్ లో చిన్న పిల్లలకు పాఠాలు చెప్పే ఈ యాప్ ఇప్పుడు దేశంలో అతిపెద్ద సంచలనాల్లో ఒకటిగా నిలుస్తోంది. దీని విలువ ఏకంగా 6 బిలియన్ డాలర్లు (సుమారు రూ 42,000 కోట్లు) స్థాయిలో ఉంది. ఈ కంపెనీలో 21% వాటా కలిగిన బైజు రవీంద్రన్ బిలియనీర్ గా ఎదిగారు. అయన ప్రస్థానం పదేళ్ల లోపే ప్రారంభం నుంచి బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవటం గొప్ప విషయమే. ఒకప్పుడు రవీంద్రన్ క్లాస్ రూమ్ టీచర్ కావడం విశేషం.

బైజూస్ దూకుడు, 6 నెలల్లో 2 బిలియన్ల డాలర్లు పెరిగిన వ్యాల్యుయేషన్, ఇవీ కారణాలు..

 వచ్చే ఏడాది అమెరికా లో సేవలు..

వచ్చే ఏడాది అమెరికా లో సేవలు..

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న బైజూస్ ... దేశంలో విజయవంతమైంది. ఇటీవలే 150 మిలియన్ డాలర్ల (సుమారు రూ 1,200 కోట్లు) సమీకరించింది. ఈ నిధుల సేకరణ సందర్భంగా కంపెనీ వాల్యుయేషన్ 5.8 బిలియన్ డాలర్ లుగా ఉంది. అయితే, ఇటీవలే అమెరికాకు చెందిన ఫేమస్ స్టూడియో వాల్ట్ డిస్నీ తో బైజూస్ జట్టు కడుతోంది. దీంతో 2020 లో అమెరికా లోనూ బైజూస్ జెండా ఎగరనుంది. బ్లూమ్బెర్గ్ వార్త సంస్థ ఈ విషయాలను ఒక కథనంలో పేర్కొంది.

తల్లిదండ్రులూ టీచర్లే...

తల్లిదండ్రులూ టీచర్లే...

చలాకీగా ఉండే రవీంద్రన్, ఆటల్లో చురుగ్గా ఉండేవాడట. ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ టీచర్లే. అయితే, తనకు తానే అభ్యాసన చేస్తూ చదువులో ముందుండే రవీంద్రన్... తన తోటి విద్యార్థులకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కు కోచింగ్ ఇచ్చే వాడట. అయన కోచింగ్ వాళ్ళ చాల మందికి ఉద్యోగాలు లభించటంతో పాపులారిటీ పెరిగిపోయి కోచింగ్ కు వచ్చే విద్యార్థుల సంఖ్యా వేలకు చేరిపోయింది. స్టేడియం అద్దెకు తీసుకొని మరీ వారికీ పాఠాలు చెప్పాల్సి వచ్చేది. తనకు టీచింగ్ లో ఉన్న ప్రావీణ్యాన్ని గుర్తించిన రవీంద్రన్... విద్య రంగం లో సరి కొత్త మార్పుకు శ్రీకారం చుట్టాలని భావించి 2015 లో బైజూస్ పేరుతో లెర్నింగ్ యాప్ ను అందించారు. కాగ్ నుంచి 12 వ తరగతి వరకు ఈ యాప్ ద్వారా పాఠాలను నేర్చుకోవచ్చు. సైంటిఫిక్ విధానంలో విద్యాబ్యాసం యానిమేషన్ తో సరదాగా నేర్చుకొనేలా ఇందులో కంటెంట్ ఉంటుంది.

3.5 కోట్ల మంది వినియోగదారులు...

3.5 కోట్ల మంది వినియోగదారులు...

బైజూస్ యాప్ ను 3.5 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకొని వినియోగదారులుగా ఉన్నారు. ఇందులో 24 లక్షల మంది వినియోగ దారులు ఏడాదికి 12,000 వేళ వరకు ఫీజుల రూపంలో చెల్లిస్తారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ లాభాల్లోకి ప్రవేశింది కూడా. భారత్ లో నుంచి ఎదిగిన యునికార్న్ కంపెనీలు ( బిలియన్ డాలర్ వాల్యుయేషన్ సాధించినవి) చాలా వరకు నష్టాల్లోనే ఉన్నాయి. కానీ బైజూస్ మాత్రం లాభాల్లోకి మళ్లడం విశేషం. భారత్ లో లెర్నింగ్ మార్కెట్ 2020 నాటికీ 5.7 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ అంచనా. అందుకే ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీలకు ఇక్కడ అద్భుతమైన భవిష్యత్ ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

జూకర్ బర్గ్ కూడా పెట్టుబడి పెట్టారు...

జూకర్ బర్గ్ కూడా పెట్టుబడి పెట్టారు...

సోషల్ మీడియా దిగ్గజం పేస్ బుక్ ఫౌండర్ మార్క్ జుకెర్బెర్గ్ కూడా బైజూస్ లో పెట్టుబడి పెట్టారు. ఆయన భార్య ప్రిసిల్లా చం తో కలిసి అయన ఇందులో ఇన్వెస్ట్ చేసారు. వీరితో పాటు ఈ రంగంలో అతిపెద్ద ఇన్వెస్టర్లుగా ఉన్న కంపెనీలు అధిక మొత్తంలో ఇన్వెస్ట్ చేసాయి. నాస్పెర్స్ వెంచర్స్, టెన్ సేంట్ హోల్డింగ్స్, సేకోయ కాపిటల్ వంటి దిగ్గజ ఇన్వెస్టర్లు బైజూస్ విజయ ప్రస్థానంలో పలు పంచుకొన్నారు.

English summary

byju's: 37 year old former school teacher is India's newest billionaire

India’s newest billionaire is a former classroom teacher who developed an education app that’s grown to a valuation of almost $6 billion in about seven years.
Story first published: Tuesday, July 30, 2019, 17:03 [IST]
Company Search