For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోహ్లీ-ప్రియాంకచోప్రా ఇన్‌స్టాగ్రాం పోస్ట్‌కు ఎంత వసూలు చేస్తారంటే? టాప్ 10 వీరే

|

న్యూఢిల్లీ: సెలబ్రిటీలు వారివారి వృత్తుల ద్వారానే కాదు, సోషల్ మీడియాలో పోస్టుల ద్వారానూ ఆదాయం ఆర్జిస్తుంటారు. ఎంటర్‌టైన్మెంట్, బ్యూటీ, లైఫ్‌స్టైల్, స్పోర్ట్స్, ఫ్యాషన్, ట్రావెల్ రంగాలకు చెందిన సెలబ్రిటీస్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆర్జిస్తున్న వారి వివరాలను, వారు వసూలు చేసే ఛార్జీలను బ్రిటన్‌కు చెందిన సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ అండ్ మార్కెటింగ్ సొల్యూషన్స్ సర్వీస్ సంస్థ హాపర్ హెచ్‌క్యూ '2019 ఇన్‌స్టాగ్రామ్ రిచ్ లిస్ట్' పేరుతో విడుదల చేసింది. వారి ఆర్జన ఆధారంగా ర్యాంకులు ఇచ్చింది. ఇందులో భారత్ నుంచి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నారు.

ఈ ఏడాది చివరికల్లా వాట్సాప్ పేమెంట్ సేవలుఈ ఏడాది చివరికల్లా వాట్సాప్ పేమెంట్ సేవలు

ఒక్క పోస్టుకు రూ.8.73 కోట్లు

ఒక్క పోస్టుకు రూ.8.73 కోట్లు

ఇన్‌స్టాగ్రామ్ సంపాదనలో అమెరికా మోడల్, బిజినెస్ వుమెన్ కైలీ జెన్నర్ మొదటి స్థానంలో ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చేసే ప్రతి పోస్టుకు రూ.8.73 కోట్లు (1.26 మిలియన్ డాలర్లు) తీసుకుంటారు.

ఆ తర్వాత నాలుగు స్థానాల్లో కిమ్, సెలీనా

ఆ తర్వాత నాలుగు స్థానాల్లో కిమ్, సెలీనా

ఆ తర్వాత అరియానా గ్రాండె రూ.6.87 కోట్లు (996,000 డాలర్లు), క్రిస్టియానో రొనాల్డో రూ.6.72 కోట్లు (975,000 డాలర్లు), కిమ్ కర్దాషియన్ రూ.6.28 కోట్లు (910,000 డాలర్లు), సెలీనా గోమెజ్ రూ.6.11 కోట్లు (886,000 డాలర్లు)తో ఉన్నారు.

రూ.కోటికి పైగా చార్జ్ చేస్తున్న కోహ్లీ, ప్రియాంక

రూ.కోటికి పైగా చార్జ్ చేస్తున్న కోహ్లీ, ప్రియాంక

భారత్ నుంచి ఇద్దరు సెలబ్రిటీస్ ఉన్నారు. ప్రియాంక చోప్రా, కోహ్లీలు కూడా తమ పోస్టుకు కోట్లు వసూలు చేస్తున్నారు. ప్రియాంక చోప్రా రూ.1.87 కోట్లు (271,000 డాలర్లు), కోహ్లీ రూ.1.35 కోట్లు (196,000 డాలర్లు) వసూలు చేస్తున్నారు. ఈ జాబితాలో ప్రియాంక 19వ స్థానంలో, కోహ్లీ 23వ స్థానంలో ఉన్నారు.

టాప్ 5 నుండి టాప్ 10 వీరే

టాప్ 5 నుండి టాప్ 10 వీరే

ఈ జాబితాలో హాలీవుడ్ యాక్టర్, ఫార్మర్ WWE రెజ్లర్ డ్వేన్ 'ది 'రాక్' జాన్సన్ ఆరో స్థానంలో ఉన్నాడు. సింగర్, సాంగ్ రైటర్ బియోన్స్ నోల్స్ ఏడో స్థానంలో, సింగర్ టేలర్ స్విఫ్ట్ ఎనిమిదో స్థానంలో, బ్రెజిలియన్ సాకర్ ప్లేయర్ నెయ్‌మార్ తొమ్మిదో స్థానంలో, కెనడియన్ సింగర్ జస్టిన్ బీబర్ పదో స్థానంలో ఉన్నారు. వీరు రూ.5 కోట్లకు అటు ఇటుగా ఛార్జ్ చేస్తున్నారు.

Read more about: virat kohli rich
English summary

కోహ్లీ-ప్రియాంకచోప్రా ఇన్‌స్టాగ్రాం పోస్ట్‌కు ఎంత వసూలు చేస్తారంటే? టాప్ 10 వీరే | Virat Kohli and Priyanka Chopra charges per instagram post

While a large number of Indian celebrities actively use Instagram to reach their fans, Priyanka Chopra and Virat Kohli have emerged as the only stars from the country to join the 2019 Instagram Rich List released by social media management company Hopper HQ.
Story first published: Friday, July 26, 2019, 15:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X