For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోం బయ్యర్స్‌కు షాక్: ధోనీ కంపెనీతో ఆమ్రపాలి చీకటి ఒప్పందం, అసలేం జరిగింది?

|

న్యూఢిల్లీ: ఆమ్రపాలి గ్రూప్ రెరా రిజిస్ట్రేషన్‌ను మంగళవారం సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఈ సంస్థ ఆధ్వర్యంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యతని ప్రభుత్వరంగ నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పోరేషన్ (NBCC)కి అప్పగించింది. వేలాదిమంది గృహ కొనుగోలుదారులకు ఇది ఊరట. చాలామంది ఇంటి కోసం ఆమ్రపాలిలో లక్షలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. దాదాపు 42వేల మంది ఈ గ్రూప్‌లో అపార్టుమెంట్స్ బుక్ చేసుకుంది. దీనిని ప్రమోటర్లు పక్కదారి పట్టించారు. బాధితుల న్యాయ పోరాటం కారణంగా సుప్రీం కోర్టులో వారికి ఊరట లభించింది.

పెట్రోల్ బంకులో మీరు ఈ సేవలు ఉచితంగా పొందవచ్చు

పక్కదారి పట్టిన నిధులు.. రితి స్పోర్ట్స్ పేరు

పక్కదారి పట్టిన నిధులు.. రితి స్పోర్ట్స్ పేరు

పలు ప్రాంతాల్లో ఆమ్రపాలికి అధికారులు మంజూరు చేసిన ఆస్తుల లీజును కూడా సుప్రీం కోర్టు రద్దు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలు రావడంతో గ్రూప్ సీఎండీ అనిల్ శర్మ, ఇతర డైరెక్టర్లను, సీనియర్ అధికారులను విచారించాలని ఆదేశించింది. నోయిడా పోలీసులు నమోదు చేసిన 16 కేసులు పరిగణలోకి తీసుకుంది. ప్రమోటర్ల ఆస్తులు జఫ్తు చేసే పనిలో అధికారులు ఉన్నారు. ఆమ్రపాలి గ్రూప్ ఇంటి కొనుగోలుదార్లకు చెందిన డబ్బును వివిధ చట్ట వ్యతిరేక పద్ధతుల్లో దారి మళ్లించిందట. ఇందులోకి ధోనీకి సంబంధమున్న రితి స్పోర్ట్స్ పేరు కూడా వచ్చింది.

రితి స్పోర్ట్స్‌తో ఆమ్రపాలి చీకటి ఒప్పందాలు

రితి స్పోర్ట్స్‌తో ఆమ్రపాలి చీకటి ఒప్పందాలు

ఈ నిధులను దారి మళ్లించడం కోసం రితి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆమ్రపాలి గ్రూప్‌ చీకటి ఒప్పందాలను కుదుర్చుకుందని సుప్రీం కోర్టుకు కోర్టు నియమించిన ఫోరెన్సిక్ ఆడిటర్లు తెలపడం గమనార్హం. హోమ్ బయ్యర్స్ డబ్బును ఆమ్రపాలి ఇల్లీగల్‌గా ధోనీకి చెందిన స్పోర్ట్స్ కంపెనీకి డైవర్ట్ చేసిందని తెలిపారు. ధోనీకి సంబంధించిన బ్రాండ్లకు ఈ కంపెనీ ప్రచారం కల్పిస్తుంటుంది. ధోనీతో పాటు ఇతర స్పోర్ట్స్ స్టార్లకు ఈ సంస్థ ప్రచారం కల్పిస్తుంది. ఈ ఆడిట్ నివేదికను కోర్టు అంగీకరించింది.

రూ.42.22 కోట్లు చెల్లించాల్సి ఉండగా...

రూ.42.22 కోట్లు చెల్లించాల్సి ఉండగా...

ఆమ్రపాలి గ్రూప్ తరఫున చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ రూ.6 కోట్ల మేర రితి స్పోర్ట్స్‌కు అక్రమంగా తరలించినట్లుగా చెబుతున్నారు. అయితే సీఎండీకి అలాంటి అధికారం లేదట. ఆమ్రపాలి గ్రూప్ ఆఫ్ కంపెనీలు 2009-2015 మధ్య రితి స్పోర్ట్స్‌కు రూ.42.22 కోట్లు చెల్లింపులు జరపాలి. రితి స్పోర్ట్స్‌లో ధోనీకి ఎక్కువ వాటాలు ఉన్నాయి. ధోనీ ఆమ్రపాలికి 3 ఏళ్ల పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.

రితి స్పోర్ట్స్‌తో ఆమ్రపాలి ఒప్పందం

రితి స్పోర్ట్స్‌తో ఆమ్రపాలి ఒప్పందం

రితి స్పోర్ట్స్‌తో ఆమ్రపాలి గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. హోమ్ బయ్యర్స్ అమౌంట్ రితి స్పోర్ట్స్‌కు అక్రమంగా మళ్లించారని తాము భావిస్తున్నామని, వాటిని రికవరీ చేయాల్సిన అవసరముందని సుప్రీం కోర్టు జస్టిస్ అరుణ్ మిశ్రా, యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం తన 270 పేజీల ఆర్డర్‌లో అభిప్రాయపడింది. అమ్రపాలి మాహి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్ కాపిటల్‌ను నగదు రూపంలో పొందింది. అలాగే, అన్ని ఖర్చులు నగదు రూపంలో చెల్లించబడ్డాయని ఆడిట్ నివేదిక తెలిపింది. ధోనీ సతీమణి సాక్షి ఈ కంపెనీలో డైరెక్టర్ ఉన్నారు.

ఫోరెన్సిక్ ఆడిటింగ్

ఫోరెన్సిక్ ఆడిటింగ్

ఆమ్రపాలి కేసులో పవన్ అగర్వాల్, రవీందర్ భాటియాలను ఫోరెన్సిక్ ఆడిటర్లుగా సుప్రీం కోర్టు నియమించింది. గ్రూప్ ఆర్థిక వ్యవహారాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై విస్తృత స్థాయిలో దర్యాప్తు చేయాలని వీరిని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే రూ.3,000 కోట్లకుపైగా హోమ్ బయ్యర్స్ నిధులపై ప్రాథమిక నివేదికనూ ఇవ్వాలని చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న గ్రూప్ సీఎండీ శర్మ, ఇద్దరు డైరెక్టర్లను అరెస్ట్ చేయాలని ఢిల్లీ పోలీసుల్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. సీఎండీ శర్మ, డైరెక్టర్లు శివ్ ప్రియ, అజయ్ కుమార్‌ల వ్యక్తిగత ఆస్తులను జప్తు చేయాలని కూడా అధికారులను ఆదేశించింది.

ధోనీ ఉన్నాడు...

ధోనీ ఉన్నాడు...

ధోనీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడని, గ్రూప్ ప్రాజెక్టుల ఆమోదానికి సంబంధించి చాలా లావాదేవీలను నిర్వహించారని, ఇతర గ్రూప్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు కూడా అతను జోక్యం చేసుకున్నాడని తమ ఆడిట్ రిపోర్టులో పవన్ కుమార్ అగర్వాల్, రవీందర్ భాటియా పేర్కొన్నారు. రాంచీలో ఓ ప్రాజెక్టు అభివృద్ధి కోసం ఈ సంస్థ (ఆమ్రపాలి మహి) విలీనం చేయబడిందని తమకు తెలిసిందని, ఇరువురి మధ్య ఎంవోయూ కూడా కుదిరిందని తెలిసిందని, కానీ తమకు అందుకు సంబంధించిన కాపీ మాత్రం అందించలేదని పేర్కొన్నారు.

ఖండించిన రితి స్పోర్ట్స్

ఖండించిన రితి స్పోర్ట్స్

అమ్రపాలి గ్రూప్‌తో చీకటి ఒప్పందం వార్తలను ధోనీకి చెందిన రితి స్పోర్ట్స్ ఖండించింది. ఆమ్రపాలితో ధోనీ ఎండోర్స్‌మెంట్స్ 2009-2015 మధ్య జరిగాయని, అవన్నీ విశ్వసనీయమైనవేనని రితి స్పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ చెప్పారు. రితి స్పోర్ట్స్ ఎండోర్స్‌మెంట్ ఏజెన్సీ అని, కమిషన్ బేసిస్ మీద సాగుతున్నామని, తమ సంస్థ ద్వారా అయిన ప్రతి లావాదేవీకి సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించేందుకు సిద్ధంగా ఉన్నామని, అలాగే విశ్వసనీయమైనవని, ప్రాపర్ అగ్రిమెంట్స్ ఉన్నాయని చెబుతున్నారు. పవన్ కుమార్, రవీందర్ భాటియా రిపోర్ట్ ప్రకారం ఆమ్రపాలి గ్రూప్ ఆఫ్ కంపెనీలు 2009-2015 మధ్య రూ.42.22 కోట్లు రితి స్పోర్ట్స్‌కు చెల్లించాయి.

ధోనీ సతీమణికి 25 శాతం వాటాలు

ధోనీ సతీమణికి 25 శాతం వాటాలు

అమ్రపాలి గ్రూప్‌లో ధోనీ సతీమణి సాక్షి డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ గ్రూప్‌లోని ఆమ్రపాలి మహి డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్‌లో 25 శాతం వాటాలు ఉన్నాయి. ఆమ్రపాలి గ్రూప్ సీఎండీ అనిల్ కుమార్ శర్మకు 75 శాతం వాటాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, జస్టిస్ అరుణ్‌ మిశ్రా, జస్టిస్ లలిత్‌లు వెల్లడించిన 270 పేజీల తీర్పులో పలు విషయాలు ఉన్నట్లు ఫోరెన్సిక్‌ ఆడిటర్లు తెలిపారు. మరోవైపు, ఆమ్రపాలి గ్రూప్ ప్రాజెక్టులో పదేళ్ల కింద బుక్ చేసుకున్న 5,500 చ.అ. పెంట్‌హౌస్‌కు సంబంధించిన యాజమాన్య హక్కులకు రక్షణ కోరుతూ ఈ ఏడాది ఏప్రిల్‌లో ధోనీ సుప్రీంకు వెళ్లాడు. ఐపీఎల్ 2015లో CSK జట్టుకు సంబంధించిన ప్రదేశాల్లో లోగోను ప్రదర్శించడానికి రితి స్పోర్ట్స్‌తో ఆమ్రపాలి ఒప్పందం కుదుర్చుకుందని, కానీ అది కేవలం కేవలం వారి మధ్య జరిగిన ఒప్పందమంటూ ఒక సాధారణ కాగితంపై ఉందని, ఎలాంటి సంతకాలు లేవని కూడా నివేదిక పేర్కొంది.

English summary

Dhoni backed Rhiti Sports denies any sham deals with Amrapali Group

Rhiti Sports Management, a company part-owned by MS Dhoni, has denied any wrongdoing in its transactions with real estate developer Amrapali Group, for which the cricketer was once a brand ambassador.
Story first published: Thursday, July 25, 2019, 8:56 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more