For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంటర్నేషనల్ మార్కెట్ ఎఫెక్ట్ ... రికార్డ్ స్థాయిలో పెరిగిన బంగారం ధరలు

|

ఇండియన్ మార్కెట్లలో బంగారం ధరలు మళ్లీ రికార్డు స్థాయికి చేరుకున్నాయి.ఇంటర్నేషనల్ మార్కెట్ ఎఫెక్ట్ తో దేశీయ మార్కెట్లలో బంగారం ధర ప్రియంగా మారింది. ఎంసిఎక్స్ కింద ఆగస్టు ఒప్పందాల తర్వాత బంగారం ధర 0.65% చేరడంతో రూ. 10 గ్రాములకు 35,409కి చేరింది. అక్టోబర్ ఒప్పందాలతో 0.7% పైగా పెరిగిన బంగారం ధర రూ. 35వేల 965 నుంచి రూ.36,000 మార్క్ చేరింది.

మరోవైపు వెండి ధరలు కూడా 1శాతం పైగా పెరిగి రూ.41వేల 218 చేరింది. ఎంసిఎక్స్ సెప్టెంబర్ ఒప్పందాలతో వెండి ధరలు పెరిగాయి. గ్లోబల్ మార్కెట్లలో మే 2013 నుంచి మొదటిసారి కీలక రేట్లలో రూ.1,450 స్థాయికి అధిగమించిన బంగారం ధరలు ఈ రోజు 6 సంవత్సరాల గరిష్టాన్ని తాకాయి. ఫెడరల్ రిజర్వ్ అధికారి కామెంట్స్ తర్వాత వడ్డీ రేటు తగ్గింపుపై అంచనాలను పెంచింది. బంగారం ఔన్స్ 1,452.60 డాలర్లకు చేరుకోగా, యూఎస్ బంగారం ఫ్యూచర్స్ 1.1 శాతం పెరిగి ఒక ఔన్స్ కు 1,44.10 డాలర్లకు చేరుకుంది. ఈ వారంలో ఇప్పటివరకు బంగారం ధరలు దాదాపు 2శాతంగా పెరిగాయి.వెండి ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. ఒక కిలోకు రూ. 910 పెరిగి రూ 41.100కి చేరుకుంది. ఇక గ్లోబల్ మార్కెట్లలో వెండి ధరలు కూడా భారీగానే పెరిగాయి. ఒక ఔన్స్ 0.5% పెరిగి 16.42 డాలర్లకు చేరుకుంది, జూన్ 25, 2018 నుంచి ఇదే అత్యధికం. ఈ వారంలో ఇప్పటివరకు వెండి 8శాతం పెరిగింది. మూడేళ్లలో ఇదే వారంలో వెండి ధర పుంజుకుంది.

విశాఖకు తగ్గుతున్న విమాన సర్వీసులు .. అలా లేకపోవటమే కారణంవిశాఖకు తగ్గుతున్న విమాన సర్వీసులు .. అలా లేకపోవటమే కారణం

ఢిల్లీ బులియన్ మార్కెట్లో శుక్రవారం పది గ్రాముల బంగారం ధర పెరిగి 30 5950 రూపాయలకు చేరుకుంది బంగారం బాటలోనే వెండి కూడా పెరుగుతూ పోతుంది. కొనుగోలు పెరుగుతున్న నేపథ్యంలో బంగారు ధరలు మరింత పెరుగుతున్నట్లుగా అఖిల భారత సరాఫా అసోసియేషన్ తెలిపింది. ఇక ముంబై బిలియన్ మార్కెట్ లోనూ బంగారం ధర 305 రూపాయలు పెరిగి 5198 రూపాయలకు చేరుకుంది.

International Market Effect ... Increased gold prices at record levels

డాలర్ బలహీనత నేపథ్యంలో రానున్న కాలంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. పశ్చిమ దేశాల భౌగోళిక రాజకీయ ఆందోళనలు, ఈనెలాఖరులో వడ్డీరేట్లను తగ్గించవచ్చన్న యూఎస్ ఫెడ్ అధికారుల సంకేతాలు బంగారం ధరల పెరుగుదలకు దారి తీస్తున్నట్టు కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ పేర్కొన్నారు.

English summary

ఇంటర్నేషనల్ మార్కెట్ ఎఫెక్ట్ ... రికార్డ్ స్థాయిలో పెరిగిన బంగారం ధరలు | International Market Effect ... Increased gold prices at record levels

Gold prices today surged to record highs in Indian markets, reflecting a firming global trend. On MCX, gold prices hit a new high, after August contracts surged 0.65% to ₹35,409 per 10 gram. Similarly, October gold contracts approached ₹36,000 mark when they surged over 0.7% to ₹35,965. Tracking gold, silver prices also zoomed with September contracts on MCX rising over 1% to ₹41,218. In Delhi spot market, gold and silver prices continued their rally. Gold rose by ₹280 to ₹35,950 per 10 gram while silver crossed ₹42,000 mark, according to the All India Sarafa Association.
Story first published: Saturday, July 20, 2019, 14:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X