For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిసెంబర్ 1 నుంచి టోల్‌ప్లాజా వద్ద అన్నీ FASTags లైన్లే, వారికి డబుల్ ఛార్జ్

|

న్యూఢిల్లీ: టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ నివారించేందుకు, వాహనాలు సాఫీగా ముందుకు సాగేందుకు జాతీయ రహదారులపై గల టోల్ ప్లాజాల వద్ద ఉన్న అన్ని రోడ్లను డిసెంబర్ 1వ తేదీ నుంచి ఫాస్ట్ ట్యాగ్ లేన్‌లుగా (FASTag lanes) ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

సీపీఎస్ఈ ఈటీఎఫ్ ప్రారంభమైంది... పెట్టుబడి పెడతారా?సీపీఎస్ఈ ఈటీఎఫ్ ప్రారంభమైంది... పెట్టుబడి పెడతారా?

హైబ్రిడ్ లైన్..

హైబ్రిడ్ లైన్..

అన్ని లైన్లలో ఓవర్ డైమెన్షనల్ లేదా భారీ వాహనాలను సులభతరం చేసేందుకు మరియు పర్యవేక్షించేందుకు ప్రతి టోల్ ప్లాజా వద్ద ఒక హైబ్రిడ్ లైన్‌ను ప్రకటిస్తుంది. ఇక్కడ ఫాస్ట్ ట్యాగ్, ఇతర చెల్లింపు పద్ధతులు స్వీకరిస్తారు. ఈ మేరకు శుక్రవారం నాడు కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ తెలిపింది. సమయాన్నిబట్టి ఈ లైన్‌ను కూడా ఫాస్ట్ ట్యాగ్ లేన్‌గా మారుస్తామని తెలిపింది.

ఇతర వాహనాలు వెళ్తే డబుల్ ఛార్జ్

ఇతర వాహనాలు వెళ్తే డబుల్ ఛార్జ్

డిసెంబర్ 1వ తేదీ తర్వాత FASTag వాహనాలను మాత్రమే అనుమతించే లైన్స్ నుండి ఫాస్ట్‌ట్యాగేతర వాహనాలు వెళ్తే డబుల్ ఛార్జ్ వసూలు చేయనున్నారు. ప్రతి టోల్ ప్లాజా వద్ద కొత్త ఛార్జ్ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని NHAIకు కేంద్రమంత్రిత్వ శాఖ లేఖ రాసింది. తాజా నిర్ణయం ఎలాంటి సమస్యలు లేకుండా అమలయ్యేందుకు దేశవ్యాప్తంగా అవసరమయ్యే FASTagలను అంచనా వేసి, అవసరమైన సంఖ్యలో అందుబాటులో ఉంచాలని సూచించింది.

ముందే అన్నీ సిద్ధం చేసుకోవాలి

ముందే అన్నీ సిద్ధం చేసుకోవాలి

ఈ కొత్త విధానం అమలు చేసేందుకు డిసెంబర్ 1వ తేదీ కంటే ముందు అన్ని టోల్ ప్లాజాల వద్ద అవసరమయ్యే మానవవనరులు, ఇతర సౌకర్యాలు సమకూర్చుకోవాలని తెలిపింది. ప్రస్తుతం ఫాస్ట్ ట్యాగేతర వాహనాదారులు సైతం ఫాస్ట్ ట్యాగ్ లైన్లలో వెళ్తూ, నగదు చెల్లింపులు జరుపుతున్నాయి. దీంతో టోల్ ప్లాజాల వద్ద రద్దీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది.

Read more about: fastag digital
English summary

డిసెంబర్ 1 నుంచి టోల్‌ప్లాజా వద్ద అన్నీ FASTags లైన్లే, వారికి డబుల్ ఛార్జ్ | FASTags to be made mandatory by 1 December, says road ministry

To ensure seamless traffic and prevent congestion at toll plazas, the government Friday said it has decided to declare all lanes at toll fee plaza on national highways as FASTag lanes from December 1.
Story first published: Saturday, July 20, 2019, 11:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X