For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ టారిఫ్ ఎంతోకాలం అంగీకరించం: భారత్‌పై ట్రంప్ ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా?

|

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ టారిఫ్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. చాలాకాలంగా లబ్ధిపొందుతున్న ఇండియా, ఇప్పుడు అమెరికా ఉత్పత్తులపై ఎక్కువ టారిఫ్ విధించడం ఆమోదయోగ్యం కాదని, దీనిని ఎక్కువకాలం సహించేది లేదని ఆయన చెప్పారు. G20 సమ్మిట్‌కు హాజరైన ట్రంప్ - ప్రధాని నరేంద్ర మోడీలు వాణిజ్యపరమైన చర్చల పరిష్కారం కోసం ఓ అంగీకారానికి వచ్చారు. కొద్ది రోజులకే ట్రంప్ మళ్లీ భారత్‌పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు.

ప్యాకేజీ: తెలంగాణకు రూ.450 కోట్లు, ఏపీకి రూ.15 కోట్లుప్యాకేజీ: తెలంగాణకు రూ.450 కోట్లు, ఏపీకి రూ.15 కోట్లు

చర్చలకు ముందు ట్రంప్ ఇలా...

చర్చలకు ముందు ట్రంప్ ఇలా...

ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. 'అమెరికా ఉత్పత్తులపై టారిఫ్స్‌తో భారత్ ఎంతోకాలంగా లాభపడుతోంది. ఇక ముందు ఇది ఆమోదయోగ్యం కాదు' అని ట్వీట్ చేశారు. త్వరలో ఇరుదేశాల మధ్య జరగనున్న వాణిజ్య అంశాలను పరిష్కరించేందుకు రెండు దేసాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. ద్వైపాక్షిక చర్చల కోసం అమెరికా ట్రేడ్ ప్రజంటేటివ్ అధికారులు, భారత్ అధికారులు వచ్చే వారం భేటీ కానున్నారు. ఇరుదేశాల మధ్య చర్చలు ఉంటాయని ఒకాసాలో ట్రంప్-మోడీ భేటీ అనంతరం ప్రకటించారు.

చర్చలకు ముందు ఏమిటిలా...

చర్చలకు ముందు ఏమిటిలా...

చర్చలకు ముందు ట్రంప్ ఇలా ట్వీట్ చేయడం ఏమిటనేది ఆసక్తిగా మారింది. భారత్ తగ్గకుంటే, ఉత్పత్తులపై మరింత టారిఫ్ విధిస్తామనేది ట్రంప్ హెచ్చరికగా భావిస్తున్నారు. భారత్‌తో చాలాకాలంగా ఉన్న వాణిజ్య సమస్యలను పరిష్కరించే ఉద్దేశ్యం ఆయనలో కనిపిస్తోందని, అదే సమయంలో మరో దేశంపై అధిక సుంకాలు విధించే సాకు కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. 2018 జనవరి నుంచి భారత ఉత్పత్తులపై అమెరికా 14 శాతం టారిఫ్ పెంచిందని, అలాగే జూన్ 2019న ఇండియా.. యూఎస్ ఉత్పత్తులపై 6 శాతం టారిఫ్ పెంచిందని గుర్తు చేస్తున్నారు. ఇందులో కాలిఫోర్నియా అల్మోండ్స్ దిగుమతుల విలువ 600 మిలియన్ డాలర్లుగా ఉందని చెబుతున్నారు.

ట్రంప్ ఆగ్రహానికి కారణం..

ట్రంప్ ఆగ్రహానికి కారణం..

భారత్‌కు చెందిన కొన్ని ఉత్పత్తులపై వాషింగ్టన్ ట్యాక్స్ ఎత్తివేసింది. GSP హోదాను తొలగించింది. భారత్ అమెరికాకు చెందిన 28 ఉత్పత్తుల మీద మాత్రమే అధిక మొత్తంలో టారిఫ్స్ విధించింది. ఈ-కామర్స్‌ రంగంలో భారత్ అవలంబిస్తోన్న కఠిన నిబంధనలు కూడా భారత్‌లో నడుస్తోన్న కొన్ని అమెరికా సంస్థల మీద ప్రభావం చూపుతుండటం ట్రంప్ ఆగ్రహానికి కారణం కావొచ్చునని చెబుతున్నారు. ఇటీవల ఈ-కామర్స్ రూల్స్‌ను భారత ప్రభుత్వం మార్చింది. ఆయా కంపెనీలు డేటా ఇక్కడే ఉండేలా చూసుకోవాలని భారత్ తేల్చి చెప్పింది. ఇది భారతీయ కంపెనీలకు లాభం చేయడంతో పాటు ఫారన్ కంపెనీలను దెబ్బతీస్తుందని, ఇదే ట్రంప్ ఆగ్రహానికి కారణమని చెబుతున్నారు.

English summary

ఈ టారిఫ్ ఎంతోకాలం అంగీకరించం: భారత్‌పై ట్రంప్ ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? | No longer acceptable: Donald Trump accuses India for tariffs on US products

President Donald Trump on Tuesday said India has long had a field day imposing tariffs on American products, which is no longer acceptable to the U.S.
Story first published: Wednesday, July 10, 2019, 10:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X