For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొగ త్రాగనేలా... ప్రీమియం భారం మోయనేలా !

By Jai
|

సిగరెట్ తాగవద్దు అంటే ఎవరు మాత్రం వింటారు.. తాగేస్తూనే ఉంటారు. ఈ సారికి మాత్రమే.. మళ్ళీ తాగనంటూ ఏవో హామీలిస్తుంటారు. సరదాగా అలవాటైన సిగరేట్... ఒక వ్యసనంలా మారిపోతుంది. ఇది చాలా మందికి అనుభవమే. మానేయాలనుకుంటారు.. కానీ మానేయలేరు. పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరం అన్న మాట పదేపదే వినిపిస్తున్నా దాన్ని పట్టించుకోరు. కొన్నాళ్ళు మానేయాలనుకుంటారు.

ఆ తర్వాత తిరిగి మొదలెడతారు. పొగ త్రాగడం వల్ల వారి ఆరోగ్యానికే కాకుండా పక్కనున్న వారికీ నష్టం వాటిల్లుతుంది. అసలు విషయానికి వస్తే.. పొగత్రాగే వారు బీమా పాలసీ తీసుకోవాలనుకుంటే కళ్ళు తెలేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఎలాంటి దురలవాట్లు లేనివారు, ధూమపాన అలవాటు ఉన్నవారు చెల్లించాల్సిన బీమా ప్రీమియంలో చాలా తేడా ఉంటుంది.

ఈ విషయాలు మీకు తెలుసా

ఈ విషయాలు మీకు తెలుసా

* ప్రపంచవ్యాప్తంగా వార్షికంగా కోటికి పైగా మంది పొగాకు సంబంధిత వ్యాధులతో మృతి చెందుతున్నారు. ఇందులో భారత్ వాటా ఆరింటా ఒకవంతు ఉంటుంది.

* ఒక సర్వే ప్రకారం మన దేశంలో దాదాపు 1.2 కోట్ల మంది పొగరాయుళ్లు ఉన్నారట. అంటే ప్రపంచంలోని పొగ త్రాగే వారిలో 12 శాతం మన దేశంలోనే ఉన్నారన్న మాట.

* పొగత్రాగే వారిలో పురుషులవాటా 52 శాతం, మహిళల వాటా 34 శాతంగా ఉంది.

* పొగాకు వినియోగం కారణంగా ఊపిరితిత్తుల కేన్సర్, ట్యూబర్క్యులోసిస్ వంటి వ్యాధులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందుకే పొగత్రాగేవారికి ఇచ్చే జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలపై ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

* కొన్ని నియమ నిబంధన ప్రకారం పొగత్రాగే వారిని త్రాగని వారిని బీమా కంపనీలు ప్రత్యేకంగా వర్గీకరిస్తుంటాయి.

* సిగరెట్లు, సింగర్స్ లేదా చ్యూయింగ్ గమ్ పొగాకును వినియోగించే వారిని స్మోకర్లుగా పరిగణిస్తుంటారు.

* మీరు ఎప్పుడో ఒకసారి పొగత్రాగినా, ఎప్పుడూ తాగినా బీమా కంపెనీలు ఒకేగాటన కట్టేస్తాయి.

* పొగత్రాగే వారు ఎక్కువగా వ్యాధుల బారిన పడటానికి, త్వరగా మృతి చెందడానికి అవకాశం ఉంటుంది. వీరి ఆరోగ్య సంరక్షణ వ్యయం కూడా సాధారణ వ్యక్తులతో పోల్చితే ఎక్కువ.

చెప్పడం మరవొద్దు

చెప్పడం మరవొద్దు

* మీరు టర్మ్ ఇస్యూరెన్సు తీసుకునే సమయంలో మీకున్న పొగత్రాగే అలవాటును చెప్పడం మరవొద్దు.

* ఒకవేళ మీరు ఈ విషయాన్నీ దాచిపెట్టి పాలసీ తీసుకున్నా ఒకవేళ దురదృష్ట వశాత్తు మృతి చెందితే... క్లెయిమ్ చేసినప్పుడు బీమా కంపెనీ మృతికి సంబంధించిన కారణాలను గుర్తించే అవకాశం ఉంటుంది.

* వివరాలు దాచి పాలసీ తీసుకున్నప్పుడు క్లెయిమ్ ను తిరస్కరించే హక్కు బీమా కంపనీకి ఉంటుంది.

* కొన్ని సందర్భాల్లో బీమా కంపనీలు పొగ త్రాగే వారికి ఇచ్చే బీమాను 50 శాతం అధిక ప్రీమియంకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారి ఆరోగ్యానికి సంబంధించిన రిస్క్ ఎక్కువగా ఉండటమే.

ఆరోగ్య బీమా

ఆరోగ్య బీమా

* ఆరోగ్య బీమాను ఇచ్చే సమయంలో బీమా కంపెనీలు వ్యక్తి వయసు, వారు చేసే ఉద్యోగం, ఉంటున్న ప్రదేశం, ఏమైనా వ్యాధులు ఉన్నాయా అన్న వివరాలు తెలుసుకొని బీమా పాలసీని ఇస్తుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో వయసుతోపాటూ వారి అలవాట్లను దృష్టిలో ఉంచుకుని మెడికల్ చెకప్ చేయించుకోమని చెబుతుంటాయి. అందులో వచ్చిన ఫలితాల ఆధారంగా బీమా ప్రీమియంను వసూలు చేస్తాయి.

* అవసరమైతే కొన్ని ఎక్కువ నిభందనలు కూడా విధంచవచ్చు.

* కొంతమంది రోజులో రెండు మూడు సిగరెట్లు తాగుతుంటారు. మరికొంతమంది ఇంకా ఎక్కువ తాగుతుంటారు. ఎవరైనా రోజుకు ఇరవైకి మించి సిగరెట్లు తాగితే వారికీ బీమా పాలసీని కంపెనీలు ఇవ్వకపోవచ్చు.

అందుకే స్మోకింగ్ కు దూరంగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కుటుంబంతో కలకాలం సంతోషంగా జీవించండి.

English summary

What happens if you smoker to get insurance?

If you die during that time period, there will be an investigation into the circumstances. If the insurance company discovers that you misrepresented anything on your application, including smoking, they can deny the claim or adjust it to allow for the premiums you should have been paying as a smoker.
Story first published: Thursday, July 4, 2019, 18:13 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more