For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

G20లో మోడీ లేవనెత్తిన అంశాలు, డిజిటల్ ఎకానమీ తీర్మానానికి భారత్ దూరం

|

ఒకాసా: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం నాడు ఇండోనేషియా, బ్రెజిల్, టర్కీ, ఆస్ట్రేలియా, సింగపూర్, చిలీ దేశాధినేతలతో సమావేశమయ్యారు. ట్రేడ్, తీవ్రవాదం, డిఫెన్స్, సముద్ర తీరంలో రక్షణ తదితర అంశాలపై చర్చించారు. ఇతర దేశాధినేతలతోను ఆయన సమావేశమయ్యారు. ముఖ్యంగా పరారీ ఆర్థిక నేరగాళ్లను వదలవద్దని, వారిప్ల కఠినంగా వ్యవహరించాలని ప్రధాని నరేంద్ర మోడీ జీ20 వేదికగా ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. శనివారం జీ20 సమ్మిట్ ముగిసిన అనంతరం సురేష్ ప్రభు మీడియాతో మాట్లాడారు.

తిరస్కరిస్తే... క్రెడిట్ కార్డ్ కోసం మళ్లీ మళ్లీ దరఖాస్తు చేయవచ్చా? సులభ మార్గాలు..

పరారీలోని ఆర్థిక నేరగాళ్లు, విపత్తులను తట్టుకునే కూటమి

పరారీలోని ఆర్థిక నేరగాళ్లు, విపత్తులను తట్టుకునే కూటమి

పన్ను ఎగవేతలు, అవినీతి, ఆర్థిక మోసాలు, పరారీలోని నేరగాళ్లకు సంబంధించిన అంశఆలను ప్రధానంగా తీసుకుని తమ ప్రభుత్వం పోరాడుతోందని సురేష్ ప్రభు చెప్పారు. జీ20 సభ్య దేశాలకూ వీటి ప్రాధాన్యతను వివరించామన్నారు. పరారీలోని ఆర్థిక నేరగాళ్ల అంశాన్ని గట్టిగా ఎదుర్కోవాలని మోడీ పిలుపునిచ్చారని చెప్పారు. అలాగే, ప్రకృతి విపత్తులకు వేగవంతమైన, సమర్థ తరుణోపాయాలు అవసరమని మోడీ పేర్కొన్నారు. ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు ప్రపంచస్థాయి సంకీర్ణంలో చేరాలని జీ20 కూటమి దేశాలకు పిలుపునిచ్చారు. విపత్తులను తట్టుకునేలా భవితను తీర్చిదిద్దే అంశంపై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి ఒక అంతర్జాతీయ కూటమి అవసరమని బ్యూనస్‌ ఎయిర్స్‌లో జరిగిన జీ20 సదస్సులో గట్టిగా ప్రస్తావించానని, ఈ కూటమిలో చేరి, మీ అనుభవాలను, నైపుణ్యాన్ని పంచుకోవాలన్నారు. భారత సంప్రదాయ చికిత్స విధానాలు యోగా, ాయుష్, తన ప్రభుత్వం చేపట్టిన ఆయుష్మాన్ భవ పథకాల గురించి మోడీ ప్రస్తావించారు. మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు అని మోడీ అన్నారు. ఉగ్రవాదం అనే భయంకర భావజాలం వల్ల అమాయకుల ప్రాణాలు పోవడమే కాకుండా దేశాల ఆర్థికాభివృద్ధి, సామాజిక స్థిరత్వంపై ప్రభావం పడుతోందన్నారు. ఉగ్రవాదాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవాలన్నారు.

ఆరు దేశాధినేతలతో చర్చలు

ఆరు దేశాధినేతలతో చర్చలు

మోడీ శనివారం తీరికలేకుండా గడిపారు. ఆరు దేశాల అధినేతలతో భేటీ అయ్యారు. వాణిజ్యం, ఉగ్రవాదం, రక్షణ, సముద్ర భద్రత వంటి అంశాలపై చర్చించారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతో భేటీ అయ్యారు. 2025 నాటికి భారత్ - ఇండోనేషియాలు 50 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుతం ఇది 20 బిలియన్ డాలర్లుగా ఉంది. టర్కీ అధ్యక్షుడు ఎడ్గోగాన్‌తో భేటీలో S-400 ఎయిర్ డిఫెన్స్ డీల్ అంశంపై చర్చించారు. క్రీడలు మైననింగ్, రక్షణ, సముద్రరంగం, భారత్-పసిఫిక్ వంటి అంశాల్లో సహకారంపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌తో చర్చించారు. మోరిసన్.. మోడీతో తీసుకున్న సెల్ఫీని హిందీలో ట్వీట్ చేశారు.

డిజిటల్ డిక్లరేషన్‌లో ఎందుకు చేరలేదు?

డిజిటల్ డిక్లరేషన్‌లో ఎందుకు చేరలేదు?

డిజిటల్ ఎకానమీపై ఒసాకా డిక్లరేషన్‌లో భారత్ ఎందుకు భాగస్వామి కాలేదనే ప్రశ్నకు సురేష్ ప్రభు సమాధానం చెబుతూ... ఆ కారణాలను జపాన్ ప్రధాని షింజో అబేకు చెప్పామన్నారు. డిజిటల్ ఎకానమీని భారత్ గట్టిగా విశ్వసిస్తోందన్నారు. ఇందులో భాగంగానే బ్యాంక్ ఖాతాలను పెద్ద ఎత్తున ఓపెన్ చేస్తున్నామన్నారు. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు భారత్‌ చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటికే ఎన్నో ట్రాన్సాక్షన్స్ డిజిటల్ ఫాంలోకి మళ్లాయన్నారు. డేటా డిక్లరేషన్ పైన భారత్ సంతకం చేయలేదు. డేటా ప్రవాహానికి సరిహద్దులు ఉండకూడదనే ఈ డిక్లరేషన్‌కు భారత్ నో చెప్పింది. యూఎస్, జపాన్ వంటి దేశాలు సంతకం చేశాయి.

English summary

India pitches strongly for fight against fugitive economic offenders at G20 Summit

India has pitched strongly to deal with fugitive economic offenders, and Prime Minister Narendra Modi has flagged the issue at all global forums, the country's Sherpa to G20 Suresh Prabhu said Saturday.
Story first published: Sunday, June 30, 2019, 9:37 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more