For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సింగపూర్ SMEలపై SBI కన్ను, యోనో యాప్ లాంచ్!

|

ఆసియా పసిఫిక్‌లో చిన్న, మధ్య తరహా పారిశ్రామిక రంగాల్లో (SME) సంబంధాలను పటిష్టం చేసే అంశంపై ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దృష్టి సారించింది. తద్వారా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సింగపూర్‌లోని వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధమైంది. సింగపూర్ బేస్డ్ SMEలకు రుణాలను విస్తరించనుంది.

SMEలకు క్రెడిట్ విస్తరణ

SMEలకు క్రెడిట్ విస్తరణ

ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్‌టెక్) కంపెనీల నుంచి గట్టి పోటీ ఉంది. ఈ పోటీని దృష్టిలో ఉంచుకొనే ఎస్బీఐ యోనో యాప్‌ను సింగపూర్‌లో పరిచయం చేస్తున్నారు. అన్ని బ్యాంకు ఖాతాలకు ఈ-రెమిట్, రెమిటెన్స్ కియోస్క్ ఛానల్స్ ద్వారా సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఎస్బీఐ కంట్రీ హెడ్ కిషోర్ కుమార్ పోలుదాసు మాట్లాడుతూ... సింగపూర్‌కు చెందిన SMEలకు క్రెడిట్ విస్తరించే ప్రయత్నంలో ఉన్నామని, తద్వారా వారి వ్యాపారానికి అండగా ఉన్నట్లు అవుతుందని చెప్పారు.

ఉద్యోగాల శాతం 65

ఉద్యోగాల శాతం 65

2017 ఆర్థిక లెక్కల ప్రకారం సింగపూర్ SMEలో ఉద్యోగాల వాటా 65 శాతంగా ఉంది. ఆర్థిక వ్యవస్థలో SME వాటా 49 శాతంగా లేదా 196.8 బిలియన్ డాలర్లు (SGD)గా ఉంది. ఈ నేపథ్యంలో SMEలో తమ సేవలు మరింత విస్తరించేందుకు అవకాశాలు ఉన్నాయని, దానిపై వర్క్ చేస్తున్నామని ఆయన తెలిపారు. SMEలకు తమ సేవలు మరింత విస్తరించి వ్యాపారాన్ని మరింత పటిష్టం చేసుకోవాలనేది తమ అభిమతమని, అందుకు తగ్గట్లుగా ముందుకు సాగుతున్నామన్నారు.

సింగపూర్‌లో యోనో

సింగపూర్‌లో యోనో

ఫిన్‌టెక్ సంస్థల నుంచి గట్టి పోటీ ఉందని, అయినప్పటికీ టెక్నాలజీని బ్యాంకులు వేగంగా అందిపుచ్చుకుంటున్నాయని ఆయన చెప్పారు. సింగపూర్‌లో విస్తృత సేవల్లో భాగంగా యోనో యాప్, ఓమ్నీ-ఛానల్ సేవలను వారికి ఓ క్లిక్ దూరంలో అందించే ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. యోనో యాప్ ఇండియాలో విజయవంతమైందని, దీనిని సింగపూర్‌లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నామన్నారు.

నాలుగు దశాబ్దాలుగా సేవలు

నాలుగు దశాబ్దాలుగా సేవలు

42 ఏళ్లుగా (1977 నుంచి) సింగపూర్‌లో సేవలు అందిస్తోంది ఎస్బీఐ. ఎస్బీఐ సింగపూర్‌లో రిటైల్, కార్పోరేట్ సెక్టార్‌కు 2008 నుంచి క్వాలిఫైడ్ ఫుల్ బ్యాంక్ సేవలు అందిస్తోంది. ఏటీఎ5 నెట్ వర్క్ ద్వారా ఏటీఎం సేవలు అందిస్తోంది. ఆరు శాఖలు ఉన్నాయి. రెండు రెమిటెన్స్ సెంటర్లు ఉన్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలోని భారతీయ కార్మికులకు సేవలు అందిస్తోంది. 2018 మే 31వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ సింగపూర్ వెళ్లినప్పుడు అక్కడ ఆయన మూడు ఇండియన్ యాప్స్ లాంచ్ చేశారు. BHIM, Rupay, SBI app లాంచ్ చేశారు.

English summary

సింగపూర్ SMEలపై SBI కన్ను, యోనో యాప్ లాంచ్! | SBI's plans for Singapore: Lender eyes SME businesses, set to introduce YONO SBI app

In a bid to enhance its relationship across small and medium enterprises (SMEs), some of which have strong footholds across Asia Pacific, the State Bank of India (SBI) is planning to extend credit to Singapore-based SMEs.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X