For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎలక్ట్రిక్‌ కు మారే విధి విధానాలను 15రోజుల్లో సమర్పించండి..! వాహన కంపెనీలను కోరిన నీతి ఆయోగ్‌..!!

|

న్యూఢిల్లీ/హైదరాబాద్ : సంప్రదాయ వాహనాల తయారీ నుంచి ఎలక్ట్రిక్‌ మోడళ్లకు మారే ప్రణాళికలను రెండు వారాల్లో సమర్పించాలని ద్వి, త్రిచక్ర వాహన కంపెనీలను నీతి ఆయోగ్‌ కోరింది. శుక్రవారం నాడు ఆటో కంపెనీలు, ఎలక్ట్రిక్‌ వాహన స్టార్ట్‌పల ప్రతినిధులతో నీతి ఆయోగ్‌ సమావేశం జరిగింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు కంపెనీలు చర్యలు చేపట్టకపోతే న్యాయస్థానాలు కలుగజేసుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీని నీతి ఆయోగ్‌ హెచ్చరించింది. ఈ భేటీకి బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌, టీవీఎస్‌ మోటార్‌ కో-చైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌, హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా ప్రెసిడెంట్‌, సీఈఓ మినోరు కతో, భారత వాహన తయారీదారుల సంఘం (సియామ్‌) ప్రెసిడెంట్‌ విష్ణు మాథుర్‌, ఆటోమోటివ్‌ కాంపోనెంట్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ విన్నీ మెహతాతోపాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

 ఎలక్ట్రిక్ కు మారా మార్గదర్శకాలపై ఆరా..! వాహన కంపెనీలకు గడివు విధించిన నీతి ఆయోగ్..!!

ఎలక్ట్రిక్ కు మారా మార్గదర్శకాలపై ఆరా..! వాహన కంపెనీలకు గడివు విధించిన నీతి ఆయోగ్..!!

నీతి ఆయోగ్‌ నుంచి వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌, సీఈఓ అమితాబ్‌ కాంత్‌లు ఈ సమావేశానికి ప్రాతినిథ్యం వహించారు. ‘స్పష్టమైన విధానం, రోడ్‌మ్యాప్‌ లేకుండా పూర్తిగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి మారడం జరిగే పనికాదు. భవిష్యత్‌ విధానాలపై అస్పష్టత వద్దు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత కాలుష్య కారకమైన 15 నగరాల్లో 14 భారత్‌కు చెందినవే' అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు అన్నారు. 2023కల్లా త్రిచక్ర వాహన విభాగంలో, 150సీసీ లోపు ఇంజన్‌ సామర్థ్యం కలిగిన టూవీలర్ల విభాగంలో 2025కల్లా పూర్తిగా ఎలక్ట్రిక్‌ మోడళ్లకు మారాలని నీతి ఆయోగ్‌ వాహన రంగాన్ని కోరుతోంది.

 బీఎస్-6కు మారడం సవాలే..! ఐనా ప్రయత్నిస్తామన్న టీవీఎస్‌..!!

బీఎస్-6కు మారడం సవాలే..! ఐనా ప్రయత్నిస్తామన్న టీవీఎస్‌..!!

కాలుష్య ఉద్గార ప్రమాణాలైన బీఎస్‌-4 నుంచి బీఎస్-6కు మారడం వాహన తయారీ రంగం పాలిట సవాలేనని టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) ద్వితీయార్ధం(అక్టోబరు-మార్చి)లో వాహన డిమాండ్‌ అనిశ్చితి మరింత పెరగవచ్చని అంటోంది. గత ఆర్థిక సంవత్సరం(2018-19)తో పోలిస్తే 2019-20లో ద్విచక్ర వాహన విక్రయాల వృద్ధి 6-8 శాతానికి పరిమితం కావచ్చని టీవీఎస్‌ మోటార్‌ అంచనా వేసింది. ఈ ఏడాది వర్షపాతం సాధారణ స్థాయికంటే తగ్గితే టూవీలర్‌ విక్రయాలపై ప్రభావం చూపవచ్చని గత ఆర్థిక సంవత్సర నివేదికలో కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది.

 ఎలక్ట్రిక్‌ వాహనాల వాటాను 15 శాతానికి పెంచాలి..! కేంద్రం సూచన..!!

ఎలక్ట్రిక్‌ వాహనాల వాటాను 15 శాతానికి పెంచాలి..! కేంద్రం సూచన..!!

ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా విద్యుత్‌ వాహనాలకు రిజిస్ట్రేషన్‌ చార్జీల నుంచి మినహాయింపునివ్వాలని భావిస్తోంది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ విడుదల చేసిన ఒక ముసాయిదా నోటిఫికేషన్‌లో ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది. ద్విచక్ర వాహనాలు సహా అన్ని రకాల విద్యుత్‌ వాహనాలకు దీన్ని వర్తింపచేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈ దిశగా కేంద్రీయ మోటారు వాహనాల చట్టంలోని రూల్‌ 81కి సవరణలు చేసేలా రహదారుల శాఖ ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేసింది. నెల రోజుల్లోగా సంబంధిత వర్గాలు దీనిపై తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది. వచ్చే ఐదేళ్లలో దేశీయంగా విక్రయించే మొత్తం వాహనాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల వాటాను 15 శాతానికి పెంచాలని కేంద్రం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే.

2030నాటికల్లా అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే..! ఏర్పాట్లు చేసుకుంటున్న వాహన కంపెనీలు..!!

2030నాటికల్లా అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే..! ఏర్పాట్లు చేసుకుంటున్న వాహన కంపెనీలు..!!

మారుతున్న కాలంతో పాటు వాతావరణం తొందరగా కలుషితమౌతోంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో పదేండ్లలో అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే అందుబాటులో ఉండేందుకు చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే చాలావరకు ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వచ్చినా వాటి వినియోగం తక్కువగా ఉంది. అయితే ఇందుకు సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిబంధన 81లో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. కాలుష్యం ఉద్గారాలు వెదజల్లని ఈవీ వాహనాల వినియోగాన్ని భారీగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే పదేళ్ల తర్వాత కేవలం ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని నీతి అయోగ్ సూచిస్తోంది.

English summary

Submit the switch to Electricity within 15 days.!Neeti Aayog is seeking car companies .. !!

Neethi Aayog has asked two and three-wheeler companies to submit plans for switching from conventional vehicles to electric models within two weeks. Niti Aayog met with representatives of auto companies and electric vehicle startups on Friday. Niti Aayog has warned the industry that if the companies do not take action to reduce the pollution, the courts are likely to suffer.
Story first published: Saturday, June 22, 2019, 11:43 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more