For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్: జగన్ సూచన, రూ.30,000 కోట్లతో కడపలో పరిశ్రమ? 75 శాతం ఉద్యోగాలు వారికే...

|

అమరావతి: సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ ఉక్కు పరిశ్రమ పోస్కో స్టీల్ కంపెనీ.. నవ్యాంధ్ర ప్రదేశ్‌లో ఉక్కు పరిశ్రమ నెలకొల్పేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈ సంస్థ సీఈవో బాంగ్ గిల్ హో నేతృత్వంలోని ప్రత్యేక బృందం గురువారం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసింది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు త్వరలో ఏపీకి టెక్నికల్ బృందాన్ని పంపించనున్నట్లు తెలిపారు.

జూలై 10న బడ్జెట్!: జగన్ హామీలపై కేటాయింపులు ఎలా?

కడపను పరిశీలించాలని జగన్

కడపను పరిశీలించాలని జగన్

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... పరిశ్రమల ఏర్పాటును తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, వీటి వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. పోస్కో కంపెనీ ప్రతిపాదనలను పరిశీలించాలని, తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. కంపెనీ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని అన్వేషించనున్నారు. ఇప్పటికే విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉంది. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో ఏర్పాటు అవకాశాన్ని పరిశీలించాలని జగన్ వారికి సూచించారు. ఇక్కడ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను కంపెనీ మూడు నెలల్లో తేల్చనుంది. రూ.30,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగ సంస్థ RINL(విశాఖ స్టీల్)తో కలిపి ఏర్పాటు చేసేందుకు పోస్కో కంపెనీ ఆసక్తిగా ఉంది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ద్వారా దాదాపు 6,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.

పెట్టుబడులపై జపాన్ కంపెనీ ఆసక్తి

పెట్టుబడులపై జపాన్ కంపెనీ ఆసక్తి

జపాన్‌కు చెందిన ఏటీజీ టైర్ల కంపెనీ కూడా పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం సమీపంలో దాదాపు రూ.1,600 కోట్లతో టైర్ల కంపెనీని నెలకొల్పేందుకు ఏటీజీ ఆసక్తిగా ఉంది. 100 నుంచి 125 ఏకరాల్లో అచ్యుతాపురం సెజ్‌ లో దీనిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించింది. వ్యవసాయ, నిర్మాణ రంగంలోని యంత్రాలకు వినియోగించే భారీ టైర్లను ఈ సంస్థ తయారు చేస్తోంది. మహారాష్ట్రలో ఈ కంపెనీ యూనిట్ ఉంది. ఏపీలో మరో యూనిట్ ఏర్పాటుకు ఆసక్తితో ఉంది.

సీఎంను కలిసిన చైనా ఎలక్ట్రానిక్ సంస్థ

సీఎంను కలిసిన చైనా ఎలక్ట్రానిక్ సంస్థ

చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ సంస్థ టీసీఎల్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి జగన్‌తో పెట్టుబడుల అంశంపై చర్చించింది. రూ.2,200 కోట్లతో 153 ఎకరాల్లో డిస్‌ప్లే ప్యానల్ యూనిట్‌కు గత డిసెంబర్‌లో శంకుస్థాపన చేశారు. భూమి, నీటి సమస్య కారణంగా ప్రాజెక్టు పనులు ముందుకు కదల్లేదు. ఈ అంశంపై సీఎంతో వారు చర్చించారు. సూపర్ ప్రోయాక్టివ్ క్లియరెన్స్ కింద ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని, అలాగే టీసీఎల్ సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

75 శాతం ఉద్యోగాలు స్థానికులకే

75 శాతం ఉద్యోగాలు స్థానికులకే

పోస్కో కంపెనీతో జగన్ చర్చల సమయంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకేనని చెప్పారు. పారిశ్రామిక, ఐటీ రంగాల అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేసి, అమలు చేస్తామన్నరు. ఐటీ అభివృద్ధికి మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు విశాఖ కేంద్రంగా పెద్ద పెద్ద ఉండేలా చూస్తామన్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో BPOల ఏర్పాటుకు స్థల లభ్యత తక్కువగా ఉందని, ఆయా చోట్ల అద్దెలు భారీగా ఉన్నందున ఏపీలోని ద్వితీయ శ్రేణి పట్టణాలు వీటికి అనుకూలమని భావిస్తున్నట్లు గౌతమ్ రెడ్డి చెప్పారు.

English summary

South Korea Posco and Many other countes companies are ready to invest in Andhra Pradesh.

South Korea Posco and Many other countes companies are ready to invest in Andhra Pradesh.
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more