For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికా-చైనా ట్రేడ్ వార్: ఇండియా ఎగుమతులకు బూస్ట్

|

అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు టారిఫ్‌లు విధించుకుంటున్నారు. వారి ట్రేడ్ వార్ భారత్ ఎగుమతులకు కొత్త ఉత్సాహం ఇచ్చిందని చెబుతున్నారు. రసాయనాలు (కెమికల్స్), గ్రానైట్స్ సహా 350 రకాల ఉత్పత్తులను అమెరికా, చైనా దేశాలకు అదనంగా ఎగుమతి చేసేందుకు ఉపకరిస్తోందని కామర్స్ మినిస్ట్రీ చెబుతోంది. వారి మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా భారత్ ఉత్పత్తులకు తలుపులు మరింత బార్లా తెరిచినట్లుగా అయిందని చెబుతున్నారు.

డీజిల్, ఎక్స్‌రే ట్యూబ్స్, కొన్ని రసాయలనాలు సహా 151 ఉత్పత్తులు అమెరికా నుంచి చైనాకు దిగుమతి అవుతాయని, వాటి స్థానంలో భారత్‌కు అవకాశం లభిస్తుందని, అలాగే రబ్బర్, గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ వంటి 203 ఉత్పత్తులు చైనా నుంచి అమెరికాకు దిగుమతి అవుతాయని, ట్రేడ్ వార్ నేపథ్యంలో ఇది భారత్‌కు ఉపకరిస్తుందని చెబుతున్నారు.

India can boost exports of 300 products to US, China amid trade war

ఉత్పత్తితో పాటు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొన్నింటిని భారత్ వెంటనే చైనాకు ఎగుమతి చేయనుందని చెబుతున్నారు. ఇండియా ఎగుమతులు పెరగడం వల్ల చైనాతో వాణిజ్య లోటును భర్తీ చేసేందుకు ఉపయోగపడుతుంది. అమెరికా - చైనా ట్రేడ్ వార్ భారత్‌కు లబ్ధి చేకూరుస్తోందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ (FIEO) ప్రెసిడెంట్ గణేష్ కుమార్ గుప్తా చెప్పారు. 2018లో అమెరికాకు ఎగుమతులు 11.2 శాతం పెరిగాయని, చైనాకు 31.4 శాతం పెరిగాయని చెప్పారు.

అమెరికాపై భారత్ అధిక టారిఫ్‌లు ఎందుకు?అమెరికాపై భారత్ అధిక టారిఫ్‌లు ఎందుకు?

English summary

అమెరికా-చైనా ట్రేడ్ వార్: ఇండియా ఎగుమతులకు బూస్ట్ | India can boost exports of 300 products to US, China amid trade war

The ongoing trade war between the US and China offers an opportunity to India for boosting exports of as many 350 products such as chemicals and granite to these countries, a study by the Commerce Ministry has said.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X