For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకుల్లో పతనం.. మార్కెట్లను కూలదోసింది !

By Chanakya
|

స్టాక్ మార్కెట్లో వరుసగా రెండో రోజు కూడా నష్టాల పరంపర కొనసాగింది. అయితే నిన్నటి మాదిరి భారీ స్థాయిలో నష్టాలు లేకపోయినా ఒకమోస్తరు నష్టాలు, స్వల్ప లాభాలతో ముగిసింది సెన్సెక్స్, నిఫ్టీ. మిడ్ సెషన్ తర్వాత తీవ్ర ఒడిదుడుకులకు లోనైన మార్కెట్ సూచనలు చివరకు పెద్ద హడావుడి లేకుండా అక్కడిక్కడే ముగిసింది. ప్రధానంగా ఇండియాబుల్స్ గ్రూప్ న్యూస్ మార్కెట్ల మూడ్‌ను మిడ్ సెషన్ తర్వాత కొద్దిగా లిఫ్ట్ చేసింది. చివరకు సెన్సెక్స్ 15 పాయింట్ల నష్టంతో 39742 దగ్గర ముగిసింది. నిఫ్టీ మాత్రం 8 పాయిట్ల లాభంతో 11914 దగ్గర క్లోజైంది. బ్యాంక్ నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 30976 వద్ద స్థిరపడింది.

సెక్టోరల్ ఇండిసెస్ పరంగా చూస్తే ఫైనాన్షియల్ సర్వీసెస్, మీడియా, రియాల్టీ మినహా దాదాపు అన్నిరంగ షేర్లలోనూ సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా నమోదైంది. ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్ అత్యధికంగా నష్టాలను మూటగట్టుకున్నాయి.

Sensex stages smart 300 pt rebound, ends flat; Nifty holds above 11,900

ఇండియాబుల్స్ హౌసింగ్, జీ ఎంటర్‌టైన్మెంట్, బిపిసిఎల్, గ్రాసిం, పవర్ గ్రిడ్ స్టాక్స్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. యెస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యూపీఎల్, ఇన్ఫోసిస్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్టాక్స్ లూజర్స్ జాబితాలో చేరాయి.

యెస్ బ్యాంక్‌ తుస్... !

ఇప్పటికే యాజమాన్య మార్పు ఇబ్బందులు, ఆర్బీఐ డైరెక్టర్ అరంగేట్రం వంటి తలనొప్పులతో ఇబ్బందిపడ్తున్న యెస్ బ్యాంకు నెత్తిన యూబీఎస్ రీసెర్చ్ సంస్థ పెద్ద బండపడేసింది.
తన టార్గెట్‌ను ఏకంగా 18 శాతం (రూ.90) తగ్గించడంతో పాటు యెస్ బ్యాంక్ షేర్ కుప్పకూలింది. కష్టకాలాన్ని గుర్తించిన యెస్ బ్యాంక్ మాజీ ఎండీ.. బయటకు వచ్చి కొత్త బోర్డుకు పూర్తిగా సహకరిస్తానని ప్రకటించినప్పటికీ స్టాక్ ప్రైస్‌లో మాత్రం పెద్దగా మార్పుల్లేవు. చివరకు 13 శాతం కోల్పోయి రూ.117 దగ్గర క్లోజైంది స్టాక్.
ఇదే బాటలో ఇండస్ ఇండ్ బ్యాంక్ టార్గెట్‌పై కూడా కోత విధించిన గ్లోబల్ రీసెర్చ్ సంస్థ యూబీఎస్. ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ లేని వివిధ కంపెనీలకు ఈ రెండు సంస్థలు ఇచ్చిన రుణాలు రాబోయే రోజుల్లో ఇబ్బందిపెట్టవచ్చని అంచనాకు వచ్చింది యూబీఎస్. దీంతో తన టార్గెట్‌ను కోత విధించింది. దీంతో ఇంట్రాడేలో రూ.1440కి దిగొచ్చింది స్టాక్. చివరకు రూ.1489 దగ్గర క్లోజైంది ఇండస్ ఇండ్ బ్యాంక్ స్టాక్ 5 శాతానికిపైగా నష్టంతో.
ఈ రెండు బ్యాంకులకూ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి రుణబకాయిలు అందాల్సి ఉండడం కూడా మరో కామన్ పాయింట్.

జెట్ ఎయిర్.. ఇక గాల్లో దీపమే

ఇప్పటికే అటకెక్కిన కార్యకలాపాలకు తోడు కొత్త ఇన్వెస్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడం జెట్ ఎయిర్‌కు మరింత ఇబ్బందులు తెచ్చిపెడ్తోంది. దీనికి తోడు రోజు వారి ట్రేడింగ్‌ను ఈ స్టాక్‌లో ఎక్స్ఛేంజీలు నిలిపేస్తున్నాయి. ట్రేడ్ టు ట్రేడ్ సెగ్మెంట్లోకి మార్చబోతున్న నేపధ్యంలో స్టాక్ భారీగా పతనమైంది. ఇంట్రాడేలో రూ.84.60 స్థాయికి పడిపోయిన స్టాక్ చివర్లో కొద్దిగా కోలుకుని రూ.92 దగ్గర క్లోజైంది.

దివాన్ మళ్లీ డౌన్

మొన్న సుమారు రూ.900 కోట్ల వడ్డీ బకాయిలను చెల్లించిన నేపధ్యంలో నిన్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ కొద్దిగా కోలుకుంది. సుమారు 5 శాతం వరకూ లాభపడింది. అయితే ఈ రోజు ఈ స్టాక్ మళ్లీ నేలచూపులు చూసింది. స్టాక్ 10 శాతం పతనమై రూ.84.35 దగ్గర క్లోజైంది.

నియోజెన్ వెలుగులు

కెమికల్ సంస్థ నియోజెన్ స్టాక్ కొద్ది రోజుల నుంచి సూపర్ యాక్టివ్‌గా ట్రేడవుతోంది. స్టాక్ మూడో రోజు కూడా లాభాల్లో కొనసాగింది. సుమారు 10 శాతం పెరిగి ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరాయి. వాల్యూమ్స్ కూడా యావరేజ్‌తో పోలిస్తే సుమారు 16 రెట్లు పెరిగాయి. చివరకు 7 శాతం లాభాలతో రూ.388.45 దగ్గర క్లోజైంది.

ప్రభుత్వ బ్యాంకుల్లో పతనం

కొన్ని వారాల నుంచి యాక్టివ్‌గా ట్రేడవుతూ వస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ స్టాక్స్‌లో మళ్లీ తీవ్ర అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా నమోదవుతోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టాక్ ఏకంగా 7 శాతం నష్టపోయింది. జెకె బ్యాంక్, కెనెరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ స్టాక్స్ 5 శాతం వరకూ కోల్పోయాయి.

English summary

బ్యాంకుల్లో పతనం.. మార్కెట్లను కూలదోసింది ! | Sensex stages smart 300 pt rebound, ends flat; Nifty holds above 11,900

Sensex stages smart 300 points rebound, ends flat; Nifty holds above 11,900. YES Bank drops 13%.
Story first published: Thursday, June 13, 2019, 17:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X