For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బై బై చైనా .... జై జై ఇండియా : ఫ్లిప్కార్ట్ సరికొత్త వ్యూహం

By Jai
|

హైదరాబాద్: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్... తన వ్యూహాలను మారుస్తోంది. ఇప్పటి వరకు మార్కెట్ ప్లేస్ లో విక్రయించే ప్రైవేట్ లేబుల్ వస్తువులను చైనా నుంచి భారీగా దిగుమతి చేసుకొంటుండేది. అయితే ఇటీవల భారత ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఈకామెర్స్ విధానంతో దీనికి చెక్ పడింది. దీంతో చైనా లో తయారు చేయడం లేదా ఔట్సోర్స్ చేసుకొనే ఉత్పత్తుల దిగుమతులు తగ్గించేసింది. రెండేళ్ల క్రితం దాదాపు 100 శాతం ఎలక్ట్రానిక్స్, ఆక్సిస్సోరీస్, వినియోగ వస్తువులు, టెక్స్టైల్స్, టాయ్స్, ఫర్నిచర్ వంటి ఉత్పత్తులను దిగుమతి చేసుకొంటే... ఇప్పుడు అది కేవలం 50% శాతానికి పడిపోయింది. ఆ తర్వాత కంపెనీ మలేషియా నుంచి దిగుమతి చేసుకునేది.

వ్యక్తిగత రుణం తీసుకోవాలనుకుంటున్నారా... అయితే ఈ విషయాలు మరవొద్దు...వ్యక్తిగత రుణం తీసుకోవాలనుకుంటున్నారా... అయితే ఈ విషయాలు మరవొద్దు...

వ్యూహాలు మార్చక తప్పలేదు

వ్యూహాలు మార్చక తప్పలేదు

చైనాలో తయారయ్యే ఉత్పత్తులను తన సొంత వెబ్సైటులో అత్యంత చవకగా ఫ్లిప్కార్ట్ విక్రయించేది. నూతన నిబంధనలు కొంత ఇబ్బంది కరం అయినప్పటికీ... ఈ విధానాన్ని తప్పనిసరిగా పాటించాల్సిందే కాబట్టి వాల్‌మార్ట్ వాసం ఐన అతిపెద్ద దేశీయ స్టార్టప్ కంపెనీ ఇప్పుడు వ్యూహాలు మార్చక తప్పలేదు. ఫ్లిప్కార్ట్ ప్రస్తుతం చైనా నుంచి దిగుమతి చేసుకొనే ప్రొడక్టుల్లో సింహ భాగం ఇండియాలోనే తయారు చే స్తోంది. దీంతో స్థానిక కంపెనీలు అలాగే కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయని భావిస్తున్నారు. ఈమేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.

మేక్ ఇన్ ఇండియాకు దన్ను

మేక్ ఇన్ ఇండియాకు దన్ను

ప్రభుత్వ నిర్ణయంతో మాక్ ఇన్ ఇండియాకు దన్ను లభించినట్టు అవుతోంది. ఫ్లిప్కార్ట్ రూట్ లోనే మరిన్ని ఈ కామర్స్ కంపెనీలు పయనించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఫ్లిప్కార్ట్ దాదాపు 300 కేటగిరీలకు సంబంధించిన వేలకొద్దీ ఉతపట్టులను భరత్ లో తయారు చేయడం వాళ్ళ ఇండియాకు బోలెడంత విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. మరి కొన్ని రోజుల్లో ఫ్లిప్కార్ట్ పూర్తిగా భరత్ లోనే అన్ని రకాల ఉత్పత్తుల తయారీ చేపట్టే అవకాశం ఉందని అంటున్నారు.

చిన్న వ్యాపారాలు గుర్రు....

చిన్న వ్యాపారాలు గుర్రు....

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కంపెనీలు భారీగా డిస్కౌంట్స్ ఇచ్చి కస్టమర్స్ ఊరించి వారితో కొనుగోళ్లు జరిపేలా మార్కెటింగ్ వ్యూహాలు పన్నేవి. అయితే భారత్‌లోని చిన్న వ్యాపారాలు వీటితో పోటీ పడలేక మూతపడటం లేదా అతికష్టం మీద వ్యాపారం సాగించేవి. అందుకే, రిటైల్ వర్తకుల సంఘం ప్రభత్వం తో చర్చించి... కోర్టులను ఆశ్రయించి... మొత్తమ్మీద వీటిపై ఒకింత విజయాన్ని సాధించాయి. అందులో భాగమే, ఒక మార్కెటీ ప్లస్ తన సొంత అనుబంధ కంపెనీల ద్వారా 25 శాతానికి మించి ఎట్టి పరిస్థితోలోనూ విక్రయించకూడదని ప్రభుత్వ నిబంధన. ప్రైవేట్ లేబుల్ ప్రొడక్ట్స్ విక్రయంపై కూడా చిన్న వ్యాపారులు కన్నెర్ర చేసారు.

English summary

బై బై చైనా .... జై జై ఇండియా : ఫ్లిప్కార్ట్ సరికొత్త వ్యూహం | Made in India tag for Flipkart brands

Walmart-owned Flipkart has moved a substantial proportion of its manufacturing and sourcing for inhouse brands from China and Malaysia to India over the past year, helping to cut costs and comply with the government's Make in India initiative.
Story first published: Tuesday, June 11, 2019, 7:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X