For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జగన్ అనూహ్య నిర్ణయం: ఆర్టీసీ విలీనం వల్ల ఎవరికి లాభం, ఎలా?

|

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను (ఏపీఎస్ఆర్టీసీ) ప్రభుత్వంలో విలీనం చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. దీనిని పర్యవేక్షించేందుకు రవాణా, ఆర్థిక శాఖ మంత్రుల నేతృత్వంలో కేబినెట్ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. విలీన ప్రక్రియ అధ్యయనం కోసం నిపుణుల కమిటీని వేయాలని కేబినెట్ తీర్మానించింది. కేబినెట్ ఉపసంఘం, నిపుణుల కమిటీల సూచనల ఆధారంగా అత్యుత్తమ విలీన ప్రక్రియతో ముందుకు వెళ్లనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి తెలుసా?: త్వరలో ప్రజల ముందుకు జగన్, ఏం కోరుకుంటున్నారు

ఉద్యోగులకు ఊరట

ఉద్యోగులకు ఊరట

ఇదిలా ఉండగా, ఆర్టీసీలో బ్యాటరీ బస్సులను ప్రవేశపెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు కావాల్సిన నిధుల సమీకరణపై కసరత్తు చేయాలని అధికారులకు సూచించింది. ఏపీఎస్ఆర్టీసీ రూ.6,373 కోట్ల నష్టాల్లో ఉంది. సంస్థను నడిపేందుకు ఉద్యోగుల భవిష్యనిధి నుంచి రూ.2,900 కోట్లను నాటి ప్రభుత్వం ఖర్చు చేసిందని కేబినెట్ అభిప్రాయపడింది. కాగా, ఆర్టీసీలో దాదాపు 54వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరికి నెలకు రూ.100 కోట్ల వేతనాలు ఇవ్వాలి. విలీనమైతే ప్రభుత్వమే ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తుంది. ఆర్టీసీ... ప్రభుత్వంలో విలీనమైతే ఉద్యోగ భద్రత ఉంటుంది. ప్రతి ఏటా ఫిట్మెంట్ కోసం ఆందోళన చేయాల్సిన పరిస్థితి రాదు. మున్సిపాలిటీ ఉద్యోగుల మాదిరి ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు చెల్లించే ఆలోచన చేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని కూడా ముందే చెప్పారు.

వ్యాపార ధోరణికి ఫుల్‌స్టాప్!

వ్యాపార ధోరణికి ఫుల్‌స్టాప్!

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే... విద్య, వైద్యం, సేవలు తదితర సంక్షేమ శాఖల తరహాలోనే దీని నిర్వహణకు ఉపయోగపడుతుంది. లాభనష్టాల ప్రాతిపదికన చూడటం వల్ల ఆర్టీసీ వ్యాపార ధోరణితో వ్యవహరించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయినా గట్టెక్కడం లేదు. జీతాల పెంపు వంటి వాటి వల్ల యాజమాన్యం, కార్మికుల మధ్య అంతరాయం పెరుగుతోంది. వ్యయం తగ్గించుకునేందుకు పోస్టులను భర్తీ చేయకుండా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో నెట్టుకు రావడం, కార్మికులను తగ్గించడం, కొత్త బస్సులను ప్రవేశ పెట్టకపోవడం, కొన్ని ప్రాంతాలకు బస్సులను తిప్పడం వల్ల నష్టం వస్తుందని వాటిని ఆపివేయడం, కాలం తీరిన బస్సులతో నెట్టుకు రావడం వంటి ఇబ్బందులు ఉన్నాయి. విలీనమైతే ఈ ఇబ్బందులన్నీ తొలగిపోతాయని భావిస్తున్నారు.

అన్నీ ప్రభుత్వమే...

అన్నీ ప్రభుత్వమే...

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే... అద్దె బస్సులతో నెట్టుకు రావాల్సిన పరిస్థితి తప్పుతుంది. కొత్త బస్సుల కోసం బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయి. లాభనష్టాల ప్రాతిపదికన చూసే అవకాశం ఉండదు. కాబట్టి ప్రయాణీకుల అవసరాల మేరకు దాదాపు అన్ని ప్రాంతాలకు ట్రిప్పులు తిప్పే పరిస్థితులు ఉంటాయి. డీజిల్ ధరలతో సంబంధం లేకుండా ప్రజలకు చవక ప్రయాణం ఉండే అవకాశం ఉంది. ఆర్టీసీకి నష్టాలు వచ్చినా, లాభాలు వచ్చినా ప్రభుత్వమే భరిస్తుంది.. తీసుకుంటుంది. అప్పుల బాధ్యత ప్రభుత్వానిదే. ఆర్టీసీ ఆస్తులన్నీ ప్రభుత్వం నియంత్రణలోకి వస్తాయి. బస్సులు సామాన్యులకు అందుబాటులో ఉంటాయి. అయితే, ఇది నిర్వహణపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల గురించి మనం నిత్యం వింటూనే ఉన్నాం.

కీలక నిర్ణయాలు

కీలక నిర్ణయాలు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటిదాకా జరిగిన విద్యుత్ ఒప్పందాలను మళ్లీ సమీక్షించాలని నిర్ణయించింది. అవినీతిరహిత విధాన రూపకల్పన కోసం ఒక నివేదిక సిద్ధం చేసి సమర్పించాలని ఇంధన శాఖ మంత్రి, అధికారులను ఆదేశించింది. అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే సొమ్ము చెల్లించేందుకు వీలుగా రూ.1150 కోట్లను ప్రభుత్వమే కోర్టులో జమ చేయాలని నిర్ణయించింది. రూ.20వేల లోపు డిపాజిట్ చేసిన బాధితులకు చెల్లించనున్నారు. కోర్టులో ప్రభుత్వం డిపాజిట్ చేసిన మొత్తానికి సరిపడా ఆస్తుల్ని అగ్రిగోల్డ్ ఆస్తుల్ని ప్రభుత్వానికి అప్పగించే విధంగా హైకోర్టును కోరాలని నిర్ణయించింది. హాయ్‌ల్యాండ్, భీమిలి వద్ద గల ఆస్తులను వేలం వేస్తే ఆదాయం వస్తుందని అభిప్రాయపడింది. ఈ మొత్తాలను కోర్టుల్లో జమ చేస్తూ బాధితులకు చెల్లించాలని నిర్ణయించింది. బియ్యాన్ని 5, 10, 15 కిలోల సంచుల కింద ప్యాక్ చేసి దాంతో పాటు మరో ఐదు నిత్యావసర వస్తువులను కలిపి గ్రామ వాలంటీర్ల ద్వారా కార్డుదారుల ఇంటికి సరఫరా చేయాలని, దీనిని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకున్నా ఆరోగ్యశ్రీ వర్తింప చేయాలని నిర్ణయించారు. మరిన్ని సేవలు ఈ పరిధిలోకి తీసుకు వస్తారు.

English summary

APSRTC merger with government on cards after Jagan takes charge as CM

In a step towards fulfilling one of his key poll promises, Chief Minister YS Jagan directed the officials concerned to constitute a committee to look into the possibilities of merging the cash strapped APSRTC with the State government.
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more