For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూడు రోజుల లాభాలకు గండి..! నష్టాలకు ప్రైవేట్ బ్యాంక్స్ కారణం

By Chanakya
|

మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. మార్కెట్ మళ్లీ నష్టాల్లోకి జారుకోవడంతో నిఫ్టీ 11900 పాయింట్ల దిగువన ముగిసింది. వరుస లాభాలతో పాటు రేపు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్‌పైరీ నేపధ్యంలో సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను పడేసింది. ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లలో సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువైంది. చివరకు సెన్సెక్స్ 248 పాయింట్ల నష్టంతో 39502 దగ్గర క్లోజైంది. నిఫ్టీ 68 పాయింట్లు నష్టపోయి 11861 దగ్గర స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ 302 పాయింట్లు కోల్పోయి 31295 వద్ద క్లోజైంది.

సన్ ఫార్మా, భారతి ఇన్ప్రాటెల్, టిసిఎస్, గెయిల్, హెచ్ సి ఎల్ టెక్ టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. జెఎస్‌డబ్ల్యు స్టీల్, ఎస్బీఐ, టాటా స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్, జీ ఎంటర్‌టైన్మెంట్ స్టాక్స్ లూజర్స్ జాబితాలో చేరాయి.

సెక్టోరల్ ఇండెక్సుల పరంగా చూస్తే.. ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల్లోనూ అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా నమోదైంది. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ఏకంగా 3 శాతం వరకూ కోల్పోయింది. మెటల్, మీడియా, రియాల్టీ, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ అధికంగా నష్టపోయాయి.

Markets Update: Sensex, Nifty snap three day record closing run ahead of F and O expiry

ప్రభుత్వ బ్యాంకులు పడేశాయ్

గత కొన్ని వారాల నుంచి లాభాల్లో కొనసాగుతూ వస్తున్న పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి అధికమైంది. వీటిల్లో లాభాల స్వీకరణ స్పష్టంగా నమోదైంది. ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్‌లో ఐసిఐసిఐ బ్యాంక్ కూడా నీరసించింది. ఈ రోజు ట్రేడ్‌లో పీఎన్‌బి 5 శాతం, ఎస్బీఐ 3.5 శాతం, సెంట్రల్ బ్యాంక్, కెనెరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్స్ 3 శాతం వరకూ నష్టపోయాయి.

అడాగ్ స్టాక్స్‌లో అమ్మకం

అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ స్టాక్స్‌లో మళ్లీ అమ్మకాలు చుట్టుముట్టాయి. ప్రధాంగా రిలయన్స్ క్యాపిటల్ 5 శాతం, రిలయన్స్ ఇన్ఫ్రా 4.5 శాతం, రిలయన్స్ హోం ఫైనాన్స్ 4 శాతం కోల్పోయాయి.

మన్‌పసంద్ మూడో రోజూ...

జీఎస్టీ ఎగవేత ఆరోపణలతో పాటు ప్రమోటర్లు ఇన్వెస్టర్ల నమ్మకాన్ని కోల్పోవడంతో మన్‌పసంద్ స్టాక్ మూడో రోజూ డౌన్ సర్క్యూట్‌లో ఫ్రీజ్ అయింది. రెండు రోజుల పాటు 20 శాతం చొప్పున నష్టపోయిన స్టాక్ ఈ రోజు 10 శాతం పతనమైంది. రూ.63.40 దగ్గర క్లోజైంది. మరింతగా స్టాక్ నీరసించవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సన్ ఫార్మా తేరుకుంది

వరుస నష్టాలతో నీరసించి పోతున్న సన్ ఫార్మా స్టాక్ ఎట్టకేలకు కాస్త తేరుకుంది. త్రైమాసిక ఫలితాలు నీరసంగా ఉన్నా స్టాక్ తేరుకుంది. ఊహించిన దానికంటే రిజల్ట్స్ కాస్త బెటర్‌గానే ఉండడంతో స్టాక్ లాభాల్లో ముగిసింది. ఆదాయంలో 3 శాతం వృద్ధిని సాధించిన సంస్థ, నికర లాభంలో మాత్రం 52.6 శాతం క్షీణతను నమోదు చేసింది. చివరకు స్టాక్ రూ.423 దగ్గర క్లోజైంది.

స్పైస్ జెట్‌కు వీక్ రిజల్ట్ ఎఫెక్ట్

మార్కెట్ అంచనాల కంటే స్పైస్ జెట్ రిజల్ట్స్ కాస్త నీరసంగా రావడంతో స్టాక్ నెల రోజుల్లో భారీగా పడింది. నికర లాభం 22 శాతం, ఆదాయం 25.3 శాతం వృద్ధి చెందినప్పటికీ మార్కెట్ మరింతగా ఆశించిది. దీంతో స్టాక్ 7.1 శాతం క్షీణించింది. చివరకు 6 శాతం కోల్పోయి రూ. 140దగ్గర ముగిసింది.

గెలాక్సీకి హై వాల్యూమ్ బూస్ట్

గెలాక్సీ వాల్యూమ్స్ అనూహ్యంగా పెరిగాయి. 20 రోజుల యావరేజ్‌తో పోలిస్తే ఏకంగా 40 రెట్లు పెరిగింది. దీంతో ధర కూడా ఏకంగా 13 శాతం పెరిగింది. చివరకు రూ.1194 దగ్గర క్లోజైంది.

English summary

మూడు రోజుల లాభాలకు గండి..! నష్టాలకు ప్రైవేట్ బ్యాంక్స్ కారణం | Markets Update: Sensex, Nifty snap three day record closing run ahead of F and O expiry

Benchmark indices ended Wednesday's trading session with losses ahead of the May series futures, thereby breaking the three-day streak when they closed at record high levels, ahead of expiry of May series F&O contracts.
Story first published: Wednesday, May 29, 2019, 17:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X