For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోడీ 2.0 ! ఇక స్టాక్ మార్కెట్‌కు తిరుగుండదా ?

|

మోడీ మ్యాజిక్ మరోసారి పనిచేసింది. ఈ సారి రెట్టించిన ఉత్సాహంతో నరేంద్ర మోడీ భారత దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. బిజెపి స్వతంత్రంగానే 300 మార్కుకు చేరువయ్యే పరిస్థితి ఉంది. దీంతో స్టాక్ మార్కెట్లు కూడా ఎగిరి గంతేస్తున్నాయి. స్వతంత్రంగానే బిజెపి అధికార పీఠాన్ని చేజిక్కించుకునే సత్తా దక్కించుకుంది. వాస్తవానికి స్టాక్ మార్కెట్లకు స్థిరమైన ప్రభుత్వమే శ్రీరామరక్ష. అందుకే.. ముందుగా ఎఫ్ఐఐలు చూసేది స్థిరమైన ప్రభుత్వం ఉందా లేదా అనే అంశమే. ఈ నేపధ్యంలో మార్కెట్లకు పెరగడానికి ఉన్న అవకాశాలు.. అవరోధాలేంటో చూద్దాం.

పాజిటివ్స్

1. స్థిరమైన ప్రభుత్వం

2. మోడీ మ్యాజిక్

3. సంస్కరణల కొనసాగింపు

నెగిటివ్స్

1. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగంలో అనిశ్చితి

2. వాహన అమ్మకాల్లో నీరసం

3. గ్రామీణ స్థాయిలో మందగమనం

4. అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం

మోడీ ఎఫెక్ట్: 40,000 మార్క్ చేరువలో సెన్సెక్స్, నిఫ్టీ 11,900 పాయింట్లు

పాజిటివ్ అంశాలు

పాజిటివ్ అంశాలు

ముందుగా పాజిటివ్స్ చూస్తే.. గతంతో పోలిస్తే రెట్టించిన ఉత్సాహంతో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. బిజెపి కూడా వివిధ రాష్ట్రాల్లో తన పట్టును కొనసాగించింది. పశ్చిమ బెంగాల్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో బిజెపి ఎంట్రీ వంటివి కూడా కలిసిరాబోతోంది. ఇవన్నీ మార్కెట్‌కు కలిసొచ్చే అంశం. దీంతో స్టాక్ మార్కెట్ సూచీలు కూడా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయి. ఏ దేశంలో అయినా స్థిరమైన ప్రభుత్వానికే మార్కెట్లు మద్దతిస్తాయి. ఎందుకంటే అప్పుడు మాత్రమే కఠినమైన నిర్ణయాలు ఏవైనా తీసుకునేందుకు అవకాశం లభిస్తుంది. సంస్కరణలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ఆస్కారం లభిస్తుంది. వీటన్నింటికి తోడు మోడీ మ్యాజిక్ ఎలానో కొనసాగుతోంది. పెద్ద నోట్ల రద్దు వంటివి ప్రభుత్వానికి నెగిటివ్ రిమార్క్స్‌ను తెచ్చినప్పటికీ జీఎస్టీ అమలు, ఆర్థిక సంస్కరణలు, బ్యాంకింగ్ రంగంలో పెనుమార్పులు వంటివి కలిసొచ్చాయి. ఇదే జోరులో మరిన్ని సంస్కరణలను కొనసాగిస్తారని స్టాక్ మార్కెట్ జనాలు భావిస్తున్నారు. అందుకే ఇక్కడి నుంచి మార్కెట్ మరింత పైపైకి వెళ్లే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక వేళ మనకు క్రూడ్ ఆయిల్ క్షీణత కూడా కలిసొస్తే.. రూపాయి బలం పుంజుకుంటుంది, ఆర్థిక స్థితి మరింత మెరుగుపడ్తుంది. వీటన్నింటికి తోడు వర్షాలు కూడా సహకరిస్తే.. ఇన్‌ఫ్లేషన్ కూడా తగ్గుతుంది. అప్పుడు వడ్డీ రేట్లు మరింత తగ్గేందుకు అవకాశం ఉంది. మొత్తానికి అన్నీ మంచి శకునములే అనేట్టు ఉంది ఫస్ట్ రియాక్షన్.

నెగిటివ్ అంశాలు

నెగిటివ్ అంశాలు

అయితే ఇదే సమయంలో కొన్ని నెగిటివ్ అంశాలను కూడా మనం చూడాలి. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ కాస్త పటిష్టంగానే ఉన్నా.. బ్యాంకింగ్ రంగ విషయంలో మాత్రం ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఐఎల్ఎఫ్ఎస్ పతనం తర్వాత అనేక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు ఆర్థికంగా ఇబ్బందుల్లోకి వెళ్లాయి. వాటన్నింటినీ బయటకు లాగాల్సిన అవసరం ఉంది. జెట్ ఎయిర్ వేస్ వంటి పెద్ద పెద్ద సంస్థలు అప్పుల్లో కూరుకున్నాయి. వాటికి ప్రత్యామ్నాయం చూడాలి. లేకపోతే రూ.10-15 వేల కోట్లు బ్యాంకులు నష్టపోవాల్సి ఉంది. మొండిబకాయిల వసూలుకు స్పష్టమైన స్టాండ్ తీసుకోవాల్సి ఉంది. చిన్న బ్యాంకులన్నింటినీ విలీనం చేసి పెద్ద బ్యాంకులు ఏర్పాటు చేయాలనే యోచనలో కూడా కేంద్రం ఉంది. వీటిని కూడా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.

గ్రామీణ భారతం

గ్రామీణ భారతం

మరోవైపు దేశంలో గ్రామీణ భారతం కూడా వృద్ధిలో వెనుకబడ్తోంది. ఎఫ్ఎంసిజీ కంపెనీల అమ్మకాలు నీరసిస్తున్నాయి. ట్రాక్టర్ సేల్స్ కూడా తగ్గుతోంది. వాహన అమ్మకాలు కొద్దికాలం నుంచి బాగా తగ్గుతున్నాయి. ఇవన్నీ నెగిటివ్ సంకేతాలు. అందుకే ప్రభుత్వానికి ఎదురుగాలి కూడా వీస్తోంది.

ఇక ఆర్బీఐ వంటి చట్టబద్ధ సంస్థలపై ఆధిపత్యం, కేంద్రం ఇస్తున్న గణాంకాలపై సడలిన నమ్మకం కూడా చర్చకు దారితీశాయి.

కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నా.. స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి మోడీ గతంతో పోలిస్తే మరిన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మొదటి ప్రభుత్వంలో చేసిన తప్పులను సరిదిద్దుకుని ముందుకుసాగితే మార్కెట్లకు తిరుగుండదు.

English summary

Stock Markets surge to a record high on exit poll results

Indian stocks surged by the most in nearly six years to a record after exit polls showed that the Bharatiya Janata Party (BJP)-led coalition is likely to return to power, the only time a non-Congress alliance has managed it since Atal Bihari Vajpayee returned the coalition to victory in 1999.
Story first published: Thursday, May 23, 2019, 13:01 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more