For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిలయన్స్ జియో మరో రికార్డ్.. VoWiFi: ఫోన్ సిగ్నల్స్ లేకున్నా త్వరలో కాల్ చేయొచ్చు!

|

ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో వచ్చిన మూడేళ్లలో ఎన్ని రికార్డులు సృష్టించింది. అతి తక్కువ ఖర్చుతో డేటా, వాయిస్ కాల్స్‌తో దూసుకెళ్తోంది. జియో యూజర్లు రోజు రోజుకు పెరుగుతున్నారు. కేవలం మార్చి నెలలోనే జియో ఉపయోగించేవారు 9.48 మిలియన్లు పెరిగారు. అదే సమయంలో జియో ఆరంగేట్రం నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్ 15.13 మిలియన్లు, వొడాఫోన్ ఐడియా 14.53 మిలియన్ల యూజర్లను కోల్పోయింది. బీఎస్ఎన్ఎల్‌కు 560,593, టాటా టెలీ సర్వీసెస్‌కు 1.15 మిలియన్ల యూజర్లు తగ్గారు. మార్చిలో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బాండ్ మాత్రం 2.47 మిలియన్లు పెరిగారు. ఎయిర్‌టెల్ వైర్‌లెస్ బ్రాడ్‌బాండ్ సబ్‌స్క్రైబర్స్ మార్చి నాటికి 112.26 మిలియన్లకు పెరిగారు. వొడాఫోన్ ఐడియాకు 110.23 మిలియన్లు ఉన్నారు.

మరోసారి నరేంద్ర మోడీయే గెలిస్తే ఆర్థిక మంత్రి ఎవరు?మరోసారి నరేంద్ర మోడీయే గెలిస్తే ఆర్థిక మంత్రి ఎవరు?

VoWiFi సేవలు పరీక్షిస్తున్న రిలయన్స్ జియో

VoWiFi సేవలు పరీక్షిస్తున్న రిలయన్స్ జియో

మొబైల్ రంగం రూపురేఖలు మార్చివేసిన జియో మరో కొత్త ప్రణాళికతో ముందుకు వస్తోంది. ఇప్పటికే వీవోఎల్‌టీఈ సేవలు ప్రారంభించిన తొలి కంపెనీగా రికార్డ్ సృష్టించిన రిలయన్స్ జియో, త్వరలో వాయిస్ ఓవర్ వైఫై (VoWiFi) సర్వీసును ప్రారంభించనుంది. 2020లో దీనిని లాంచ్ చేయనున్నారని తెలుస్తోంది. VoWiFi పాకెట్ వాయిస్ సర్వీస్. మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ వంటి సర్కిల్స్‌లో ఈ సేవలను పరీక్షిస్తోంది.

ఫైనల్ స్టేజీలో పరీక్షలు

ఫైనల్ స్టేజీలో పరీక్షలు

VoWiFi పరీక్షిస్తున్న నేపథ్యంలో కొందరు ఐఫోన్ యూజర్లలో ఇందుకు సంబంధించిన (VoWiFi) సింబల్ కనిపిస్తోందట. ఈ పరీక్షలు ఫైనల్ స్టేజీలో ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. అయితే జియో దీనిని ఎప్పుడు లాంచ్ చేస్తుందో స్పష్టంగా తెలియదు. అయితే ఇది 2020 ప్రారంభంలో లాంచ్ కావొచ్చునని చెబుతున్నారు.

జియో బాటలోనే ఎయిర్‌టెల్, ఐడియా

జియో బాటలోనే ఎయిర్‌టెల్, ఐడియా

ప్రారంభంలో VoWiFi సేవలు కేవలం జియో టు జియోకు మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. ఆ తర్వాత దీనిని క్రమంగా ఇతర టెలికం సర్వీస్‌లకు కూడా వర్తింప చేస్తారు. జియో లాగే భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ వంటి టెలికం సర్వీస్‌లు కూడా VoWiFi టెక్నాలజీని తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఐపీ అడ్రస్ వినియోగంతో వైఫై నెట్ వర్క్ ద్వారా సిగ్నల్ లేని ప్రాంతాల్లో కూడా ఫోన్ పని చేసేలా రూపొందించారు. ఇదే

VoWiFi. సిగ్నల్ వచ్చాక ఆటోమేటిక్‌గా అందుకు అనుగుణంగా మారుతుంది.

English summary

రిలయన్స్ జియో మరో రికార్డ్.. VoWiFi: ఫోన్ సిగ్నల్స్ లేకున్నా త్వరలో కాల్ చేయొచ్చు! | Reliance Jio In Advanced Stages Of Testing VoWiFi Service In Various Circles: Expected To Launch By 2020

Mukesh Ambani's Reliance Jio is set to become the first telco to launch the Voice over WiFi (VoWiFi) service.
Story first published: Wednesday, May 22, 2019, 12:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X