For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.5వేల కోట్లు తెస్తాం.. కంపెనీ తెరిపించండి - జెట్ ఉద్యోగుల సంఘం

By Chanakya
|

ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి తాత్కాలికంగా మూతబడిన జెట్ ఎయిర్‌వేస్‌ను ఎలా అయినా తిరిగి ప్రారంభించుకోవాలని ఉద్యోగుల సంఘం నానా తంటాలు పడ్తోంది. కొంత మంది ఉద్యోగులు ఒక బృందంగా ఏర్పడి.. జెట్ ఎయిర్ కోసం బ్యాంకులతో పోరాడ్తూ వస్తున్నారు. లీడ్ బ్యాంకర్ అయిన ఎస్బీఐ క్యాప్స్‌కు వీళ్లంతా తాజాగా ఓ లేఖ రాశారు. 700 మిలియన్ డాలర్ల (సుమారు రూ.4900 కోట్లు) సమీకరణ కోసం ఇన్వెస్టర్లతో చర్చలు ప్రారంభించామని, ఇవి సఫలమవుతాయని ఆశిస్తున్నట్టు జెట్ ఉద్యోగులు వెల్లడించారు. జెట్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ సొసైటీ పేరుతో ఎస్బీఐ క్యాప్స్‌కు లేఖ అందింది. ఇప్పటికే బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించిన ఎస్బీఐకి ఆశించిన స్థాయిలో స్పందన కరువైంది. దీంతో చేసేది లేక ఇన్వెస్టర్ల కోసం బ్యాంక్ కూడా ఎదురుచూస్తోంది. ఇప్పటికిప్పుడు కనీసం రూ.7-8 వేల కోట్ల రూపాయల మేర నిధులు అవసరమున్న నేపధ్యంలో ఆర్థిక సంస్థలు కూడా వెనుకా ముందు ఆడ్తున్నాయి.

ఉబర్ ఈట్స్, ఫుడ్ పాండా ఎందుకు ఆఫర్స్ ఆపేశాయ్?

ఉద్యోగులే నడుపుకుంటాం

ఆర్థిక సంస్థలు, బ్యాంకులు ఎవరూ సహాయం చేయకపోతే తమకుసంస్థను నడిపే బాధ్యతను ఇవ్వాలంటూ కొంత మంది ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే బిడ్ల కోసంఇంకా ఎదురుచూస్తూనే ఎస్బీఐ, ఉద్యోగుల ప్రపోజల్‌ను ప్రస్తుతానికి పక్కకుబెట్టింది. కొద్ది రోజుల క్రితం ఎతిహాద్ ఎయిర్‌వేస్ ఆసక్తిని చూపినా.. మైనార్టీ వాటాను మాత్రమే ఉంచుకోవాలని సంస్థ భావిస్తోంది. రూ.8 వేల కోట్ల అప్పు ఉండగా రూ.1700 కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టేందుకు ఎతిహాద్ సిద్ధంగా ఉంది. అందుకే ఆ ప్రతిపాదన కూడా ప్రస్తుతానికి అటకెక్కింది. ఈ నేపధ్యంలో సమయం ఇలానే గడిచిపోతే వేలాది మంది ఉద్యోగుల మనుగడకే ప్రమాదమని ఉద్యోగుల సంఘం భావిస్తోంది. దీనిపై ప్రభుత్వానికి, ఎస్బీఐ స్పందించాలని వేడుకుంటోంది.

 రూ.5వేల కోట్లు తెస్తాం.. కంపెనీ తెరిపించండి

బ్యాంక్ ఎంత నష్టాన్ని భరిస్తుంది ?

ఉద్యోగుల సంఘం బ్యాంకుకు రాసిన లేఖలో అనే ప్రశ్నలకు సమాధానాలను కోరింది. 700 మిలియన్ డాలర్ల పెట్టుబడిపై తాము ఇన్వెస్టర్లతో మాట్లాడుతున్నామని,వాళ్లు సానుకూలంగానే ఉన్నారని అయితే తమకు కొన్ని సమాధానాలు కావాలని కోరుతుంది. మొత్తంగా జెట్ ఎయిర్‌వేస్ తీసుకున్న అప్పు ఎంత ఉంది, రాబోయే రెండేళ్ల పాటు సంస్థను నడపడానికి అవసరమైన మూలధనం ఎంత, ప్రస్తుతం జెట్ ఎయిర్ వేల్యుయేషన్ ఎంత ఉంది, ఒక వేళ 700 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడితే తమకు వాటా ఎంత శాతం ఇస్తారు అని ఎస్బీఐని ఉద్యోగుల సంఘం కోరింది. దీనిపై బ్యాంక్ ఇంకా స్పందించాల్సి ఉంది. మొత్తానికి ఉద్యోగులంతా ఏకమై సంస్థను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు కానీ.. ఇవన్నీ సాధ్యమయ్యే పనులేనా అనేది ఇండస్ట్రీ మనసులో మాట.

English summary

Jet employees in talks to raise $700m: seek additional information from SBI Caps

Jet Airways' employees in talks to raise $700m; seek additional information from SBI Caps. The mail ask SBI Caps for information on the bidding process and Jet Airways' assets and valuation, its debt level, a break-up of its expenses and the amount of equity that will come in if the employees bring in $700 million.
Story first published: Tuesday, May 21, 2019, 10:37 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more