For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రంప్ కొత్త ఇమ్మిగ్రేషన్ పాలసీ ఇండియన్స్‌కి లాభమా? వారికి మాత్రం దెబ్బ

|

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తీసుకువచ్చిన కొత్త ఇమ్మిగ్రేషన్ పాలసీ మన ఐటీ ప్రొఫెనల్స్‌కు ప్రయోజనకరమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వలసలకు సంబంధించి ట్రంప్ ఇటీవల కొత్త విధానం తీసుకు వచ్చారు. ప్రతిభ, పాయింట్ల ఆధారిత ఇమ్మిగ్రేషన్ విధానం తెచ్చారు. ప్రస్తుత గ్రీన్ కార్డుల స్థానంలో బిల్డ్ అమెరికా వీసాలను ప్రతిపాదించారు. నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు ఇచ్చే వాటాను ఏకంగా 12 శాతం నుంచి 57 శాతానికి పెంచారు. దీంతో భారత ఐటీ నిపుణులకు, ఇతర రంగాల నిపుణులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు.

అమెరికాకు వచ్చే వారు ఇంగ్లీష్ భాష తప్పనిసరిగా నేర్చుకోవాలని, అమెరికా చరిత్ర, సంస్కృతి తెలుసుకోవాలని, సివిక్స్ పరీక్షలో పాస్ కావాలని రూల్ పెట్టారు. కొత్త ఇమ్మిగ్రేషన్ రూల్స్ ఆమెరికన్ వేజెస్‌ను కాపాడుతాయని, అమెరికా వ్యాల్యూస్‌ను ప్రమోట్ చేస్తాయని, అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ అండ్ బ్రైటెస్ట్ టాలెంట్ పీపుల్‌ను తీసుకు వచ్చేందుకు ఉపయోగపడుతుందని తెలిపింది. ఓ రీసెర్చ్ ప్రకారం 2017లో ఫ్యామిలీ ఆధారంగా 1,37,855 (12 శాతం), శరణార్థుల కింద 1,20,356 (11 శాతం), ఇతరాల కింద 68,618 (6 శాతం), డైవర్సిటీ కింద 51,592 (5 శాతం) పర్మనెంట్ రెసిడెన్సీ ఇచ్చారు.

మీ బ్యాంక్ లోన్ అప్లికేషన్ తిరస్కరించారా? డోంట్ వర్రీ!

కొత్త విధానం వల్ల ఏమవుతుంది?

కొత్త విధానం వల్ల ఏమవుతుంది?

ప్రస్తుత గ్రీన్ కార్డ్ స్థానంలో బిల్డ్ అమెరికా వీసాను తీసుకు వస్తున్నారు. కెనడా వంటి దేశాల వలె సులభతర పాయింట్ల ఆధారిత ఎంపిక విధానాన్ని తీసుకు వస్తోంది. ఈ విధానంలో యువ ఉద్యోగికి ఎక్కువ పాయింట్లు వస్తాయి. విలువైన నైపుణ్యాన్ని, ఉద్యోగ అవకాశాన్ని కలిగి ఉండటం, ఉన్నత చదువు లేదా ఉద్యోగాల సృష్టికి ప్రణాళిక ఉంటే ఎక్కువ పాయింట్లు వస్తాయి. ఇదివరకు సరైన ఇలాంటి ఇమ్మిగ్రేషన్ విధానం లేక కంపెనీలు ప్రారంభించాలనుకున్న వారు స్వదేశాలకు వెళ్లారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అధిక వేతన ఉద్యోగులకే ప్రాధాన్యం ఇవ్వాలనేది కొత్త విధానం ఉద్దేశ్యం. దీని వల్ల అమెరికా కార్మికుల అవకాశాలకు పెద్దగా నష్టం జరగదు.

ఇదీ కొత్త విధానం!

ఇదీ కొత్త విధానం!

యువత, అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు బిల్డ్ అమెరికా వీసాలు లభిస్తాయి. సమగ్రత, జాతీయ ఐక్యతను పెంపొందించేందుకు భవిష్యత్తులో వలసదారులు ఇంగ్లీష్, సివిక్స్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. ఇప్పటి వరకు ఉన్న విధానం వల్ల ఒక డాక్టర్‌కు, పరిశోధకుడికి, ప్రపంచంలోనే అత్యంత అధ్భుత కళాశాల నుంచి నెంబర్ వన్ స్థానంతో చదువు పూర్తి చేసుకున్న విద్యార్థికి ప్రాధాన్యం ఇవ్వలేకపోతున్నామని ట్రంప్ అభిప్రాయపడ్డారు. కొత్త విధానం కింద అభ్యర్థుల వయసు, నైపుణ్యం, ప్రతిభ, ఉద్యోగ అవకాశాలు, అమెరికా రాజ్యాంగం, ప్రభుత్వం పనితీరు, చరిత్రపై అవగాహన, ఇంగ్లిష్‌లో తప్పనిసరి ఉత్తీర్ణత ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. ప్రపంచంలో ఎక్కడ జన్మించారు, మీ బంధువులు ఎవరు వంటి వాటితో సంబంధం లేకుండా అమెరికా పౌరసత్వం కోరే వారందరికీ ఒక స్పష్టమైన ప్రామాణిక విధానం ఉంటుంది. కుటుంబ సంబంధాలు పోయి.. వయసు, ప్రతిభ, నైపుణ్యం వల్ల వివిధ రంగాల్లో టాలెంట్ ఉన్న యువతకు అమెరికా కల సాకారం కానుంది. వయసు తక్కువ ఉన్న వారికి పాయింట్లు ఎక్కువ ఉండటం యువతకు లాభదాయకం.

ఇప్పటి వరకు ఇదీ లెక్క.. ఇకముందు

ఇప్పటి వరకు ఇదీ లెక్క.. ఇకముందు

అమెరికా ప్రతి ఏడాది 11 లక్షల గ్రీన్ కార్డులను మంజూరు చేస్తోంది. దీనివల్ల విదేశీయులు జీవితకాలం పాటు అమెరికాలో ఉండవచ్చు. అయిదేళ్లలో పౌరసత్వం పొందేందుకు వీలు ఉంది. ఇప్పటి వరకు చాలా వరకు గ్రీన్ కార్డులను కుటుంబ సంబంధాలు, భిన్నత వీసా ఆధారంగా ఇచ్చారు. ఈ కారణంగా వృత్తి నిపుణులు, మంచి నైపుణ్యం కలిగిన వారికి తక్కువ స్థాయిలో వీసాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న విధానం సమీప బంధువులు, భార్య లేదా భర్త, సంతానానికి ప్రాధాన్యమిస్తోందని, మేధస్సుపై వివక్ష జరిగిందని, ఇక నుంచి అలాంటిది ఉండదని ట్రంప్ చెప్పారు. ప్రస్తుత విధానం వల్ల ప్రతిభ కలిగిన విద్యార్థులు, ఉద్యోగులు అమెరికాలోనే ఉండి వారు వృద్ధిలోకి రావడంతో పాటు, అమెరికా కోసం పని చేసినట్లు అవుతుంది.

ఇండియాకు ఎలా లాభం?

ఇండియాకు ఎలా లాభం?

ట్రంప్ కొత్త విధానం వల్ల వేలమంది భారత వృత్తి నిపుణులు, నైపుణ్య ఉద్యోగులకు ప్రయోజనం కలిగే అవకాశముందని చెబుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి వారు గ్రీన్ కార్డు కోసం చాలా ఏళ్లు ఎదురు చూడవలసి వచ్చేంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదు. త్వరితగతిన గ్రీన్ కార్డులు జారీ అవుతాయని అభిప్రాయపడుతున్నారు. ఈ విధానం వల్ల లక్షలమంది భారతీయ ఐటీ నిపుణులకు గ్రీన్ కార్డు లభిస్తుందని చెబుతున్నారు. స్వదేశీయతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రతిభకు కూడా ఇస్తానని ట్రంప్ ప్రతిపాదనలతో తెలిసిపోతుందని అంటున్నారు. ఐటీలో మన వాళ్లకు మంచి పేరు ఉంది. కాబట్టి ఈ నూతన పాలసీతో భారతీయులకు, ప్రధానంగా ఐటీ ఉద్యోగులకు బాగా కలిసి వస్తుందని చెబుతున్నారు. టాలెంట్‌కు పెద్ద పీట వేయడం వల్ల మిగతా దేశాల కంటే భారత్‌కే లాభమని చెబుతున్నారు.

వారికి షాక్

వారికి షాక్

ఏళ్ల తరబడి గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్న కొందరు భారతీయులకు ఇది నిరాశను కలిగించవచ్చునని భావిస్తున్నారు. కుటుంబ నేపథ్యంతో అమెరికాకు వెళ్లాలనుకునే వారి కోటాను టాలెంట్ ఉన్నవారు చేజిక్కించుకుంటారు. అమెరికాలో వీసాలకు సంబంధించిన ఎలాంటి మార్పులు జరిగినా ఆ ప్రభావం భారతీయులపై అధికంగా ఉంటుందని చెబుతున్నారు. టాలెంట్ అంశాన్ని పక్కన పెడితే, అమెరికా కొత్త ఇమ్మిగ్రేషన్ పాలసీ ఆమోదం పొందితే దాదాపు ఆరు లక్షల భారతీయులకు ఎదురుదెబ్బ అని కూడా అంటున్నారు. కుటుంబ సంబంధాలపై ఆధారపడి గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారు 2,61,765 మంది ఉండగా, ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారు 3 లక్షలకు పైగా ఉన్నారు. వీరు ఏళ్ల తరబడి క్యూలో ఉన్నారు. కొత్త విధానం వస్తే మళ్లీ దరఖాస్తులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు, హెచ్1బీ వర్కర్లకు కూడా ఈ విధానం దెబ్బ అంటున్నారు. ఉన్నత విద్య, నైపుణ్యం గల వారికే ప్రాధాన్యత వల్ల మధ్య, దిగువస్థాయి ఉద్యోగులకు అమెరికా ప్రవేశం దాదాపు దూరమైనట్లే అంటున్నారు.

English summary

Indian techies likely to benefit from new US immigration plan

In a move that could benefit Indian IT professionals, US President Donald Trump has unveiled a new merit-based immigration plan under which high-skilled workers would be eligible for a "Build America" visa.
Story first published: Sunday, May 19, 2019, 13:18 [IST]
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more