For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంపరాఫర్: ప్రోటోటైప్ ఫోన్ పోగొట్టుకున్న హానర్, తెచ్చి ఇస్తే రూ.4 లక్షల గిఫ్ట్

|

సాధారణంగా ఎవరైనా తమ ఫోన్ పోగొట్టుకుంటే ఎంతో ఆందోళన చెందుతారు. అందుకు ఫోన్ ఎక్కడో పోవడం లేదా దాని ధర కంటే అందులోని కాంటాక్ట్స్ పోతాయనే బాధ ఎక్కువగా ఉంటుంది. వినియోగదారులు ఫోన్ కోల్పోవడం మామూలే. కానీ ఓ కంపెనీయే తమ ఫోన్ ఎక్కడైనా కోల్పోతే... దాని కోసం ఆ కంపెనీ ఆందోళన చెందితే...? సరిగ్గా ఇదే జరిగింది. ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ హానర్‌కు ఈ అనుభవం ఎదురైంది. ఎందుకంటే ఈ ఫోన్ ప్రారంభానికి ముందే మిస్ అయింది.

నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!

హువావే సబ్ బ్రాండ్ హానర్. ఇది తన ప్రోటోటైప్ (నమూనా) ఫోన్‌ను మిస్ చేసుకుంది. ఇది తీసుకు వచ్చిన వారికి 5 వేల యూరోలు అంటే దాదాపు నాలుగు లక్షల రూపాయలు బహమతిగా ఇస్తామని ప్రకటి చేసింది. ఇదివరకు ఐఫోన్ 4, గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్ఎల్ ఫోన్లు కూడా టెస్టింగ్ సమయంలోనే కోల్పోయాయి. ఈ మేరకు హానర్ ట్వీట్ చేసింది.

Honor Loses Smartphone Prototype, Offers Rs. 4 Lakh Reward for Its Safe Return

తమ సంస్థలో పని చేసే ఉద్యోగు ఒకరు డస్సెడ్రాప్ నుంచి జర్మనీలోను మ్యూనిచ్ రైల్లో వెళ్తూ దీనిని కోల్పోయినట్లు పేర్కొంది. ఐసీఈ1125 రైల్లో ఏప్రిల్ 22వ తేదీన ఈ ఫోన్ పోగొట్టుకున్నారని, ఈ ఫోన్ తెచ్చిన వారికి బహుమతి ఇస్తామని తెలిపింది. గ్రే కలర్‌లో ఉన్న ఈ ఫోన్‌కు కవర్ కూడా ఉంది.

కాగా, హానర్ 20 సిరీస్‌లో భాగంగా లండన్‌లో మే 21వ తేదీన ఈ ఫోన్‌ను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కనిపించకుండా పోయిన ఫోన్ ప్రోటోటైప్ ఇదే కావొచ్చునని భావిస్తున్నారు. అందుకే ఇంత మొత్తం బహుమతిని ఆఫర్ చేస్తున్నట్లుగా తెలుస్తోందని అంటున్నారు. మే 21వ తేదీ తర్వాత దానిని తెచ్చినా లాభం లేదట. ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ లీక్‌ కాకుండా ఉండేందుకే బహుమతి ఇవ్వన్నట్లు హానర్‌ ప్రకటించింది. హానర్ వచ్చే నెల 21న హానర్ 20 సిరీస్‌లో లాంచ్ చేస్తోంది. ఈ సిరీస్‌లో పలు ఫోన్లు విడుదల కానున్నాయి. ఇటీవల చైనాలో విడుదల చేసిన హానర్ 20, హానర్ 20 ప్రో, హానర్ 20ఏ, హానర్ 20సీ, హానర్ 20ఎక్స్‌, హానర్‌ 20ఐ ఫోన్లు కూడా ఉండే అవకాశముంది.

English summary

బంపరాఫర్: ప్రోటోటైప్ ఫోన్ పోగొట్టుకున్న హానర్, తెచ్చి ఇస్తే రూ.4 లక్షల గిఫ్ట్ | Honor Loses Smartphone Prototype, Offers Rs. 4 Lakh Reward for Its Safe Return

Anyone who's ever lost a smartphone knows how painful it feels. But what about tech giants? We all know how Apple felt when its iPhone 4 was lost in a pub a long time ago.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X