For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్థిక మరణదండనే: విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టులో దొరకని తాత్కాలిక ఊరట

|

ముంబై: పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించడం, తన ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి అనుమతివ్వడం ద్వారా ప్రత్యేక న్యాయస్థానం తనకు ఆర్థిక మరణ శిక్ష విధించిందని విజయ్ మాల్యా బాంబే హైకోర్టుకు తెలిపాడు. గత ఆగస్టులో తీసుకువచ్చిన పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల చట్టంలోని ప్రొవిజన్లను సవాల్ చేస్తూ ఆయన పిటిషన్‌ దాఖలు చేశాడు. విచారణ సందర్భంగా మాల్యా తరఫున ఆయన లాయర్ ఈ వ్యాఖ్యలు కోర్టుకు తెలిపాడు. తన రుణాలకు సంబంధించిన వడ్డీలు పేరుకుపోతున్నాయని, రుణాలు తీర్చడానికి సరిపడా ఆస్తులు ఉన్నా ప్రభుత్వం అంగీకరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మాల్యా తరఫున లాయర్ అమిత్ దేశాయి.. రంజిత్ మోరే, భారతి డాంగ్రె ద్విసభ్య బెంచ్ ఎదుట వాదనలు వినిపించారు.

తన ఆస్తుల మీద తనకు ఎలాంటి అధికారం లేకుండా పోయిందని, ఇది తనకు ఆర్థిక మరణశిక్ష లాంటిదేనని మాల్యా పేర్కొన్నాడు. ఎఫ్ఈఓ చట్టంలోని ప్రొవిజన్లు క్రూరమైనవని అన్నారు. వివాదంలో ఉన్న సొమ్ము వినియోగించి ఆస్ులు కొనుగోలు చేశారనే ఆధారాలు ఏవీ లేకుండానే వాటిని స్వాధీనం చేసుకోవడానికి అనుమతించడం రాజ్యాంగవిరుద్ధమని పేర్కొన్నారు.

లోకసభ ఎన్నికలు: అత్యధిక ధనవంతుడు గౌతమ్ గంభీర్లోకసభ ఎన్నికలు: అత్యధిక ధనవంతుడు గౌతమ్ గంభీర్

Fugitive offender tag is like an economic death penalty, Vijay Mallya tells Bombay High Court

అయితే ఆస్తుల స్వాధీనానికి సంబంధించిన విచారణ నిలిపివేయాలని మాల్యా తరఫు లాయర్ చేసిన అభ్యర్థును కోర్టు తిరస్కరించింది. దేశంలోని మాల్యా ఆస్తుల స్వాధీనాన్ని నిలువరిస్తూ ఇంజంక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కానీ మాల్యాకు కోర్టు తాత్కాలిక ఉపశమనం కూడా ఇవ్వలేదు.

ఈ వ్యాఖ్యలపై ఈడీ తరఫు లాయర్ స్పందించారు. ఎఫ్ఈవో చట్టాన్ని విజయ్ మాల్యా వంటి వ్యక్తుల కోసం తయారు చేశారని, రూ.100 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులను ఎగ్గొట్టిన ఎగవేతదారులను వెనక్కి తీసుకురావడానికి దీనిని ఉపయోగిస్తారని కోర్టుకు తెలిపారు. ఈ చట్టం క్రూరమైనదన్న వాదన సరికాదని పేర్కొన్నారు. ఆస్తులు స్వాధీనం చేసుకోవడం మొదలు అన్నింటిని కోర్టు విచారణ, ఉత్తర్వులకు అనుగుణంగానే తాము చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు.

మరోవైపు, ఎఫ్ఈఓ చట్టంలోని ప్రొవిజన్ల మీద మాల్యా చేసిన అభ్యర్థనపై స్పందించాలని ధర్మాసనం అటార్నీ జనరల్‌కు నోటీసులు జారీ చేసింది. ఎఫ్ఈవో చట్టంలోని ప్రొవిజన్ల కింద మాల్యాను స్పెషల్ కోర్టు ఎఫ్ఈఓగా ప్రకటించింది. చట్టంలోని ప్రొవిజన్లను, ఎఫ్ఈఓగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ బాంబే హైకోర్టులో మాల్యా వేరువేరు పిటిష్లను దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిగింది.

English summary

ఆర్థిక మరణదండనే: విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టులో దొరకని తాత్కాలిక ఊరట | Fugitive offender tag is like an economic death penalty, Vijay Mallya tells Bombay High Court

Fugitive businessman Vijay Mallya on Wednesday told the Bombay High Court that attaching his assets under the Fugitive Economic Offenders Act and declaring him a fugitive economic offender is like giving him an economic death penalty.
Story first published: Thursday, April 25, 2019, 13:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X