For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2019-20కి భారత్ వృద్ధి 7.3 శాతం: ఐఎంఎఫ్ అంచనా

|

ఏడీబీ (ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్), ఆర్బీఐ తర్వాత ఐఎంఎఫ్ కూడా 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధి రేటు అంచనాను 7.3 శాతంగా వేసింది. వచ్చే ఏడాది 7.5 శాతంగా ఉండవచ్చునని అంచనా. గత ఏడాది అక్టోబర్ అంచనాలతో పోల్చితే వరుసగా 0.1 శాతం, 0.2 శాతం తగ్గాయి. పెట్టుబడులు వెల్లువెత్తుతుండటం, పెరుగుతున్న వినియోగ సామర్థ్యం నేపథ్యంలో ప్రపంచంలోనే భారత్ అత్యంత వేగవంతమైన వృద్ధిగల దేశంగా నిలబెడుతున్నాయని అభిప్రాయపడింది.

<strong>బ్యాంకింగ్ మోసాల పట్ల జాగ్రత్త, ఈ సూచనలు పాటించండి</strong>బ్యాంకింగ్ మోసాల పట్ల జాగ్రత్త, ఈ సూచనలు పాటించండి

2018లో భారత జీడీపీ 7.1శాతంగా ఉండగా, చైనా జీడీపీ 6.6శాతంగా ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను భారత్ జీడీపీ 7.5 శాతంగా ఉండవచ్చునని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. క్రమేణా పెరుగుతున్న పెట్టుబడులు, ఎగుమతుల రంగంలో ప్రయివేటు సంస్థల మెరుగైన ప్రదర్శన, పుంజుకుంటున్న వినియోగ సామర్థ్యం దేశ వృద్ధి రేటును ఈసారి పెంచుతున్నాయని వరల్డ్ బ్యాంక్ అభిప్రాయపడింది. గత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధిరేటును 7.2 శాతంగా అంచనా వేసింది.

After ADB & RBI, IMF cuts India GDP growth forecast to 7.3% for 2019-20

ఇంటర్నేషనల్ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో ఐఎంఎఫ్ ప్రపంచ జీడీపీకి కోత విధించింది. వాణిజ్య భయాల నడుమ ఈ ఏడాది గ్లోబల్‌ జీడీపీ 3.3 శాతానికే పరిమితం కాగలదని అంచనా వేసింది. అయితే ఈ ఏడాది ద్వితీయార్ధంలో వృద్ధిరేటు పుంజుకోగలదని విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జీడీపీ 3.6 శాతానికి పెరుగవచ్చని పేర్కొంది.

English summary

2019-20కి భారత్ వృద్ధి 7.3 శాతం: ఐఎంఎఫ్ అంచనా | After ADB & RBI, IMF cuts India GDP growth forecast to 7.3% for 2019-20

The International Monetary Fund (IMF) on Tuesday cut India’s GDP growth forecast for 2019-20, following similar action by the Asian Development Bank (ADB) and the Reserve Bank of India (RBI).
Story first published: Wednesday, April 10, 2019, 16:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X