For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాట్సాప్ వాడేవారికీ బాంబు లాంటి వార్త! ఏంటో మీరే చూడండి.

By girish
|

ఫేస్ బుక్ కి చెందిన మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్ లో ఒక బగ్ ఉంది. వాట్సాప్ ఇన్ కమింగ్ వీడియో కాల్ ఆన్సర్ చేసినపుడు హ్యాకర్స్ ఆ యూజర్ల అకౌంట్లను హైజాక్ చేస్తున్నారు. యూజర్ల ఫోన్లలోని అప్లికేషన్స్ అన్నిటినీ తమ చెప్పుచేతల్లోకి తీసుకుంటున్నారని ప్రముఖ టెక్నాలజీ వెబ్ సైట్లు జడ్ డీ నెట్, ద రిజిస్టర్ ప్రకటించాయి. అటాకర్ నుంచి వచ్చిన కాల్ ఆన్సర్ చేశారంటే వాట్సాప్ ని, దాంతో పాటు మిగతా అప్లికేషన్స్ ను వాళ్ల చేతికి అందించినట్టేనని పరిశోధకులు తెలిపారు.

గత ఆగస్టులో

గత ఆగస్టులో

గత ఆగస్టులో యాపిల్, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ అప్లికేషన్స్ దాడికి గురైనపుడు దానిని ఫేస్ బుక్ అక్టోబర్ లో సరిదిద్దింది. గత ఏడాది ఫేస్ బుక్ పలు భద్రతాపరమైన సమస్యలను ఎదుర్కొంది. గత వారమే భద్రతా లోపాల కారణంగా 50 మిలియన్ల ఫేస్ బుక్ అకౌంట్లు దాడికి గురయ్యాయి.

వాట్సాప్ కొత్త ఫీచర్స్:

వాట్సాప్ కొత్త ఫీచర్స్:

వాట్సాప్‌ వినియోగదారుల కోసం నిత్యం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ దూసుకుపోతుంది. తాజాగా. మరిన్ని కొత్త ఫీచర్లను యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా. వాట్సాప్‌ గ్రూప్‌ సెట్టింగ్స్‌లో మార్పులు చేసింది.

గ్రూపు అడ్మిన్‌

గ్రూపు అడ్మిన్‌

దీనిప్రకారం సంబంధిత గ్రూపు అడ్మిన్‌ గ్రూప్‌ వివరాలను ఏ సభ్యుడు ఎడిట్‌ చేయవచ్చో అతనికి మాత్రమే అనుమతినిస్తూ సెట్టింగ్స్‌లో మార్పులు చేసే వెసులుబాటును తీసుకొచ్చింది. అంతేకాదు ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 2.18.142లో 'రిస్ట్రిక్టడ్‌ గ్రూప్‌' ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా గ్రూప్‌ ఐకాన్‌తో పాటు సబ్జెక్ట్‌, గ్రూప్‌ ఇన్ఫో ఎవరు అప్‌డేట్‌ చేయాలో అడ్మిన్‌ నిర్ణయించవచ్చు.

 అడ్మిన్‌ బ్లాక్‌

అడ్మిన్‌ బ్లాక్‌

వాట్సాప్‌ వెర్షన్‌ 2.18.84 ద్వారా స్టిక్కర్స్‌ ఆల్బమ్‌ను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతోపాటు గ్రూప్‌లోని సభ్యులను అడ్మిన్‌ బ్లాక్‌ చేసేలా మరికొన్ని ఫీచర్లను వాట్సాప్‌ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది.

 యాప్‌లో

యాప్‌లో

బ్రాడ్‌కాస్ట్ మెసేజెస్‌ కేటగిరీలోనూ మరో అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. తమ అడ్రస్‌ బుక్‌లో లేకపోయినా, సదరు నెంబరుకు బ్రాడ్‌ కాస్ట్‌ మెసేజ్‌ పంపేలా మార్పులు చేయబోతోంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వీడియోలను వాట్సాప్‌లోనే చూసే విధంగా యాప్‌లో మార్పులు చేసింది.

గ్రూప్స్‌

గ్రూప్స్‌

ఇక వాట్సాప్‌ బిజినెస్‌‌లో ఫిల్టర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సెర్చ్‌ ఆప్షన్‌ వద్ద ఫిల్టర్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయడం ద్వారా దీన్ని ఉపయోగించుకోవచ్చు. వినియోగదారులు ఇందులో 'అన్‌రీడ్‌ చాట్స్‌', 'గ్రూప్స్‌, బ్రాడ్‌ కాస్ట్ లిస్ట్' అనే మూడు ఎంపికలు ఉంటాయి. ఇప్పటిదాకా ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్న 'వాట్సాప్ బిజినెస్ యాప్' ఇకనుంచి ఐవోఎస్ వినియోగదారులకు కూడా అందుబాటులో ఉంటుంది.

Read more about: whatsapp
English summary

వాట్సాప్ వాడేవారికీ బాంబు లాంటి వార్త! ఏంటో మీరే చూడండి. | Whatsapp New Features Hacked

There is a bug in the messaging service of the Facebook book. Hackers are hijacking those users' accounts when Watsap incoming video call is done.
Story first published: Wednesday, October 10, 2018, 18:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X