For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దసరాకి బస్సు టికెట్ రిజర్వు చేసుకున్న ప్రయాణీకులకు ఇక ఇబ్బందే.మీరు కూడా టికెట్ బుక్ చేసుకున్నారా?

By girish
|

టికెట్ రిజర్వు చేసుకుంటున్న ప్రయాణీకులకు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) షాకిచ్చింది. ఆర్టీసీ రిజర్వ్‌డ్ టికెట్‌లో డ్రైవర్ నెంబర్‌ను ఆర్టీసీ అధికారులు తొలగించారు. డ్రైవర్ నెంబర్ స్థానంలో కేంద్ర సమాచార విభాగం నెంబర్‌ను ప్రవేశపెట్టారు. దసరా తర్వాత హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సర్వీసులకూ డ్రైవర్ నెంబర్‌ను తొలగిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

డ్రైవర్లు వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడటమే దానికి కారణం అని ఆర్‌టీ‌సీ అధికారులు తెలిపారు. అలా ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇకపై ఎవరూ డ్రైవర్‌కు ఫోన్ చేయవద్దని దగ్గరలోని బస్ స్టాండ్‌లో బస్సు వివరాలను కనుక్కోవాలని అధికారులు సూచించారు.

దసరాకి బస్సు టికెట్ రిజర్వు చేసుకున్న ప్రయాణీకులకు ఇక ఇబ్బందే.మీరు కూడా టికెట్ బుక్ చేసుకున్నారా?

దీంతో పాటు ఫిర్యాదులు, ఇతర వివరాల కోసం 24/7 కస్టమర్ కేర్ 0866-2570005 నంబర్‌కు కాల్ చేసి లేదా ఏపీఎస్ఆర్టీసీ యాప్‌లో లైవ్ ట్రాకింగ్ ద్వారా బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చన్నారు

ఏపీ‌ఎస్‌ఆర్‌టీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రయాణీకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. టికెట్ రిజర్వు చేసుకున్న ప్రయాణీకులకు ఇది ఇబ్బందే అని కొందరు అంటున్నారు.

ఆర్‌టీసీ టికెట్ రిజర్వ్ చేసుకున్నాక ప్రయాణ సమయానికి ముందు బస్సు నంబర్ వివరాలు, డ్రైవర్ పేరు, ఫోన్ నెంబర్‌లు వచ్చేవి. ప్రయాణీకులు బస్సు ఎక్కడుందో డ్రైవర్‌కు ఫోన్ చేసి అడిగి తెలుసుకొనేవారు. యాప్ అంటే ఇంటర్‌నెట్ ఉండాలి.. కస్టమర్ కేర్ అంటే ఫోన్ కనెక్ట్ అవ్వాలిగా అంటున్నారు ప్రయాణీకులు.

కానీ దినికి కారణం ప్రయాణికులే అని కొంతమంది అంటున్నారు ఆర్టీసీకి కొంతమంది ప్రయాణికుల నుంచి పిర్యాదులు రావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇంకా కొన్ని సంధర్భాలలో 30 మంది ప్రయాణికులు వచ్చిన ఒక ప్రయాణికుడు రాకపోతే ఒక 20 నిముషాలు బస్సు ఆపేయడం వల్ల ఇలా చాలా ఉన్నాయి అని సమాచారం.

ఈసారి టిక్కెట్ల మీద కూడా ముందుగానే అంటే ఒక 15 నిముషాలు ముందే మీకు సంబంధించిన బస్సు స్టాప్ దగ్గరకి రావాలి అని రాసి ఉంటుంది అని అధికారులు చెప్పారు.

కనుక మీరు ఈ దసరాకి ప్రధానంగా మెట్రో నగరాలలో హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు ఇక్కడ నుంచి ప్రయాణికులు బస్సు టికెట్ బుక్ చేసుకుంటే వారికీ బస్సు డ్రైవర్ రాదు కేవలం సీసీ నెంబర్ వస్తుంది అంతే.

Read more about: online
English summary

దసరాకి బస్సు టికెట్ రిజర్వు చేసుకున్న ప్రయాణీకులకు ఇక ఇబ్బందే.మీరు కూడా టికెట్ బుక్ చేసుకున్నారా? | Apsrtc Removed Bus Driver Number

The Andhra Pradesh Road Transport Corporation (APSRTC) has shocked the passengers traveling to the ticket. RTC officials removed the driver's number in the RTC reserved ticket.
Story first published: Wednesday, October 10, 2018, 16:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X