For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిరీద్యోగులకు పండగే.ఆంధ్ర ప్రదేశ్ కి మరో అగ్రస్థాయి సాఫ్ట్ వేర్ కంపెనీ.

2014 లో ఆంధ్ర మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలుగా విభజించబడ్డాయి.ఆంధ్ర ప్రదేశ్ నూతనంగా ఏర్పడిన రాష్ట్రము,కనీసం రాజధాని కూడా లేకుండా విడిపోయిన రాష్ట్రము.

By bharath
|

2014 లో ఆంధ్ర మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలుగా విభజించబడ్డాయి.ఆంధ్ర ప్రదేశ్ నూతనంగా ఏర్పడిన రాష్ట్రము,కనీసం రాజధాని కూడా లేకుండా విడిపోయిన రాష్ట్రము.గత నాలుగు ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో IT కంపెనీలు మరియు నిర్మాణ రంగాలు వచ్చి ఎంతో మందికి ఉద్యోగాలు మరియు ఉపాధి దొరికింది.ఇదే తరహాలో మరో అగ్రస్థాయి IT కంపెనీ ఒకటి రాబోతోంది.

రాష్ట్ర ప్రభుత్వం:

రాష్ట్ర ప్రభుత్వం:

నూతనంగా ఏర్పడిన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తరువాత,రాజధాని అమరావతి నిర్మించారు.తన రాజకీయ అనుభవంతో ఎన్నో IT కంపెనీలను మరియు వ్యాపార సంస్థలను ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు కృషి చేసారు.

రాష్ట్ర విభజన తరువాత:

రాష్ట్ర విభజన తరువాత:

ఆంధ్ర రాష్ట్రము విడిపోయాక అన్ని IT సంస్థలు తెలంగాణ రాష్ట్రానికే పరిమితం ఐయ్యాయి.పెద్ద పెద్ద కంపెనీలు అన్ని హైదరాబాద్ నగరంలో నిర్మించబడ్డాయి,అభివృద్ధి చెందిన హైదరాబాద్ నుండి ఆంధ్ర రాష్ట్రము విడిపోయాక మరిన్ని కంపెనీలు వచ్చి చేరాయి.

హెచ్సీఎల్(HCL):

హెచ్సీఎల్(HCL):

ఐటీ సేవల ప్రధాన హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్ లో రెండు సంస్థలను ఏర్పాటు చేయటానికి 750 కోట్ల రూపాయలను పెట్టుబడులు పెట్టనుంది. ఇది 10 ఏళ్ళలో 7,500 ఉద్యోగాలను సృష్టిస్తుంది.

అధికారిక ప్రకటన ప్రకారం, హెచ్సీఎల్ ఆంధ్రప్రదేశ్ లో రెండు దశల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు.

తొలి దశలో:

తొలి దశలో:

తొలి దశలో నోయిడాకు చెందిన కంపెనీ 400 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి గన్నవరం కేసరపల్లి గ్రామంలో ఆర్ అండ్ డి సెంటర్ నిర్మించనున్నారు. ఈ సౌకర్యం 4,000 మందికి పైగా ఐటీ నిపుణులను కల్పించాలని భావిస్తున్నారు.

అక్టోబరు 8:

అక్టోబరు 8:

అక్టోబరు 8 వ తేదీన ఈ ఫౌండేషన్ రాయిని ఏర్పాటు చేయనున్నట్లు, ఏడు సంవత్సరాల కాలానికి పూర్తవుతుందని, 4,000 మందికి పైగా IT నిపుణులను నియమించనున్నట్లు సంస్థ అధికారులు ప్రకటనలో వెల్లడించారు.

రెండో దశ:

రెండో దశ:

20 ఎకరాల ఆవరణలో ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో రెండో దశ చేపట్టనుంది.

ఈ దశలో పెట్టుబడులు 350 కోట్ల రూపాయలుగా ఉంటుందని, ఐదు సంవత్సరాల కాలంలో సుమారు 3,500 ఐటీ నిపుణులను కూడా చేర్చుతామని చెప్పారు.

కియా మోటార్స్:

కియా మోటార్స్:

అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ ఇది దక్షిణ కొరియా సంస్థ భారీ పెట్టుబడులతో కార్ల నిర్మాణ రంగం మొదలుపెట్టిన విషయం మనకు తెలిసినదే.మొదటి దశగా సంస్థ సుమారు 3 ,000 మంది ఉద్యోగస్తులను తీసుకుంటున్నట్టు ప్రకటించింది ఆ తరువాత ఇంకా కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం అని సంస్థ వెల్లడించింది.

Read more about: hcl andhra pradesh
English summary

నిరీద్యోగులకు పండగే.ఆంధ్ర ప్రదేశ్ కి మరో అగ్రస్థాయి సాఫ్ట్ వేర్ కంపెనీ. | HCL Tech To Invest Rs 750 Crore In Andhra Pradesh, Create 7,500 Jobs

IT services major HCL Technologies will invest Rs 750 crore to set up two facilities in Andhra Pradesh that will help create 7,500 jobs in 10 years.
Story first published: Monday, October 8, 2018, 15:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X