For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ ఫోన్ కు అతితక్కువకే ఇన్సూరెన్స్! త్వరగా చూడండి.

By girish
|

ఇ-కామర్స్ దిగ్గజ్ ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్లకు ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రకటించింది. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌తో ఒప్పందం చేసుకొని మొబైల్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్‌ని ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఈ ఇన్సూరెన్స్ పొందొచ్చు.

ఇన్సూరెన్స్ ఎలా పొందాలి?
ఫ్లిప్‌కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో మీరు ఏ మొబైల్ కొన్నా రూ.99 అదనంగా చెల్లించి ఈ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. మొబైల్ కార్ట్‌లోకి యాడ్ చేసేప్పుడే రూ.99 ఇన్సూరెన్స్‌ని ఎంపిక చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. బిల్లు చెల్లించేప్పుడు ఫోన్ ధరతో పాటు రూ.99 అదనంగా చెల్లిస్తే చాలు. ఇన్సూరెన్స్ తీసుకున్నట్టే. ఇందుకు సంబంధించిన కన్ఫర్మేషన్ మీ రిజిస్టర్డ్ ఇ-మెయిల్‌కు వస్తుంది.

ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ ఫోన్ కు అతితక్కువకే ఇన్సూరెన్స్! త్వరగా చూడండి.

ఏమేం కవర్ అవుతాయి?
సాధారణంగా మొబైల్‌కు ఇన్సూరెన్స్ తీసుకుంటే యాక్సిడెంటల్, స్క్రీన్, లిక్విడ్ డ్యామేజ్‌ ప్రొటెక్షన్ మాత్రమే లభిస్తాయి. అయితే ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేసే ఈ ఇన్సూరెన్స్‌లో యాక్సిడెంటల్ స్క్రీన్ డ్యామేజ్, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సమస్యలు, వాటర్ డ్యామేజ్‌తో పాటు అదనంగా థెఫ్ట్ కవర్(మొబైల్ చోరీకి గురైనా) ఇన్సూరెన్స్ లభిస్తుందని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. అయితే ఇది కేవలం ఈ సేల్‌కు మాత్రమే పరిమితం. రూ.99తో తీసుకునే ఇన్సూరెన్స్ కవర్ ఫోన్ డెలివరీ అయిన రోజు నుంచి ఏడాది వరకు మాత్రమే ఉంటుంది. క్రెయిమ్స్ కోసం కస్టమర్లు యాప్, ఇ-మెయిల్, ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ కావచ్చు. ఫ్లిప్ కార్ట్ కూడా ఆఫర్లు

Read more about: flipkart
English summary

ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ ఫోన్ కు అతితక్కువకే ఇన్సూరెన్స్! త్వరగా చూడండి. | FlipKart Giving Low Cost Mobile Insurance

E-Commerce Diggs Flipkart announced the insurance scheme for smartphones. Bajaj Alliance has signed a contract with General Insurance and announced the Mobile Protection Program.
Story first published: Monday, October 8, 2018, 14:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X