For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జియో మరో అద్భుతం:లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో.

రిలయన్స్ జీయో భారతదేశంలోని మొబైల్ నెట్వర్క్ పరిశ్రమలో పెను మార్పులు సృష్టించి ఘనత పొందింది, దాని యొక్క సరసమైన 4G పధకాలకు భారీ డేటా ఉపయోగానికి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

By bharath
|

రిలయన్స్ జీయో భారతదేశంలోని మొబైల్ నెట్వర్క్ పరిశ్రమలో పెను మార్పులు సృష్టించి ఘనత పొందింది, దాని యొక్క సరసమైన 4G పధకాలకు భారీ డేటా ఉపయోగానికి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం, మీరు జీయో ప్రీపెయిడ్ లో ఉన్నట్లయితే, మీరు అపరిమిత డేటా వినియోగం పొందవచ్చు,దీనికి మీరు అధిక-వేగం తో కూడిన ప్రణాళిక వేసుకుంటే మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ వినియోగ ప్రణాళికలు ప్రస్తుతం రోజుకు 1.5GB నుండి 5GB వరకు మారుతూ ఉంటాయి, రోజువారీ SMS తో పాటు పూర్తిగా ఉచిత మరియు అపరిమితంగా స్థానిక నెట్వర్క్ లో కాల్ చేస్తూ రోజుకు 5GB వరకు డేటా ఉపయోగం ఉంటుంది.

అయితే, మీరు రోజువారీ డేటా క్యాప్తో పని చేయకూడదనుకుంటే లేదా కొన్ని వారాల తర్వాత మీ కనెక్షన్ని రీఛార్జి చేయించాలి అనుకున్న వారికోసం రిలయన్స్ జియో లాంగ్ -టర్మ్ ప్రణాళికలను అందుబాటులో తెచ్చింది. ఈ ప్రణాళికలు అన్నింటిలో వాయిస్ కాలింగ్ స్థానిక మరియు జాతీయ (STD) కాల్స్ పూర్తిగా ఉచితం మరియు జీయో నెట్వర్క్లో భారతదేశం లోపల రోమింగ్లో ఉన్నప్పుడు కూడా ఉచిత వినియోగం వర్తిస్తుంది. అదనంగా, ఈ ప్రణాళికలు అన్ని రోజుకు 100 ఎస్ఎంఎస్లను అందిస్తాయి, వీటిలో వ్యత్యాసాలు మరియు డేటా సమర్పణలు ఉంటాయి. క్రింద రిలయన్స్ జీయో దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్రణాళికలు పరిశీలించండి.

రూ 999 ప్లాన్

రూ 999 ప్లాన్

ఇది అత్యంత సరసమైన దీర్ఘకాలిక పధకం, మరియు 4G మొబైల్ డేటా వినియోగం 90 రోజుల చెల్లుబాటు మరియు 60GB డేటా అందిస్తుంది. మీరు అధిక వేగం తో కూడిన డేటా వినియోగం ఐపోయాక, ప్రణాళిక వాలిడిటీ ఆదరంగా వినియోగం అపరిమితంగా ఉంది, అయితే వేగం 64kbps కి పడిపోతుంది. ఈ ప్రణాళిక నెలసరి వ్యయం రూ. 333 రూపాయలతో పోల్చి చూస్తే, ప్రయోజనం ఏమిటంటే రోజువారీ వాడుక పరిమితి షరతు ఉండదు, మీరు రోజుకు మీకు నచ్చినంత డేటాను ఉపయోగించే స్వేచ్ఛ ఉంటుంది, మిగతా మొత్తం వ్యాలిడిటీ అందుబాటులో ఉంచుతారు. ఈ విధంగా, మీరు ఒకేరోజు మొత్తం 60GB ఉపయోగించవచ్చు.

రూ 1,999 పథకం

రూ 1,999 పథకం

ఈ ప్లాన్ 125GB అధిక-వేగం డేటా అనుమతులతో 180 రోజుల ప్రామాణికతను అందిస్తుంది. రోజువారీ వాడుక పరిమితి లేదు అలాగే రోజువారి హై స్పీడ్ డాటాను ఎలా ఉపయోగించాలో వినియోగదారులకు సౌలభ్యాన్ని అందిస్తుంది.అదే విధంగా నెలకు రూ. 333 రూపాయల చొప్పున ఉంటుంది సగటున రోజుకు 694MB డేటా అందుబాటులో ఉంటుంది.

రూ 4,999 పథకం

రూ 4,999 పథకం

ఈ ప్లాన్ 360 రోజులు ప్రామాణికతతో వస్తుంది, 350GB హై-స్పీడ్ డేటా వినియోగాన్ని అందిస్తోంది. పైన పేర్కొన్న విధంగా,రోజువారీ ఉపయోగ పరిమితి లేదు అలాగే హై స్పీడ్ డేటా ఎలా వాడాలి అనేదానిపై వినియోగదారు సౌలభ్యాన్ని అందిస్తుంది. సగటున రోజువారీ డేటా భత్యం 972MBతో, నెలకు రూ .416 ఖర్చు అవుతుంది.

రూ 9,999 పథకం

రూ 9,999 పథకం

రిలయన్స్ జీయో నుంచి అత్యంత ఖరీదైన దీర్ఘకాలిక పథకం మీకు 360 రోజులు చెల్లుబాటు మరియు 750జీబి వేగవంతమైన డేటా వినియోగాన్ని అందిస్తుంది. ఈ ధర సగటున నెలకు రూ.833 రూపాయలు ఖర్చు అవుతుంది,రోజువారీ డేటా 2.08GB వాడకంతో వస్తుంది.ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ప్రణాళిక ఉపయోగం సౌలబ్యాన్ని అందిస్తుంది. అందువల్ల, ప్రత్యేకమైన రోజులలో అధిక-వేగ డేటాను వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు మరియు మిగతా రోజుల్లో తక్కువ ఉపయోగించవచ్చు, తద్వారా అవసరమైనప్పుడు ఎక్కువ ఉపయోగం ఉంటుంది.

Read more about: jio
English summary

జియో మరో అద్భుతం:లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో. | Reliance Jio Long Term Prepaid Plans: Everything You Need To Know

Reliance Jio is credited with changing the landscape of the mobile network industry in India, thanks to its enabling heavy data usage thanks to its affordable 4G plans.
Story first published: Wednesday, October 3, 2018, 12:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X