For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశీయ స్టాక్ మార్కెట్ ఢమాల్

By girish
|

స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. సెన్సెక్స్ 536 పాయింట్లు, నిఫ్టీ 175 పాయింట్లు పడిపోయాయి. 1.46 శాతం పతనంతో సెన్సెక్స్ 36305 పాయింట్ల దగ్గర ఆగగా, నిఫ్టీ 1.58 శాతం 11 వేల మార్కు కంటే దిగజారింది. ఉదయం మార్కెట్లు మొదలైనప్పటి నుంచే డౌన్‌ట్రెండ్ కనిపించింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల్లో అమ్మకాలు ఎక్కువగా కనిపించాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఇండియాబుల్స్ హౌజింగ్ ఫైనాన్స్ లాంటి సంస్థలు నష్టాల్లో పయనించాయి. బ్యాంకులు, ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్స్, ఫార్మాసూటికల్స్‌లోనూ నష్టాలు తప్పలేదు.

దేశీయ స్టాక్ మార్కెట్ ఢమాల్

అమెరికా, చైనా మధ్య దిగుమతి సుంకాలు అమల్లోకి రావడంతో మదుపరులు అప్రమత్తమయ్యారు. దీంతో అమ్మకాల జోరు కనిపించింది. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ లాంటి ఐటీ కంపెనీలు మాత్రమే లాభపడ్డాయి. క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 80 యూఎస్ డాలర్లకు చేరింది. దీంతో ఏవియేషన్ కంపెనీలపై ప్రభావం కనిపించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.72.64 చేరింది.

Read more about: stock market
English summary

దేశీయ స్టాక్ మార్కెట్ ఢమాల్ | Stock Market Crash Today

The stock market has fallen heavily. The Sensex plunged by 536 points and the Nifty fell by 175 points.
Story first published: Tuesday, September 25, 2018, 10:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X