For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలాంటి బ్యాంకు మేనేజర్ ఉంటె అంతే సంగతులు!

By girish
|

ఎక్కడైనా ఒక చోట దొంగతనం జరిగితే ముందుగా అక్కడ ఉండే వారిపైనే ఎక్కువగా అనుమానం వ్యక్తం చేస్తుంటారు పోలీసులు. ఇంటి దొంగలే అసలు నిందితులు అని తేలిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని

ఉత్తరప్రదేశ్‌లోని

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో జరిగిన ఓ ఏటీఎం చోరీ ఘటనలోనూ సేమ్ టు సేమ్ ఇలాగే జరిగింది. బ్యాంక్ మేనేజర్ స్వయంగా ఓ వ్యక్తితో ఏటీఎం నుంచి 18.37 లక్షల రూపాయలు దొంగలించేలా ప్లాన్ చేశాడని పోలీసులు కనిపెట్టారు. దొంగతనం చేసిన వ్యక్తికి బ్యాంక్ మేనేజర్‌కు పరిచయం ఎలా అయ్యిందో తెలుసుకుని పోలీసులే ఆశ్చర్యపోయారు.

అసలు స్టోరీలోకి

అసలు స్టోరీలోకి

అసలు స్టోరీలోకి వెళితే చేతన్ కుమార్ అనే వ్యక్తి బంటి కెరియా ప్రాంతంలోని ఏటీఎం నుంచి 18.37 లక్షలు దొంగిలించాడు. ఏటీఎం మిషన్ రిపేర్ కోసం అంటూ వచ్చి టెక్నికల్‌గా మిషన్‌ను తెరిచి లక్షల రూపాయల సొమ్ముతో ఉడాయించాడు. కొన్ని నెలల తరువాత చేతన్ కుమార్‌ను పట్టుకుని విచారించిన పోలీసులు బ్యాంక్ మేనేజర్ రాబిన్ బన్సల్ ఇచ్చిన సలహా కారణంగానే అతడు ఈ దొంగతనం చేశాడని తెలుసుకుని విస్తుపోయారు.

 రూ. 50 వేల

రూ. 50 వేల

తాను లక్ష రూపాయల లోన్ కోసం రాబిన్ బన్సల్‌ను కలిశానని ఆ సమయంలోనే అతడు ఈ దొంగతనం చేయాలని తనకు సలహా ఇచ్చాడని పోలీసులకు వివరించాడు. తాను చెప్పినట్టు చేస్తే రూ. 50 వేల ఇస్తానని రాబిన్ చెప్పినట్టు నిందితుడు చేతన్ పోలీసులకు వివరించాడు.

సినిమాల్లో

సినిమాల్లో

చేతన్ చెప్పిన వివరాలతో రాబిన్‌ను అరెస్ట్ చేయాలని భావించిన పోలీసుల ప్రయత్నాలు ఇంకా నెరవేరలేదు. చేతన్ పోలీసులకు చిక్కాడని తెలుసుకున్న రాబిన్ బన్సల్ వారికి దొరక్కుండా పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసులు అతడి కోసం గాలింపు మొదలుపెట్టారు. మొత్తానికి సినిమాల్లో చూపించిన విధంగా ప్లాన్ చేసిన బ్యాంక్ మేనేజర్ రాబిన్ నిర్వాకం చూసి పోలీసులే ముక్కన వేలేసుకున్నారు.

Read more about: bajaj
English summary

ఇలాంటి బ్యాంకు మేనేజర్ ఉంటె అంతే సంగతులు! | Bank Manger Plan to Rob ATM

Wherever one place is being stolen, the police are more susceptible to those who are there first. There are a number of instances where the home thief is the original abuser.
Story first published: Monday, September 24, 2018, 11:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X