For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మండుతున్న పెట్రోల్ ధరలను భరించలేక ప్రజలు ఈ బండ్ల పై మోజు చూపుతున్నారా?

By girish
|

పెట్రోల్ ధరలు పెరిగిపోతుండటంతో జనం ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నారు. లీటర్లకు లీటర్లు పెట్రోల్ పోసుకొని ప్రయాణించి డబ్బులు ఖాళీ చేసుకోవడం కంటే ప్రజా రవాణాను ఉపయోగించుకోవడం మంచిదని అనుకుంటున్నారు. అంతేకాదు ఇప్పుడు ప్రజల ఆలోచన ఇ-వెహికిల్స్‌వైపు మళ్లింది.

ఇ-టూవీలర్స్‌కు

ఇ-టూవీలర్స్‌కు

ఇ-టూవీలర్స్‌కు మారిపోతే వచ్చే ఐదేళ్లలో ఎంత పెట్రోల్ ఆదా అవుతుందో తెలుసా? అక్షరాలా లక్షా ఇరవై వేల కోట్లు. అవును మీరు విన్నది నిజమే. ఈ మాట చెప్పింది ఎవరో కాదు నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించిన విషయాలివి. భారతదేశంలో 17 కోట్ల టూవీలర్లు ఉన్నాయని అంచనా. ప్రతీ వాహనం రోజుకు అర లీటర్ తక్కువ పెట్రోల్ ఉపయోగిస్తే ఏడాదిలో 3400 కోట్ల లీటర్ల పెట్రోల్ ఆదా అవుతుందని అంచనా.

ఎలక్ట్రిక్ వెహికిల్స్‌

ఎలక్ట్రిక్ వెహికిల్స్‌

ఎలక్ట్రిక్ వెహికిల్స్‌తో పెట్రోల్ ఆదా అవడమే కాదు కాలుష్యం తగ్గుతుంది. గాలి నాణ్యత పెరుగుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం సైతం ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని ప్రోత్సహిస్తోంది. అంతే కాదు రూ.1.4 లక్షల వరకు సబ్సిడీ కూడా ఇస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తున్నది ఒక శాతం మాత్రమే.

పథకానికి

పథకానికి

2030 నాటికి 40 శాతానికి పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్(FAME-ఫేమ్) పేరుతో ప్రారంభించిన పథకానికి రెండో దశ కోసం రూ.4,500 కోట్లు కేటాయించింది కేంద్ర ఆర్థిక శాఖ. ఛార్జింగ్ ఏర్పాట్ల కోసం రూ.1,000 కోట్లు కేటాయించింది.

సబ్సిడీ

సబ్సిడీ

ప్రస్తుతం టాటా, మహీంద్ర కంపెనీల నుంచి ఎలక్ట్రిక్ కార్ కొంటే రూ.1.4 లక్షల సబ్సిడీ లభిస్తుంది. వాహన ఖర్చులో 20 శాతం వరకు సబ్సిడీ పొందొచ్చు. హైఎండ్ ఎలక్ట్రిక్ కార్లు కొనేవారు రూ.4 లక్షల వరకు సబ్సిడీ పొందొచ్చు.

లింక్

లింక్

అయితే ఆ మోడల్స్ ఇంకా ఇండియాలో లాంఛ్ కాలేదు. కార్లు మాత్రమే కాదు బైకులు, ఆటోలకు కూడా సబ్సిడీ పొందొచ్చు. ఇ-స్కూటర్ కొంటే రూ.22 వేల వరకు సబ్సిడీ పొందొచ్చు. ఏఏ వాహనానికి ఎంతవరకు సబ్సిడీ లభిస్తుందో ఈ కింది లింక్ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

https://www.fame-india.gov.in/ModelUnderFame.aspx

Read more about: petrol
English summary

మండుతున్న పెట్రోల్ ధరలను భరించలేక ప్రజలు ఈ బండ్ల పై మోజు చూపుతున్నారా? | People Buying E Bikes Due to Petrol Rates

People are thinking of alternatives as petrol prices are rising. It is good that the liter of petrol will be used to transport literature rather than use the public transport. And now the people's idea turned to e-vehiculars
Story first published: Monday, September 17, 2018, 10:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X