For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరలు తగ్గాయి త్వరగా కొనండి

By girish
|

ఇక దేశరాజధాని ఢిల్లీలో 99.9శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ.200 తగ్గి.. పదిగ్రాముల బంగారం రూ.31,400గా ఉండగా.. 99.5శాతం స్వచ్ఛతగల బంగారం ధర రూ.31,250కి చేరింది.

అంతర్జాతీయ

అంతర్జాతీయ

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో మొన్నటి వరకు భారీగా పెరిగిన పసిడి ధర ఇప్పుడు దిగివచ్చింది. శుక్రవారం నాటి బులియన్‌ మార్కెట్లో రూ. 200 తగ్గి 10 గ్రాముల బంగారం రూ. 31,400 పలికింది. ఇక వెండి కూడా పసిడి దారిలోనే పయనించింది. కొనుగోళ్లు లేకపోవడంతో రూ. 250 తగ్గింది. దీంతో నేటి మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 37,650గా ఉంది.

పసిడిలో

పసిడిలో

అంతర్జాతీయంగా పసిడిలో పెట్టుబడులు పెరిగినప్పటికీ దేశీయంగా నగల వ్యాపారులు, రిటైలర్లు, పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ లేకపోవడం వల్లే ఈ లోహాల ధరలు పడిపోయినట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. కాగా అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా పెరిగింది. సింగపూర్‌ మార్కెట్లో 0.61శాతం పెరిగి ఔన్సు బంగారం 1,208.20 అమెరికన్‌ డాలర్లు పలికింది. వెండి కూడా 0.78శాతం పెరిగి ఔన్సు ధర 14.25 అమెరికన్‌ డాలర్లుగా ఉంది.

ఢిల్లీలో

ఢిల్లీలో

ఇక దేశరాజధాని ఢిల్లీలో 99.9శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ.200 తగ్గి.. పదిగ్రాముల బంగారం రూ.31,400గా ఉండగా.. 99.5శాతం స్వచ్ఛతగల బంగారం ధర రూ.31,250కి చేరింది.

Read more about: gold
English summary

బంగారం ధరలు తగ్గాయి త్వరగా కొనండి | Gold rates down Today

Gold in the national capital was 99.9 per cent purity, while the gold price was Rs 31,400 per ten grams. The gold price of 99.5 per cent was Rs 31,250.
Story first published: Saturday, September 15, 2018, 16:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X