For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పతంజలి నుంచి మరి కొన్ని వస్తులువులు మార్కెట్లోకి అవి ఏవో మీరే చూడండి.

By girish
|

యోగా గురువు బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి సంస్థ వ్యాపార విస్తరణపై దృష్టి పెట్టింది. డైరీ రంగంలోకి పతంజలి ఎంట్రీ ఇచ్చింది. ఇక నుంచి మార్కెట్లో పతంజలి బ్రాండ్ పేరిట ఆవు పాలు, పాల ఉత్పత్తులు లభ్యం కానున్నాయి.

పతంజలి సంస్థ

పతంజలి సంస్థ

పతంజలి సంస్థ టెట్రా ప్యాక్‌లలో లీటర్ ఆవు పాలను రూ.40కి అందిస్తోంది. ఇతర పోటీ సంస్థల కంటే రూ.2 తక్కువకే పతంజలి పాలను విక్రయించనుంది. పతంజలి ఇప్పటికే ఆవు నెయ్యి, ఆవు పాల పొడిని విక్రయిస్తోంది.

అముల్

అముల్

డైరీ మార్కెట్లో ఇప్పటికే అముల్, మదర్ డైరీలు బలంగా పాతుకుపోయాయి. వీటికి పతంజలి పోటీ ఇవ్వనుంది. డైరీ రంగంలోకే కాకుండా దుస్తులు, చెప్పులను కూడా పతంజలి బ్రాండ్ పేరిట మార్కెట్లోకి తీసుకురానున్నారు

పాలు

పాలు

తొలి దశలో పతంజలి డైరీ ఉత్పత్తులను ఢిల్లీ-ఎన్‌సీఆర్, రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో విక్రయిస్తామని బాబా రాందేవ్ తెలిపారు. నిత్యం పది లక్షల లీటర్ల పాలు విక్రయించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని రాందేవ్ బాబా చెప్పారు. ఇందుకోసం 56 వేల మంది రిటైర్లతో పతంజలి నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుంది.

 పాల ఉత్పత్తుల

పాల ఉత్పత్తుల

తొలి రోజే 4 లక్షల లీటర్ల ఆవు పాలను ఉత్పత్తి చేసినట్టు పతంజలి ప్రకటించింది. పాల ఉత్పత్తుల ద్వారా 2020 నాటికి రూ.1000 కోట్ల రెవెన్యూ ఆర్జించాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే పాల ఉత్పత్తుల ద్వారా రూ.500 కోట్లు సంపాదించాలని పతంజలి భావిస్తోంది.

దివ్య జల్‌

దివ్య జల్‌

శీతలీకరించిన కూరగాయలతోపాటు దివ్య జల్ పేరిట ప్యాకెజ్డ్ డ్రికింగ్ వాటర్‌ను కూడా పతంజలి మార్కెట్లోకి తేవడానికి సన్నాహాలు చేస్తోంది. 250 ఎంఎల్, అరలీటర్, లీటర్, రెండు లీటర్లు, 5 లీటర్లు, 20 లీటర్ల చొప్పున దివ్య జల్‌ను పతంజలి విక్రయించనుంది.

Read more about: patanjali
English summary

పతంజలి నుంచి మరి కొన్ని వస్తులువులు మార్కెట్లోకి అవి ఏవో మీరే చూడండి. | patanjali Coming Up With New Products in Indian Market

Patanjali of Yoga Guru Baba Ramdev focuses on business expansion. Patanjali entered the diary field. The milk and dairy products are available in the name of Patanjali brand in the market
Story first published: Friday, September 14, 2018, 17:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X