For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చదువు మానేసి చరిత్ర సృష్టించిన సునీత! చూస్తే మీరు కూడా శభాష్ అంటారు!

By girish
|

ఆమె చదువు ఇంటర్ తోనే ఆగిపోయింది అలాగని ఆలోచలనాలు మాత్రం ఆగలేదు.పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు ఉన్నకూడా ఏదన్నా సాధించాలి అనే కోరిక బలపడిందే కానీ తగ్గలేదు. దాంతో తన తండ్రి పడిన కష్టాన్ని వ్యాపార ఆలోచనగా మార్చుకొని విజయపధంలో దీసుకుపోతున్నారు.

అన్నాడి సునీత కృష్ణ

అన్నాడి సునీత కృష్ణ

ఇంతకీ ఆమె ఎవరో కాదు విజయనగరం జిల్లా సాలూరు మండలానికి చెందిన అన్నాడి సునీత కృష్ణ గారు ఆమె ఈ స్థాయికి రావడానికి పట్టిన సమయం పదియేళ్లు అసలు ఆమె ప్రయాణం ఏంటో ఎన్నిఏళ్లలో ఎన్ని వడిదుడుకులు ఎదురుకున్నారో చూద్దాం.

 గుంటూరు జిల్లా

గుంటూరు జిల్లా

ఆమెది గుంటూరు జిల్లా వారి నాన్నగారికి అక్కడ వ్యవసాయం కలిసిరాక 1996 లో కుటుంబంతో సహా సాలూరుకు వచ్చేసారు. అప్పుడు ఆమెకు 10 ఏళ్ళు సాలూరుకి వచ్చాక ఒక 10 ఎకరాలు కౌలుకు తీసుకోని దానిలో పసుపు మరియు అరటి పండ్లు వేశారు.

గిట్టుబాటు ధరలు

గిట్టుబాటు ధరలు

కానీ వాటి వాళ్ళ లాభాలు రాలేదు గాలి వాళ్ళ అరటి చెట్లు నష్టాలు తెచ్చింది ఇక పసుపు సరైన గిట్టుబాటు ధరలు లేవు దానికి కారణం పసుపు కొమ్మలను పోలిష్ చేసే సదుపాయం వీరి దగ్గర లేకపోవడం. దాంతో అక్కడ వ్యాపారాలు చెప్పిన ధరలకే అమ్మి వచ్చేవారు.ఇలా కేవలం వారి నాన్నగారే కాదు చాలామంది రైతులు ఇలా బాధపడుతున్నారు అని ఆమెకి అర్ధమైంది.

 మొదటి సంత్సరం

మొదటి సంత్సరం

దీనికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అని అనుకున్నారు సునీత గారు కానీ ఆమె కుటుంబ ఆర్ధిక పరిస్థితుల దృశ్య ఆమె ఇంజనీరింగ్ మొదటి సంత్సరం చదువుతున్నప్పుడే ఆమెకు పెళ్లి చేశారు. ఇక పెళ్లి అయ్యాక మద్రాస్ వెళ్లిపోయారు ఆ తర్వాత పిల్లలు ఆ తర్వాత తన పిల్లలు బాగోగులు చూసుకొనేకి ఆరుఏళ్లు గడిచిపోయాయి.

సొంతఊరికి

సొంతఊరికి

ఇక తన పిల్లలు స్కూల్ కు వెళ్లడం మొదలు పెట్టక తాను మళ్ళీ పసుపు వ్యాపారం గురించి ఆలోచించింది.ఇక దీనికోసం ఆమె భర్త మరియు ఆమె అత్తమామలు అందరు ఆమెకు మంచి ప్రోత్సాహంతో తనకు సహాయం చేశారు.దాంతో ఆమె తన సొంతఊరికి సాలూరుకి వచ్చేసింది.

పసుపు కొమ్మలు

పసుపు కొమ్మలు

ఇక ఆమె సాలూరుకు వచ్చాక అరకు, పాడేరు, పాచిపెంట, గుమ్మలక్ష్మీపురం, ఇలా చాలా ఊరులు తిరిగారు అక్కడ రైతులు ఇంకా పసుపు కొమ్మలు పోలిష్ చేయటానికి ఇంకా ఇబ్బంది పడుతున్నారు అని తెలుసుకొంది.

మిషిన్

మిషిన్

ఇంకేముంది ఒక చిన్న పసుపు పోలిష్ మిషిన్ తెచ్చి దాంతోనే వ్యాపారం మొదలు పెట్టాలి అనుకొంది.ఇక బ్యాంకు లోన్ కోసం తిరగని బ్యాంకు లేదు. పోయినచోటు అంత అమ్మాయివి నువ్వు ఏమి వ్యాపారం చేస్తావ్ అని అన్నవారు ఎక్కువ!ఆ తర్వాత పరిశ్రమ అనుమతుల కోసం ఒక ఏడాది పాటు కష్టపడలిసి వచ్చింది.

కేవిఐసి

కేవిఐసి

కొంతకాలానికి ఆమె ఆత్మవిశ్వాసం గుర్తించిన కేవిఐసి (KVIC) ఖాదీ గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఆమెకు రూ.2 .50 లక్షలు రుణం ఇచ్చారు. దాంతో సునీత గారు వ్యాపారం మొదలు పెట్టారు.ఇక పసుపు కొమ్మలు పోలిష్ చేయడం వాళ్ళ పసుపు కొమ్మలు మంచి ధర పలికేవి.

 లాభాలు లేవు

లాభాలు లేవు

ఇక పసుపు కొమ్మలు పోలిష్ చేయించడానికి వచ్చే రైతుల సంఖ్య పెరిగింది కానీ లాభాలు లేవు. అయినా కొన్నాళ్లు సునీత గారు కష్టపడ్డారు.ఆ తరువాత పాలిషింగ్ తో ఆపేయకుండా పసుపు దుంపలను ఆమె కొనుగోలు చేస్తే బాగుంటుంది అని సునీత గారు ఆలోచించారు.

అవసరాన్ని

అవసరాన్ని

ఇక పసుపు దుంపలు మార్కెట్లో డిమాండ్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కోసం ఆమె తమినాడు, కేరళ మరియు మహారాష్ట్ర వెళ్లి అక్కడ వ్యాపారులతో మాట్లాడారు. అప్పుడే ప్రాంతాలు పట్టి పసుపు వాడే విషయంలో వేరువేరు ఉంటాయి అని ఆమెకి అర్ధమైంది. ఆ అవసరాన్ని తెలుసుకొని వాటికీ అనుగుణంగా ఇతర రాష్ట్రాలకి ఎగుమతి చేయడం ప్రారంభించింది.

 డిమాండ్

డిమాండ్

ఇక పసుపు కొమ్మలు మరియు పసుపు దుంపలు కాకుండా పసుపు పొడి చేసి ప్యాకెట్లు కూడా తయారు చేసి ఎగుమతి చేయడం ప్రారంభించింది. పైగా ఇక సాలూరు పసుపు అంటే ఆర్గానిక్ అని పేరు రావడంతో పసుపుకి ఇంకా డిమాండ్ పెరిగింది.

 రూ.6 కోట్ల

రూ.6 కోట్ల

ప్రస్తుతం సునీత గారి వ్యాపారం రూ.6 కోట్ల టర్న్ ఓవర్కి చేరింది. అంతే కాకుండా ఆమె 60 మంది పైగా మహిళలకు ఉపాధి కలిపిస్తూన్నారు. ఆత్మవిశ్వాసం ఉంటె ఎన్ని అడ్డంకులు వచ్చిన ఎన్ని ఎదురు దెబ్బలు తిన్న కలల గమ్యానికి చేరవచ్చు అని సునీత గారు నిరూపించారు.

Read more about: business ideas
English summary

చదువు మానేసి చరిత్ర సృష్టించిన సునీత! చూస్తే మీరు కూడా శభాష్ అంటారు! | Business Ideas in Telugu

Her studies was stopped with the inter but the thoughts did not stop. The desire to achieve what should have been done with the two children, This changes the business of his father to the commercial business and laughing at the success.
Story first published: Wednesday, September 12, 2018, 13:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X