For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాడు కూలి నేడు 15 కంపెనీల చైర్మన్ ఎలా అయ్యాడో తెలుసా?

By Sabari
|

కడుపు నిండా భోజనం, అతుకులు లేని బట్టలు, కాళ్లకి చెప్పులు మన్యం మధు సుధన్ రావు వీటికోసం తన చిన్నప్పుడు నుంచి కలలు కంటూ పెరిగాడు. ఒక 30 ఏళ్ళు ముందుకు వస్తే ఇప్పుడు అయన 11 సంస్థలు ఉన్న MMR గ్రూప్స్ చైర్మన్ వందల కోట్ల వ్యాపారాలకు వందల మంది ఉద్యోగులకి అధినేత విదేశీ డాక్యూమెంటరీలు మరియు స్వదేశీ పుస్తకాలలో చోటు దక్కించుకున్న వ్యక్తి.

 సినిమా పాటలలో

సినిమా పాటలలో

మన సినిమా పాటలలో హీరోలాగా MMR ఒక రోజులో ఈయన ఇంత స్థాయికి ఎదగలేదు. ఈయానికి చిన్నప్పటి నుంచి కటిక పేదరికం మరియు ఏదో ఒకటి సాధించాలి అని కసి.

ఇప్పుడు ఈయన విదేశీ మీడియాలో మారుమోగుతున్న పేరు కానీ మన జనాలకి పెద్దగా తెలియని పేరు ఈయన డిప్లమా చదివి తాపీ పని , వాచ్ మ్యాన్ , మరియు టెలిఫోన్ పోల్ నాటడానికి గుంతలు తవ్వయాడు. మెల్లగా టెలికాం కాంట్రాక్టర్గా ఎదిగి మైనింగ్ మరియు ఐటీ స్టాఫ్ ఇలా అంచెలులంచెలుగా ఎదిగాడు.

 మరుమూలా పల్లె

మరుమూలా పల్లె

5 ఏళ్లలో రూ.5000 కోట్ల కంపెనీకి ఎదగాలి అని టార్గెట్ తాపీ కూలి ,వాచ్ మ్యాన్ , గుంతలు తవ్వడానికి వచ్చిన ఒక 22 ఏళ్ల కుర్రాడు తాను ఒక రూ.100 కోట్లు టర్న్ ఓవర్ చేసే కంపెనీకి చైర్మన్ అవుతాడు అని ఉహించగలడా. మరుమూలా పల్లె నుంచి వచ్చిన ఒక యువకుడు ఇలా సమాజంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదిస్తాను అని అనుకుంటాడా?

నిజజీవితంలో

నిజజీవితంలో

సాధారణంగా సినిమాలో హీరోలు ఒక పాట అయిపోయేలోపల కొట్టేశ్వర్లు అవ్వడం మనం చూసాం, కానీ నిజజీవితంలో ఎక్కడ చూడలేము. కానీ తన చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

 ప్రకాశం జిల్లా

ప్రకాశం జిల్లా

మధుసూదన్ రావుది ప్రకాశం జిల్లా కందుకూరులోని పాలకూరు గ్రామం తండ్రి పేరయ్య తల్లి రాములమ్మకి పుట్టిన ఎనిమిది మంది సంతానంలో మధుసూదన్ రావు 5 వ వాడు. ఊరికి దూరంగా ఎక్కడో ఉండేది వీరి ఇల్లు ఇక్కడా మగవారు ఎవరు మోకాలి కింద వరకు కట్టకూడదు ఆడవారు ఎవరు జాకెట్లు కూడా వేసుకోకూడదు. ఒరేయ్ .. ఒసేయ్ ఇవి ఊరి జనాలు వీరికి ఇచ్చిన పేర్లు. వీరికి వారసత్వంగా వచ్చినది పేదరికం మాత్రమే.

 కూలి పని

కూలి పని

తాపీ పని మరియు కూలి పని ఇక తన తల్లి పొగాకు పని అందరు పని చేస్తే తప్ప ఇల్లు గడవని పరిస్థితి మూపుటాల తాగేది తినేది గంజి మరియు రాగి సంగటి అలాంటి వాతావరణంలో పుట్టి పెరిగాడు మధుసూదన్ రావు ఇక 6 వ తరగతి వరకు ఊరిలో చదువు ఇక అంతమందిని పోషించడం తన తండ్రి వల్ల కాలేదు. ఎనిమిది త్యాగాల వల్ల మధుసూదన్ మరియు తన అన్న చదువుకోగలిగారు.

సంక్షేమ హాస్టల్లకి

సంక్షేమ హాస్టల్లకి

ఇక అన్నదమ్ముల మకాం సంక్షేమ హాస్టల్లకి మారింది అక్కడైనా మంచి భోజనం దొరుకుతుంది అని అనుకున్నారు అక్కడ కూడా నీళ్ల మజ్జిగలో పురుగులు వచ్చేవి అని మధుసూదన్ రావు చెప్పారు.ఇక వేరే గతిలేక అక్కడే ఉండి టెన్త్ మరియు ఇంటర్మీడియట్ చదివి ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు. బీటెక్ చదివే అవకాశం వచ్చిన ఆర్ధిక పరిస్థి సహకరించలేదు.

 హైదరాబాద్

హైదరాబాద్

మధుసూదన్ అన్న అప్పటికే బీటెక్ చదువుతుండడంతో మధుసూదన్ డిప్లొమా చేరాడు. ఇక వీరి చదువు అయిపోగానే అన్నదమ్ములు ఇద్దరు హైదరాబాద్ వెళితే ఉద్యోగాలు పక్క అనుకున్నారు కానీ అది అంత సులువు కాదు అని తెలుసుకున్నారు ఆలా అని తిరిగి ఊరు వెళ్లలేని పరిస్థితి కొడుకు ఇద్దరు పట్టణంలో సంపాదించి వారిని ఆదుకున్నారు అని ఇంట్లో వారి నమ్మకం కానీ ఇక్కడ చూస్తే ఉద్యోగాలు లేవు.

 కూకట్ పల్లి

కూకట్ పల్లి

చేసేది ఏమిలేక హైదరాబాద్ కూకట్ పల్లి లో ఉన్న అక్క దగ్గరకి వెళ్లారు ఇక్కడ తన అక్క మరియు బావ నిర్మాణ కూలీలుగా ఉన్నారు. ఆ ఇంట్లో ఇద్దరికంటే ఎక్కువ మంది పనుకోలేరు కూర్చుకోలేరు ఎలాగో ఒకలాగా ఒప్పించి అక్కడే ఉండి పోటీ పరీక్షలకి చదువుకున్నాడు కానీ ఫలితం ఏమి లేదు చేసేది ఏమి లేక అక్క బావతో కలిసి కూలి పనికి పోయాడు. బీటెక్ చదివి కూలి పనికి పోయేది ఏంటి అని అనుకోకుండా తన కుటుంబం గురించి ఆలోచించి వారికీ నెలనెల డబ్బులు పంపే వాడు ఇలా తన జీవితం కూలి వాడిగా మొదలు పెట్టాడు.

కంపెనీ ఇంటర్వ్యూ

కంపెనీ ఇంటర్వ్యూ

ఒక రోజు ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా ఒక కంపెనీ ఇంటర్వ్యూ వెళ్లారు మధుసూదన్ అక్కడ నిరాశే కానీ అక్కడ ఇద్దరు మాటలాడుకుంటున్న మాటలు మధుసూదన్ వినకపోయింటే తన ఇంత వాడిని అయ్యేవాడిని కాదు అని చెబుతున్నారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు తమ టెలి ఫోన్ కేబుల్కి కూలీలు దొరకడం లేదు అని పనికి చాల కష్టంగా ఉంటుంది అని చెబుతుంటే మధుసూదన్ విన్నాడు.

ఊరిలో పని లేకుండా

ఊరిలో పని లేకుండా

తమ ఊరిలో పని లేకుండా చాలా మంది ఉన్నారు అని వారిని నేను తీసుకొస్తా అని చప్పగా కంపెనీ వారు నమ్మలేదు ఇక మధుసూదన్ రావు పదే పదే అడగగా సరే అడ్వాన్స్ ఏమి ఇవ్వకుండా రాత్రికి అందర్నీ సైట్ దగ్గరకి తీసుకోనిరమన్నారు. ఇప్పుడు ఊరి వారందరిని అడ్వాన్స్ ఇవ్వకుండా ఎలా పిలుచుకొని పోవడం అని ఆలోచించాడు. ఇక ఎవర్నన్నా డబ్బు అడుగుదామా అంటే తనకు హైదరాబాద్లో తన అక్క బావ తప్ప ఎవరు తెలీదు.

కడుపు నిండా

కడుపు నిండా

ఇక చేసేది ఏమి లేక తన అక్కని ఒక రూ.3000 సర్ధమన్నాడు రాత్రికి అంతా ఇస్తానున్నాడు. ఇక తన అక్క అందరిని అడిగి ఒక రూ.900 తెచ్చి ఇచ్చింది. ఇక వెంటనే ఒక బండిలో పక్కనే ఉన్న బస్తీలో ఒక 15 మంది కూలాల్ని తీసుకొచ్చి సైట్ దగ్గర పని చేపించి భోజనం మరియు టీ ఇప్పించేవాడు. మొదటి రోజు చేసిన పనికి మధుసూదన్ కు వ్ వచ్చిన ఆదాయం రూ.20000 అన్ని పోగా మిగిలిన డాబు అక్కకి ఇచ్చి అంతా కడుపు నిండా భోజనం చేశారు.

 మోసం

మోసం

ఇక అక్కడి నుండి మధుసుధన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు రూ.20000 నుంచి రూ.2 కోట్ల కాంట్రాక్టర్ గా ఎదిగాడు. ఊర్ల నుంచి కూలీలను పిలిపించి వారికీ మోసం చేయడకుండా డబ్బులు ఇచ్చి పని చేయించుకునే వాడు ఇది చుసిన ఒక పెద్దాయన ఎన్ని రోజులు ఇలా చిన్న కాంట్రాక్టులు చేస్తావ్ నాతో చేయి కలుపు స్టేట్ మొత్తం దుములేపుదాం అని చెప్పారు.ఇక ఒక కంపెనీ పెట్టాలి అని చెప్పాడు దీన్ని గుడ్డిగా నమ్మిన మధుసూదన్ రావు తాను సంపాదించింది అంతా తిసుకేళి తన చేతిలో పెట్టాడు. తీర ఒకసారి డబ్బులు కావాలి అని మధుసూదన్ అడిగితి కంపెనీ నష్టాలలో ఉంది అని ఇచ్చేది లేదు అని చెప్పడంతో అతని కాళ్ళ కింద భూమి కదిలినంత పని అయింది.

సెకండ్ లైఫ్

సెకండ్ లైఫ్

అంగబలం, అర్ధబలం లేక మధుసూదన్ వెనక్కి తిరిగాడు దీనికి తోడు బెదిరింపులు ఇంకా చేసేది ఏమి లేక ఎక్కువ రోజులు బాధపడితే చేస్తుంది ఏమి లేదు అని బెంగుళూరులో ఒక కంపెనీలో పనికి చేరాడు నెలకు రూ.10 వేలు జీతం అది కూడా టెలికాం రంగానికి సంబంధించి ఇలా జీవితం గడిచిపోవడం సరికాదు అని తెలుసుకొని తన భార్య తరుపున నుంచి రూ.3 లక్షల వార్ప్ర్రాకు పోగేసాడు మళ్లీ కంపెనీ పెట్టాడు ఇదే మధుసూదన్ గారికి సెకండ్ లైఫ్ ఇప్పుడు MMR కి 40 ఏళ్ళు.

 7 ఏళ్లలో రిటైర్

7 ఏళ్లలో రిటైర్

మరో 7 ఏళ్లలో రిటైర్ అయిపోతా అని అంటున్నారు. ఇలా రిటైర్ ఐన తర్వాత ఒక ట్రస్ట్ పెట్టి అందరికి సహాయం చేయాలి అని అనుకుంటున్నాడు . తన లాగా ఎవరు తిండి కోసం బాధపడకూడదు అని అలాగే 25 ఏళ్ల నుంచి కుటుంబంతో సరిగ్గా గడపలేదు అని ఇక పై గడపాలి అని అనుకున్నట్లు అలాగే తన తక్షణ కర్తవ్యలు పూరీచేసి హాయిగా ఉండాలి అని అనుకుంటున్నట్లు అయన చెప్పారు.

బాధాకరం

బాధాకరం

ప్రస్తుతానికి ఈయన దళిత్ ఇండియన్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక తన గురించి డిఫైనింగ్ ది ఆడ్స్, ది రైస్ అఫ్ దళిత్ పుస్తకాలలో ప్రధానంగా ప్రచురించారు.విదేశీ పత్రికలూ కూడా మధుసూదన్ రావు గారి గురించి ప్రచురించాయి కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏమిటి అంటే మన తెలుగు వారికీ ఈయన గురించి తేలికపోవడం బాధాకరం!

Read more about: business
English summary

నాడు కూలి నేడు 15 కంపెనీల చైర్మన్ ఎలా అయ్యాడో తెలుసా? | Inspirational Story Of MMR Company CEO

He is the chairman of the MMR Group, which has 11 companies in the hundreds of millions of businessmen who are in charge of foreign diplomas and home books.
Story first published: Monday, September 10, 2018, 12:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X