For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్ కార్డు ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

By Sabari
|

క్రెడిట్ కార్డ్ ఇప్పుడు అదో అవసరం. అవసరానికి ఆదుకునే నేస్తం. జేబులో క్రెడిట్ కార్డుంటే అదో ధీమా. అయితే ఎక్కడ పడితే క్రెడిట్ కార్డు వాడటం వల్ల మోసాలకు గురవుతుంటారు అనేకమంది. ఈ రోజుల్లో దొంగతనాలంటే కేవలం జేబులు కొట్టేయడం మాత్రమే కాదు. ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో కూర్చొని మీ అకౌంట్ ఖాళీ చేసే ఘనులున్నారు. అలాంటి మోసగాళ్లను పట్టుకోవడం కూడా కష్టమే. అందుకే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

క్రెడిట్ కార్డు ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

1. షాపింగ్ మాల్‌లో స్వైపింగ్‌కు ముందు పీఓఎస్ మెషీన్‌ను పరిశీలించాలి.
2. ఎవరికీ కనిపించకుండా మీ పిన్ ఎంటర్ చేయాలి.

3. బిల్ కాపీని తీసుకొని సరిచూసుకోవాలి.

4. రెండుసార్లు పేమెంట్ జరిగినట్టైతే బ్యాంకును సంప్రదించాలి.

5. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసిన తర్వాత సదరు వెబ్‌సైట్ నుంచి లాగౌట్ కావాలి.
6. పేమెంట్స్ చేసేప్పుడు పబ్లిక్ వైఫై ఉపయోగించవద్దు.
7. ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఫిషింగ్ లింక్స్, పాప్-అప్స్‌తో జాగ్రత్త.
8. అనుమానాస్పద లింక్స్‌పై క్లిక్ చేయొద్దు.
9. ఎప్పటికప్పుడు క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్స్ పరిశీలిస్తుండాలి.
10. అవసరంలేని పాత బ్యాంక్ స్టేట్‌మెంట్స్, బ్యాంక్ అప్లికేషన్స్, జిరాక్స్ కాపీస్ చించెయ్యాలి.
11. క్రెడిట్ కార్డు లావాదేవీల్లో తేడా వచ్చినట్టు అనిపిస్తే వెంటనే బ్లాక్ చేయించాలి.
12. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ పంచుకోవద్దు.
13. బ్యాంకు సిబ్బంది కాల్ చేసి వ్యక్తిగత పిన్, ఓటీపీ, కార్డు నెంబర్లు అడగరు.
14. మీకు ఏదైనా సందేహం వస్తే బ్రాంచ్‌కు వెళ్లి కలవాలి.

Read more about: credit cards
English summary

క్రెడిట్ కార్డు ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు | Credit Card and Its Importance

The credit card now needs something. Need help. If you have a credit card in the pocket, Wherever you use credit card, you are fraudulent
Story first published: Friday, September 7, 2018, 12:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X